Godavari-ఓ చల్ల గాలి లాంటి సినిమా: Here's Why The Movie Will Always Be Special

Updated on
Godavari-ఓ చల్ల గాలి లాంటి సినిమా: Here's Why The Movie Will Always Be Special
Contributed by Hari Atthaluri గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా అవన్నీ సూపర్ హిట్ యే.... అలాంటి "గోదావరి" నే టైటిల్ గా పెట్టి.. మనుషుల మధ్య సున్నిత భావ బేధాలను.. మనసుకు హత్తుకునే పాత్రలు గా మలిచి.. ఒక మంచి ఫీల్ గుడ్ తీశారు మన శేఖర్ ఖమ్ముల.. ఇప్పటికీ ఎన్ని సార్లు చూసినా.. ఇంత కూడా బోర్ కొట్టదు ఈ మూవీ.. నిజంగా భద్రాచలం కి బోట్ జర్నీ మనమే చేస్తున్నట్టు.. ఆ పక్కనే పాపి కొండలు ఉన్నట్టు.. ఈ పక్కనే ఇది అంతా జరుగుతున్నట్టు.. ఆ పాత్రలు మన చుట్టూనే ఉన్నట్టు.. చాలా అంటే చాలా సహజం గా కనిపిస్తుంది.. ఆ ప్రయాణం అపుడే అయిపోయిందా అనిపిస్తుంది.. రాముడు సీత అనే రెండు పాత్రల మధ్య పుట్టే అందమైన ప్రేమని..ఆ ప్రేమ పుట్టే పడవ ప్రయాణాన్ని, అంతే అందంగా.. అద్భుత దృశ్య కావ్యం గా చూపించారు... ఇందులో ప్రతీ పాత్ర.. ప్రతీ మాట.. ప్రతీ పాట.. సందర్భానుసారంగా ఉంటాయి.. చాలా అంటే చాలా ఓపిగ్గా.. చక్కగా..మనసు పెట్టి చెక్కినట్లు ఉంటాయి.. ఎంతగా అంటే ఒక small example.. ఒక సిగ్నల్ దగ్గర.. కథ లోని నాలుగు పాత్రలు. వాళ్ళ తీరు ఎలా ఉంటుందో చాలా సింపుల్ గా చూపించారు... పెట్రోల్ లేదు అని, డబ్బు ఇవ్వలేక సీత ఫుడ్ ఇస్తుంది.. రామ్ ఐతే ఉన్నది అంతా ఇచ్చేసి బండి తోసుకుంటూ వెళ్తాడు.. రాజి అసలు పట్టించుకోదు.. రవీందర్ ఐతే వాళ్ళని వ్యాన్ లో ఎక్కిస్తాడు.. ఇందులో ఎవరు చేసింది కరెక్ట్ ఏది అంటే ఇదీ అని చెప్పలేం !! కానీ ఎవరకి వాళ్ళకి వాళ్ళు చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది.. అలా ఎవరి character వాళ్ళది.. దాన్ని రెస్పెక్ట్ చేయాలి... పెళ్లి ఐన తర్వాత కూడా independent వుండాలి గా ఉండాలి అని సీత అనుకుంటుంది.. నలుగురి కోసం బ్రతకాలి అని రామ్ అనుకుంటాడు... సీత "రామ్" విషయం లో దాన్ని Respect చేస్తుంది రామ్ కూడా సీత విషయం లో అలాగే support చేస్తాడు.. https://youtu.be/9WEcHmovF9o అక్కడే సీత రాముడ్ని ఇష్టపడటం మొదలు అవుతుంది.. కథ లో భాగం గా వచ్చే ఆ treasure hunt game.. treasure కోసం కన్నా ఒకరిని ఒకరు తెలుసుకునే చిన్న ప్రయత్నం అనుకోవచ్చు.. గమ్యం ఒకటే ఐనా గమనం వేరు.. మనుషుల తీరు వేరు అని చెప్పే ప్రయత్నం అది.. "రాజి నేచర్ ని ఎంజాయ్ చేద్దాం అంటే... రవీందర్ నక్సలైట్ ఏరియా అంటాడు" ఒక క్లూ దొరకగానే రామ్ సీత ఒకరికొకరు appreciate చేసుకుంటూ..ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ.. కలిసి ఆడుతుంటే.. https://youtu.be/4xonIU-msZk అదే క్లూ తనకి ఒకటి దొరికితే రవీందర్ తన క్రెడిట్ అనుకుంటాడు..వేరే దారి లో వెళ్లి మిస్ ఐనందుకు అర్ధం చేసుకోకుండా టోటల్ గా రాజీ ని బ్లేమ్ చేస్తాడు..తన గురించి తెలుసుకోవటానికి కూడా ఇష్టపడడు.. తనకి అవసరం ఐనా కూడా.. "చిన్నా" కోసం మనం వదిలేద్దాం అన్నప్పుడు ఇద్దరిదీ ఒకటే దారి.. కరెక్ట్ గా చెప్పాలి అంటే రామ్ సీత లా ఆలోచించాడు.. కానీ సీత రామ్ లా ఆలోచించింది.. అప్పుడే ఆ క్షణమే సీత రామ్ కి బాగా నచ్చుతుంది.. తను అడిగిన ఆ spark రామ్ కళ్ళలో కనిపిస్తుంది... "అందంగా లేనా..అసలేం బాలేనా.. నీ ఈడు జోడు కాననా.. అలుసై పోయానా..అసలేమీ కానా.. వేషాలు చాల్లే పొమ్మనా !!! ................. తెలుగు ఆడపడుచు.. తెలప లేదు మనసూ.. అంటూనే తన మనసులో మాట బయట పెడుతుంది.. "రామ చక్కని సీతకి అర చేత గోరింట.. ఇంత చక్కని చుక్క కి ఇంకెవరు మొగుడు అంట" అంటూ తను కోరుకున్న రాముడు కి తన ప్రేమ ని చెప్పకనే చెప్తుంది..సంతోష పడుతుంది.. కానీ ఆ రాముడు తనని, తన ప్రేమ అర్ధం చేసుకోలేదు అని అంతలోనే బాధపడుతుంది.. అతనికి దూరం వచ్చేస్తుంది.. వచ్చేసినా కూడా... "మనసా వాచా నిన్నే వలచా! నిన్నే ప్రేమించా అంటూ తను బాధ పడుతూ ఉంటే.. రామ్ కూడా అంతే ప్రేమ తో నిన్నే తలిచా, నన్నే మరచా.. నీకై జీవించా అంటూ తనని వెతుక్కుంటూ వస్తే.. బెట్టు చేసినా తన రామ్ తనకి మాత్రమే సొంతం అని తెలుసుకుని సంబర పడుతుంది.. ఎందుకు అంటే రాముడు కి సీత ఒక్కటే ఉండాలి...ఆ సీత ఎప్పటికీ తనే అవ్వాలి.. ఒక్క రామ్.. సీతే..మాత్రమే కాదు... తనకి కష్టాలు ఉన్నా కూడా, తన కష్టాన్నే నమ్ముకుని..తనకి అన్యాయం చేసిన వాడిని కూడా వదిలేసే చిన్నా.. చేసిన చిన్న సాయం నే గుర్తు పెట్టుకునే కోటి గాడు, బ్రీడ్ కుక్క తో ఫ్రీడమ్ గురించి చెప్పే మాటలు.. కొంత వరకే భరించే చిలక రాముడు.. రెస్పెక్ట్ ఉండాలి అనే పుల్లట్ల పుల్లమ్మ.. లోకం తీరు తెలిసిన బామ్మ.. కెప్టెన్ చింతామణి.. ఇలా ప్రతీ పాత్ర అంతగా మనకి గుర్తుండి పోయింది.. ఇలా ప్రతీ పాట మన మనసుకి ఎక్కేసింది.. ఈ సినిమా చూశాకే చాలా మంది పాపి కొండలు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు అంటే ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందో..ఎంతగా నచ్చిందో అర్ధం అవుతుంది..