Contributed By Krishna Prasad
నేను మళ్లీ వచ్చేసానండి...! ఎంటీడు మళ్లీ వచ్చాడు..? ఏం తీసుకొచ్చాడు..? ఈసారి... అని అనుకుంటున్నారా..! నా రాకను కాసేపు పక్కన పెట్టండి. మీ రాక కోసం చెప్పండి... ఏంటి మరి మీరు ఈ సంక్రాంతికి గోదావరి జిల్లా లకి వెళ్తున్నారా? హా..! సరే..సరే.. వెళ్తున్నారుగా.. లేదంటారా..! ఎలావోల తీరిక చూసి వెళ్ళండి ఎదో ఏడాదికి ఒక్క మారు... ఇక నేనొచ్చిన సంగతి అంటారా... మీరు మన తు.గో, ప.గో జిల్లాలకి వస్తె మాత్రం ఈ కిందనున్న రుచులను మాత్రం రుసి సుడకుండా వదలకండి... ఎం అంటారు? ఆయ్...
1. కాకినాడ గొట్టం కాజా
2. తాపేశ్వరం మామిడితాండ్ర
3. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో విందు
4. భీమవరం బజ్జీ మిక్చర్
5. గంగరాజు పాలకోవా - రాజమహేంద్రవరం (రాజమండ్రి)
6. రోజ్ మిల్క్ - రాజమహేంద్రవరం (రాజమండ్రి)
7. ఆత్రేయపురం పూతరేకులు
8. అప్పలరాజు గారి మిలిటరీ భోజన హోటల్ లో నాన్ వెజ్ భోజనం - ఏలూరు
9. అంబాజీ పేట పొట్టిక్కలు
10. తాపేశ్వరం మడత కాజా
11. పాలకొల్లు దిబ్బ (మినప) రొట్టె
12. బొంగు చికెన్ - మారేడుమిల్లి
ఇంతే కాదండోయ్... పులస చేప పులుసు, ఆవకాయ పచ్చడి, భీమవరం రొయ్యల వేపుడు, బొమ్మిడైల కూర ఇలా ఎన్నో ఉన్నాయి... మరి ఈ సంక్రాంతికి మా గోదారి ఊళ్లకు వచ్చి ట్యేస్ట్ చేసేయండి మరి...?