Contributed By Vasudeva Sri Vamsi
మారరా మారరా మీరస్సలు మారరా ... వదలరా వదలరా మూర్ఖత్వం వదలరా... మెలగరా మెలగరా భాధ్యతతో మెలగరా... బ్రతకరా బ్రతకరా జ్ఞానంతో బ్రతకరా...
ఎంతచెప్పాలి , మీకు ఎలాచెప్పాలి.... మళ్లీమళ్లీ వినటానికి సిగ్గుఉండాలి... బుద్ధి , జ్ఞానం , కుసంత బుర్ర వాడాలి.. దేశం నీదనుకునేంత భాద్యతుండాలి ..
ఇంటిపట్టునుండమంటే మాటవినాలి ... దానివెనుకవున్న కారణాల్ని తెలుసుకోవాలి ... మనిషికున్న మేధస్సును వాడుకోవాలి ... ఇంక పిచ్చిప్రశ్నలేయకుండా మూసుకోవాలి..
విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి... అసలు నిర్లక్ష్యం పూర్తిగా వదిలెయ్యాలి... మనవల్ల నలుగురెపుడు బాగుపడాలి... జనాల్ని భాధపెట్టేవాళ్ళకి శిక్షపడాలి...
రోడ్డు మీదకి రావడానికి బుద్దుండాలి... ఇపుడు నిర్లక్ష్యంగుండటానికి సిగ్గుండాలి... దేవుడు బుర్రిచ్చినపుడు వాడికోవాలి... భాధ్యతతో ఆచితూచి వ్యవహరించాలి...
ఎంతచెప్పాలి , మీకు ఎలాచెప్పాలి.... మళ్లీమళ్లీ వినటానికి సిగ్గుఉండాలి... బుద్ధి , జ్ఞానం , కుసంత బుర్ర వాడాలి.. దేశం నీదనుకునేంత భాద్యతుండాలి ..
అసలు ఇంత కథకు కారణం మనమే అనాలి ... ముందు మనిషిప్రవర్తనలో చాలా మార్పురావాలి.. అన్నీజీవుల్ని సమానంగా చూడాలి .... ప్రకృతిలో భాగం మనమను స్పృహరావాలి...
అడవికాలినపుడు సాయంచేసుండాలి... తూఫాన్లొచినపుడు చేయూతే ఇచ్చిఉండాలి... మనదికాదు మనకిరాదు అని వదిలేశాం.. ఇపుడు మనకితప్పదింక ఎదుర్కోవాలి...
చెట్లునాటి , మూగజీవుల సాయపడాలి... అన్నిటితో మనమనేటి తెలివుండాలి... పొల్యూషన్ చేయటాన్ని ఆపెయ్యాలి... మనం ప్రకృతిలో భాగం అని తెలుసుకోవాలి...
ఇప్పటికైనా మనకళ్ళు తెరుచుకోవాలి... ఇంకనుంచైనా "మనిషి" లాగా మనముండాలి... భాధ్యతగల పౌరుడివలె నడుచుకోవాలి... లోకహితం కోసం నిరంతరం పాటుపడాలి... దేశసేవలోనే ఈ తనువును చాలించాలి...
చేతులు ప్రతిగంటగంట కడుగుతుండాలి... పరిశరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ... శుభ్రతనే దైవంగా భావించాలి ... స్వీయ దిగ్భంధం తప్పదంటు పాటించాలి...
ఈ మాటలు తప్పనిసరిపాటించాలి... నాదేశం త్వరగా రక్షింపబడాలి... నా అనువారందరెపుడు బాగుండాలి... ఆయురారోగ్యాలతో మీరు తులతూగలి...