అటూ ఇటూ దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రా౦త౦. రెండు కనుమల మధ్య ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతు౦ది గోదావరి. తెలుగు రాష్ట్రాలలో అత్యంత సుందర ప్రాంతాలలో ముందు వరసలో ఉంటాయి పాపికొండలు. ఇవి ఖమ్మం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. పాపికొండల ప్రాంతంలో ఎటు చూసినా పచ్చతనమే..ఇక్కడి చెట్లు ఆకులు రాల్చవు.ఇదే పాపికొండల ప్రత్యేకత. సుందరమైన, ఆహ్లాదకరమైన ప్రదేశ౦ పాపికొ౦డలు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొ౦డలు వద్ద గోదావరి చాలా లోతుగా ఉ౦టు౦ది. దీనికి కారణ౦ రె౦డు కొ౦డల నడుమ నది ప్రవహి౦చటమే.
పాపికొండలకు అటు భద్రాచలం,ఇటు రాజమండ్రి ఇరు ప్రాంతాల నుంచి టూరిస్ట్ పాకేజీలున్నాయి.పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. ఇక్కడ చాలా తెలుగు సినిమాలు చిత్రీకరి౦చబడ్డాయి. అయితే భద్రాచలం నుంచి వచ్చే యాత్రికులకు పాపికొండల కంటే ముందే పేరంటాలపల్లి,శ్రీరామగిరి,పోచారం వంటి ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రాంతాలు చూడవచ్చు.
Source:Wiki pedia
శ్రీ రామగిరి :
భద్రాచలం నుంచి పాపికొండలు యాత్ర చేసే వారు ముందు ఇక్కడికి లాంచీ పై చేరుకొని శ్రీ రాముని దర్శించుకు౦టారు. ఈ ఆలయం ప్రత్యేకత దేశం లో దక్షిణాభిముఖంగా ఉన్న అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతాన్ని రాముడు సంచరించిన నేలగా చెబుతారు.. శ్రీరామచంద్ర మూర్తి మాయ లేడి వెంటపడుతూ వచ్చి ఈ ప్రాంతంలోనే ఓ రాయి పై కుర్చొని సేద తీరారని పురాణాలలో చెప్పబడి౦ది. శ్రీరామగిరి ప్రాంతానికి కొంచెం ముందుగానే శబరీ-గోదావరి నదుల సంగమం ఉంటుంది. శ్రీరామగిరి వద్ద ఈ రెండు నదులూ వేరు వేరుగానే ప్రవహిస్తాయి.
పేరంటాలపల్లి :
శ్రీరామగిరి నుంచి పాపికొండలు లాంచీ ప్రయాణంలో ఈ ప్రాంతం వస్తుంది. ఇక్కడే ఓ పురాతన శివాలయం ఉంటుంది.ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయడానికి అర్చకులు ఎవరూ ఉండరు. గిరిజనలే భక్తి శ్రద్దలతో పూజిస్తారు. యాత్రికులకు వారి వెదురు,కలప ఉపయోగించి చేసిన కలాకృతులను అమ్మి జీవనం సాగిస్తుంటారు.
పోచారం :
ఈ ప్రా౦త౦ ప్రకృతి రమణీయతకు నెలవైన చోటు. పర్యాటకులు బస చేయటానికి వీలుగా ఇక్కడ వెదురుతో తేసిన హట్స్ ఏర్పాటు చేశారు.. ఇక్కడ గిరిజన లు చేసే వ౦టలు ఎంతో ప్రసిద్ది.