A Beautiful Experience Of Getting The First Job & Telling About It To Parents

Updated on
A Beautiful Experience Of Getting The First Job & Telling About It To Parents

Contributed by Kartheek Voggu

“ హలో అమ్మ! " " చెప్పు నాన్న, తిన్నావా ?" " ఇప్పుడే అయింది అమ్మ, నాన్న ఎం చేస్తున్నారు ? " " నీ హాస్టల్ ఫీజు కోసం ఎవరినో డబ్బులు అడగడానికి వెళ్ళారు " ( ఇద్దరి మధ్య కాసేపు మౌనం )

" ఇంకేంటి రా , ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతున్నావా? " " అవుతున్న అమ్మ! నన్ను చదివించడానికి కష్టపడ్డారు! చదువు అయిపొయింది, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు! నేను ఏమి చేయలేకపోతున్న అమ్మ " " నువ్వు ఇవ్వన్నీ ఆలోచించకు రా! మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఎప్పుడు పక్కన ఉండేవి కష్టాలే కదా! " " రోజు నా కడుపు నింపడానికి , ప్రతినెలా నాన్న కష్టం డబ్బులుగా వస్తుంది! ఆ కష్టం నా దగ్గరికి రావడం ఈ నెలే చివరిది అవ్వాలి అని ప్రతిసారి అనుకుంటున్నా , కానీ ఆకలి బాధ నా మీద ఎప్పుడు గెలుస్తూనే ఉంది . మళ్ళి నాన్న కష్టం నా దగ్గరకి వస్తూనే ఉంది! "

" ఇవన్నీ నాన్న చూసుకుంటారు నువ్వు బాగా చదువుకో ఇంటర్వ్యూకి " " సరే అమ్మ " .... ( కొన్ని రోజుల తర్వాత , రాత్రి 9 అవుతుంది ) " హలో అమ్మ! " " ఏంట్రా ఈ టైంకి చేశావు , అంతా బాగుంది కదా నీకు ? " " ఎం లేదు అమ్మ , నిన్ను నాన్నని చూడాలి అని ఉంది " " సరే లే , ఈ వారం లో పండగ ఉంది కదా అప్పుడు రా " ....

(పక్క రోజు పొద్దునే) డోర్ బెల్ మోగుతూ ఉంది! డోర్ ఓపెన్ అవగానే, ముఖం మీద పెద్ద నవ్వు తో " ఏంట్రా అప్పుడే వచ్చేసావా , సరే లోపలికి రా! " " నాన్న ఇంకా లేవలేదా అమ్మ " " లేదు రా , నీ హాస్టల్ ఫీజు కోసం అప్పు చేసారు కదా, అది తీర్చడానికి నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, నీకు ఫోన్లో చెప్తే బాధ పడ్తావ్ అని చెప్పలేదు రా " " ఈ వయసులో కూడా అంత కష్టం ఏంటి అమ్మ " " తప్పదు కదా రా! వాళ్ళుతో అడిగించుకునే వరకు ఉండలేం కదా! అదిగో మాటల్లోనే వచ్చారు నాన్న " " ఏంటి రా ఇంత సడన్ గా వచ్చావు , అక్కడ ఎం కాలేదు కదా! "

" ఎం కాలేదు లే నాన్న! అంత బాగానే ఉంది , మీరు ఇద్దరు ఇలా వచ్చి కూర్చోండి " " ఏంటి ఇందిరా! ఎవర్నైనా అమ్మాయిని తీస్కొచ్చేసాడా ఏంటి వీడు ( నవ్వుతు ) " అర్జున్ , బ్యాగ్ లోపల నుండి ఒక కవర్ బయటకి తీసాడు! " ఇదిగో నాన్న! నాకు జాబ్ వచ్చింది , ఆఫర్ లెటర్ ఇచ్చారు! ఇది మీ ఇద్దరికి చూపించి మీ కళ్ళలో వచ్చే సంతోషాన్ని నా కాళ్ళతో చూడాలి అని, ఫోన్లో చెప్పకుండా వచ్చాను " అమ్మ , నాన్న కళ్ళలో కన్నీళ్ల!

నాన్నకి మాటలు రాలేదు, అర్జున్ ని గట్టిగ కౌగిలించుకున్నాడు! " దీని కోసమే నాన్న, గొంతులో ఉన్న మాటని , గుండెల్లో పెట్టుకొని వచ్చాను! ఇప్పటివరకు నా చదువుకోసం మీరు పడ్డ కష్టం చూసాను ! నా బాధకి అమ్మ పెట్టిన కన్నీళ్ళు చూసాను ! కానీ మొదటిసారి , నిరాశ నుండి పుట్టే ఆశ, ఆ ఆశ కలిగించే కలలు, ఆ కలలు నిజమవుతున్నయన్న ఆనందం, మీ కళ్ళలో చూస్తున్న !! "