Contributed By Rakesh Chilumuru
ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ ఆఫీస్. ఆఫీస్ లో చాలా చిరాకుగా స్టాఫ్ అందరికీ క్లాస్ తీస్కుంటున్నాడు సి.ఈ.ఓ రఘు ప్రకాష్. ఒక టీవీ ఛానెల్ కి బిగ్గెస్ట్ enemy ఎవరో తెల్సా అని అడిగాడు స్టాఫ్ ని. కొంతమంది వేరే న్యూస్ చానెల్స్ అని, పొలిటిషీయన్స్ సార్ (ఛానెల్స్ ఈ మధ్య వాళ్ళకి అగైనెస్ట్ గా చెప్తే ఆపుచేయిస్తున్నారుగా ) అని, entertainment ఛానెల్స్ సార్ అందామనుకున్నాడు రాంబాబు కాని ఈ కాలంలో న్యూస్ ఛానెల్స్ entertainment ఛానెల్స్ కన్నా ఎక్కువ entertain చేస్తున్నాయ్ అని తనకి తెలుసు అందుకే calm అయి పోయాడు. అందరి ఆన్సర్స్ విన్న తర్వాత calm గా స్టార్ట్ చేసాడు రఘు ప్రకాష్, మీరు చెప్పిన వన్నీ enemies కావచ్చు కానీ బిగ్గెస్ట్ ఎనిమీ మాత్రం TV Remote. Viewer ని మనం మన ఛానెల్ కి glue చేయక పోతే ఠక్కున ఛానెల్ మార్చేస్తాడు. As all of you know, మన ఛానెల్ T.R.P రేటింగ్స్ తగ్గిపోతున్నాయ్. అసలే హాట్ న్యూస్ లేక చాలా Prime time స్లాట్స్ అన్నీ మూవీ గాసిప్స్, స్టార్స్ అఫైర్స్ తో నింపేస్తున్నాం. అయినా ఎప్పుడూ ఇవే పొలిటికల్ డిస్కషన్స్, మూవీ స్టార్స్తో చిట్ చాట్స్, తుఫాను బాధితుల బాధలకి background మ్యూజిక్స్ వేసి ప్రోగ్రాంస్ ఇవే కాదయ్యా, కొత్తగా, ఏదన్నా path breaking గా ఆలోచించండి. మీ అందరికీ ఇంతింత జీతాలు ఇచ్చి పొషిస్తోంది ఎందుకు, అవతల ఛానెల్ లో వచ్చే type programs మన ఛానెల్ లో కూడా వచ్చేస్తే ఇక ఆడియెన్స్ ఛానెల్ ఎందుకు చూడాలి. మీరు అసలు ఏమి చేస్తారో నాకు తెలీదు నాకు అర్జెంట్ గా mind blowing బ్రేకింగ్ న్యూస్ కావాలి. “If you can’t get a news , create some news. But it should be exclusively on our channel and most importantly sensational and you know what I mean”. అని ఒక చిన్న పాస్ ఇచ్చి ఎండ్ చేసాడు.
ఇలా అప్రతిహతం(Nonstop) గా సాగిపోయింది ఆయన ఉపదేశం cum స్పీచ్. అందరూ ఆయన్ని తిట్టుకుంటూ బయటకి వస్తుంటే మన రాంబాబు మాత్రం అప్పుడే భగవద్గీత విన్న అర్జునుడిలా ఉత్తేజంగా బయటకి వచ్చాడు. ఏదో ఒకటి చేసి బాస్ ని impress చేయాలని అతని ఉద్దేశ్యం. అసలే last increment చాలా తక్కువ వచ్చింది, ఈ సారి ఏదో ఒకటి చేసి బాస్ ని ఇంప్రెస్ చేసి మంచి increment తీసుకెల్తే తప్ప వాళ్ళ ఆవిడ బతకనివ్వదు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుండగా అతనికి ఫోన్ రింగ్అయింది, ఆ ఫోన్ కాల్ complete అయ్యేప్పటికి అతని మొహం 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతోంది. ఈ దెబ్బకి తన ఛానెల్ రేటింగ్స్ రాకెట్ స్పీడ్ లో పెరిగిపోతాయ్ అని అతనికి తెలుసు. వెంటనే తన కెమెరామేన్ గంగారాం తో స్పాట్ కి స్టార్ట్ అయ్యాడు.
స్పాట్ కి చేరుకొని తనకి ఫోన్ చేసిన రామయ్య కోసం చూస్తున్నాడు. ఇంతకీ రామయ్య ఎవరనే కదా మీ డౌట్ అక్కడికే వస్తున్నానండి. రామయ్య ఒక సన్నకారు రైతు. వర్షాలు పడక ఒక సారి, వర్షాలు ఎక్కువయ్యి ఒక సారి, కల్తీ ఎరువులతో ఒక సారి, నకిలీ విత్తనాల మూలంగా ఒక సారి ఇలా వరుసగా పంటలు అన్నీ పొయాయి. అప్పులు మాత్రం కొండలా ఎదిగిపోయాయి. బ్యాంక్ వాళ్లకి సమాదానం చెప్పలేక, అప్పు కట్టలేక నలిగిపోతున్నాడు. ఆదుకుంటామని, రుణాల మాఫీ అని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన నేతలు ఇప్పుడు వాటిని చిన్నగా పక్కకి నెట్టేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు బ్రేకింగ్ న్యూస్ నుంచి just In అంటు చిన్న ఫాంట్ సైజు లో స్క్రాలింగ్ న్యూస్ రేంజ్ కి పడిపోయాయి. దాంతో రామయ్య మన రాంబాబు కి ఒక ఆఫర్ ఇచ్చాడు. తన ఆత్మహత్య ని ఆ ఛానెల్ కిలైవ్ కవరేజ్ ఇస్తా అని దానికి ప్రతి గా తన కుటుంబానికున్న అప్పుల్నీ తీర్చాలన్నది ఆ ఆఫర్ సారాంశం. దానికి రాంబాబు హ్యపీ గా ఒప్పుకున్నాడు. అతనికి తెలుసు ఈ న్యూస్ క్రియేట్ చేసే Impact. ఈరోజుల్లో జనాలకి కావాల్సింది only sensational news అండ్ ఛానెల్స్ కి కావల్సినిది జస్ట్ పాపులారిటి. గుడ్ అండ్ బ్యాడ్ అనే ఆలోచనలు ఎప్పుడో వదిలేసారు.
ఆ తర్వాత గంగారం కి కెమెరా ఆంగిల్స్, రామయ్య కి ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఈ డైలాగ్స్ చెప్పాలి అని డైరెక్ట్ చేస్తూ busy అయిపోయాడు రాంబాబు. కానీ అది ఒక అన్నదాత ఆక్రోశమనీ, అతని అధ్వాన పరిస్థితికి పరాకాష్ఠ అని కూడా అతనిలోని మనిషి గుర్తించలేక పోయాడు. అలా అనేకన్నాఅతనిలోని స్వార్థం మానవత్వాన్ని మట్టి కరిపించింది అనటం సబబుగ ఉంటుందేమో. రామయ్య వీళ్ళ హడావుడికి నవ్వాలో, తన తలరాత ని చూసి ఏడవాలో అర్థం కాక ఒక విధమైన అయోయమయానికి గురయ్యాడు.
కానీ రాంబాబు అవేవీ పట్టించుకునే స్టేజ్ లో లేడు, రామయ్య ఉరి వేస్కుంటే రేటింగ్స్ ఎక్కువుంటాయా, లేక బ్లేడు తో కట్ చేస్కుంటే రేటింగ్స్ ఎక్కువ వస్తాయా అని గంగారాం తో డిస్కస్ చేస్తున్నాడు. ఫైనల్ గా దానికి ఎస్.ఎం.ఎస్ కాంటెస్ట్ కూడా పెడదామనే రేంజ్ కి వెళ్ళిపోయింది మన రాంబాబు పైత్యం. ఫైనల్ గా ఉరి అని డిసైడ్ చేసి స్టూల్, రోప్ అన్నీ arrange చేసారు.
ఇంతలో sudden గా డోర్ ఓపెన్ అయ్యి ఒక వ్యక్తి చాలా కోపం గా లోపలకి దూసుకొచ్చాడు, అతను రామయ్య కొడుకు సూరి. ఏంటి నాన్న ఇది ఏమి చేస్తున్నావ్ అని కోపం గా అడుగుతూనే ఆ స్టూల్ ను, రామయ్య చేతిలోని రోప్ ని లాగి దూరం గా విసిరేసి, కోపం గా రాంబాబు మీదకి దూసుకొచ్చాడు. రాంబాబు కి పై ప్రాణాలు పైనే పోయాయ్. ఇప్పుడు ఈ మ్యాటర్ బయట లీక్ ఐతే అతని బోనస్ సంగతి దేవుడెరుగు, జాబ్ ఏ లేకుండా పోతుందని అతనికి తెలుసు. సూరి ఆవేశాన్ని అతి కష్టం మీద అనుచుకుంటూ రాంబాబు ని ప్రశ్నించాడు, మీకు మానవత్వం అంటే ఏంటో తెలుసా సార్. అన్నం పెట్టే రైతు ఆత్మహత్య ని అందం గా ఆవిష్కరించాలనుకున్నారా? మీ క్రియేటివిటికీ నా జోహార్లు. మనిషి ప్రాణాలతో కూడా పాపులారిటి పెంచుకోవాలనుకునే మీ పైశాచికత్వానికి నా వందనాలు.
సూరి ఆవేశం చూసి రాంబాబు డిఫెన్స్ లో పడ్డాడు. తనని తను సమర్థించుకోడానికి ప్రయత్నం స్టార్ట్ చేసాడు. అయినా మిమేమీ మీ నాన్నని బెదిరించి ఈ పని చేయట్లేదు, అతనే మాకు ఈ ఆఫర్ ఇచ్చాడు అన్నాడు. అసలైనా మీకు రైతులన్నా, వాళ్ళ కష్టాలన్నా అంత చులకనా మీకు అడిగాడు ఆవేశంగా. దాంతో రాంబాబు కూడా రివర్స్ అయ్యి సీరియస్ గా React అయ్యాడు. అయినా అంత డబ్బు లేనప్పుడు, అప్పు చేసి మరీ వ్యవసాయం ఎవరు చేయమన్నారు, ఇష్టం వచ్చినట్లు అప్పులు చెయ్యటం, మళ్ళీ ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒక పొలిటికల్ పార్టీ "loan waiver" అంటుంది అందరుమళ్ళీ అదే పార్టీ కి votes వెయ్యడం. ఆ అప్పులు తీరిస్తే ఒక గోల తీర్చకపోతే ఒక గోల. ఫైగా వీటి గురించి బందులు, రాస్తారోకోలు. మీ votes కోసం మీకు opposition parties support చెయ్యటం. మాకు రోజూ ఇదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఐనా ఇలాంటి వాల్లందరికీ రుణ మాఫీలూ చేయటం మొదలెడితే ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభానికి గురి అవుతాయి, రాష్ట్రాలు దివాలా తీస్తయ్. ఐనా ఇంకా వ్యవసాయాలేంటయ్యా, నువ్వేంటి అంత చదువులు చదివి వ్యవసాయం చేస్తా అని వచ్చేశావట అసలు నీకేమి తెలుసు రైతుల గురించి, వ్యవసాయం గురించి అని సూరీ మీదే రివర్స్ అయ్యాడు రాంబాబు.
అప్పటి దాకా ప్రశాంతంగా వింటున్న రాంబాబు, చిరునవ్వుతో సమాధానం చెప్పటం స్టార్ట్ చేసాడు. మీరన్నదీ కూడా ఒక రకంగా నిజమే సార్. ఈ రోజుల్లో నేల తల్లిని నమ్ముకున్న రైతు కంటే, ఆ తల్లిని అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కే గౌరవం ఎక్కువ. ఫ్రతీ సంవత్సరం ఎన్ని కష్టాలున్నా, ఈసారన్నా పంట బాగా పండుతుందన్న నమ్మకంతో, లక్షలు అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతుకి అడుగడుగునా కష్టాలే సార్. విత్తనాలు కొందామని వెళ్తే అవి నకిలీ, పోనీ అదృష్టం బాగుండి అవి మంచివే ఐతే, ఎరువులులో కల్తీ. వర్షాలు లేక, కరెంటు రాక, బోరులు ఎండి పోయి, మోటర్స్ కాలిపోయి చేతికొస్తుందనుకున్న పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతు పడే వ్యధ మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది సార్. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలీదు, మానవాలి తప్పిదాల మూలంగా చెరువులు, కాలువలు ఎప్పుడో ఎండిపోయాయి. ఇంకా మన అదృష్టానికి తోడు మన తెలుగువాడి గోడు విని రెండు రాష్ట్రాలు, ఇద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకొని రైతు నోట మాత్రం మట్టి కొడుతున్నారు. ఒకాయన వాటర్ release చేయాలంటాడు ఒకాయన వద్దు అంటారు. అదేంటో ఇద్దరూ రైతుల కోసమే అని reason చూపిస్తుంటారు. వీళ్ల ని చూసి నవ్వాలో ఏడవాలో తెలీక రైతుల గుండెలు ఆగిపోతున్నాయి సార్. కరెంట్ కోసం రోడ్ ఎక్కితే లాటీ చార్జెస్, నీటికోసం కలక్టరేట్లని ముట్టడిస్తే ఏకంగా కాల్పులు జరిపి ప్రభుత్వమే హత్యలకి దిగుతోంది సార్.
ఇంకా ఏమంటున్నారు సార్, రైతులకి రుణ మాఫీ ఎందుకు చెయ్యాలా? వాళ్లకి ఇచ్చే మనీ మూలంగా ఖజానాలు ఖాళీ అవుతాయా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారే అలాంటి అన్నాన్నిపండిచే రైతు మరి ఆ దేవుడికన్నా గొప్పవాడు అవ్వాలి కదా సార్. కాని వాళ్లు అలాంటి స్టేటస్ ఏమీ కోరుకోవట్లెదు సార్, కనీసం మనిషిలా చూస్తే చాలు. మన దేశం లో లిక్కర్ కంపెనీస్ పెట్టుకునే వాళ్ళకి నష్టాలు వచ్చిన ప్రభుత్వం bailouts ప్రకటిస్తోంది. ఆ విధం గా ప్రభుత్వం లాస్ట్ 5 ఏళ్ళ లో ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల bailout packages ప్రకటించింది. దాన్ని సమర్ధించిన మీలాంటి మేధావులూ రైతుల దగ్గరకి వచ్చేటప్పటికి మాత్రం అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు సార్. అంత పెద్ద పెద్ద మల్టీ మిల్లియనీర్స్ మాత్రం bailouts ప్రకటించొచ్చు కానీ, రెక్కాడితే కానీ డొక్కాడని అన్నదాతకి మాత్రం సవాలక్ష కండీషన్స్, అవి చేతికి వచ్చేదాక అనుమానమే. మధ్యలో సవాలక్ష మంది బ్రోకర్స్ వాళ్ళ కమీషన్స్, అధికారులకి లంచాలు. ఇవన్నీ తట్టుకోలేక లక్ష రూపాయల అప్పు తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, అతన్నీ పరామర్శించడానికి వచ్చి, ఎక్సగ్రేషియా కింద 5 లక్షలు ఇచ్చేంత పెద్ద మనసు ఉన్న గవర్నమెంట్ సార్ మనది, హాట్సాఫ్ఫ్.
అయినా ఏంటయ్యా అలాంటి ఇండస్ట్రీలిస్ట్స్ తో మీ రైతులకి ఏంటి పోలిక, వాళ్ళు ఎంతోమందికి ఉపాధి కలిపిస్తున్నారు, ఇండస్ట్రీస్ పెట్టి. వాళ్ళకి బైలౌట్స్ ఇచ్చినా తప్పు లేదు. రైతులు ఎవరికిఉపాధి కలిపిస్తున్నారు ఒక 10 మందికి రోజు కూలి కలిపిస్తున్నరు అదా ఉపాధీ? అంటూ వెటకారంగా నవ్వాడు రాంబాబు. దాంతో సూరి, లిక్కర్ కంపెనీస్ పెట్టి కోట్ల మంది జనాల ఆరోగ్యాలని గుల్ల చేసి, కోట్లు వెనకేసుకునే పెద్ద మనుషులు తన కంపెనీస్ లో డైలీ లేబర్స్ కింద చాలీ చాలని జీతాలతో పని చేసే వెట్టి చాకిరి కూలీలు మీకు ఉపాధి మార్గాలు, కానీ స్వయం శక్తి తో పది మంది కలిసి, వాళ్ళ కష్టాలనే పెట్టుబడిగా పెట్టి, కండలని కరిగించి, ఎండనకా వాననకా, ఒక పూట తిని నాలుగు పూటల పస్తులుండి, పది మంది కలిసి పండించి, కోట్లమందికి తిండి పెట్టే ఆత్మగౌరవం ఉన్న రైతన్న మీ దృష్టిలో ఒక అసమర్థుడు, చేతకాని వాడు. కొన్ని వందలమంది కి రోజుకూలీలు గా మార్చి వాల్ల కష్టాలతో కోట్లుకొల్లకొడుతున్న ఈ పెద్ద మనుషులు మీకు industrialists ఐతే, తన బంధువులు, కుటుంబం అంతా కష్టపడి, పండించి కోట్ల మంది జనాలకి కడుపు నింపుతున్న రైతన్న industrialist ఎందుకు కాదు.? వ్యవసాయం ఒక ఇండస్ట్రీ గా ఎందుకు తీస్కోరు? ఒక్కసారిగా రాంబాబు మొహం మాడిపోయింది తను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో అతనికి అర్థం అయింది. సిగ్గుతో తలదించుకొన్నాడు. కానీ కడుపు మండిన సూరీ మాత్రం, ఆవేశం గా మాట్లాడుతూనే ఉన్నాడు. ఐనా మీరిచ్చే 1 లక్ష రుపాయల రుణమాఫీ తో వాళ్ళ జీవితాలు వెలిగిపోవు సార్. వాళ్ళ కి కావాల్సింది మేలైన విత్తనాలు, ఎరువులు, సరైన సమయానికి నీరు, నాణ్యమైన నిరాటంకమైన కరెంట్, మెరుగైన వ్యవసాయ పద్దతులు, వాటిని తెలియ చెప్పే శాస్త్రవేత్తలు. అలాగే better storage and marketing facilities. మనకి ఒకేసరి ఉల్లిపాయలు Kg 100 రూపీస్ అవుతుంది ఒకే సారి 2 రూపీస్ కి పడిపోతుంది. రైతులు పంటమార్కెట్ కి తరలించి గిట్టుబాటు కాకాపోతే తిరిగి ఇంటికి తీసుకెళ్ళే transport charge కూడా రాక రోడ్డుమీద క్వింటాళ్ళ కొద్దీ టమాటాల ని పారబోసిన రోజులు ఎన్ని సార్? దయచేసి అర్థం చేస్కోండి సార్, ఒకేటైం లో ఒకే ప్రాంతం లో అందరు రైతులు ఒకే పంట పండించి ఒకే సారి మార్కెట్ కి వెళ్తే వాళ్ళకి కనీస గిట్టుబాటు కాదు అని కూడా తెలియని అమాయక మహారాజులు సార్ మన అన్నదాతలు.
వాళ్లకి కావాల్సింది మీరు విదిలించే చిల్లర డబ్బులు కాదు సార్, awareness on latest ways of agriculture. మన గవర్నమెంట్ ఏరియాస్ వారీ గా విడదీసి ఒక్కొక్క ఏరియా లో ఈ పంటలు పండించాలి, వాల్లకి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి, సరైన మార్కెటింగ్ చేస్తే ఈ demand supply differences మూలం గా మధ్యవర్తులు సొమ్ము చేసుకునే అవకాశం ఉండదు కదా సార్. రైతు ని ఒక ఓటు బ్యాంక్ గా కాకుండ, అన్నం పెట్టే అమ్మ గా చూడండి సార్, అప్పుడు మీకే అర్థం ఔతుంది మీరు ఏమిచేస్తున్నారో అన్నాడు. రాంబబు కళ్ళు పశ్చాతాపంతో తడిసిపోయాయి. నన్ను క్షమించు సూరీ. నేను చేయాల్సింది sensational news కాదు sensible news అని తెలుసుకున్నాను. నువ్వు చెప్పిన పాయంట్స్ తో మంచి డాక్యుమెంటరీ తీసి మన సి.ఎం గారికి పంపిస్తాను. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళకి చెప్పి డెఫినెట్ గా రైతులకి మంచి అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ create చేయిస్తాను అన్నాడు. సూరీ కూడా సంతోషంతో రాంబాబు ని కౌగిలించుకొని, చాలా థాంక్స్ సార్, మీడియా అంటే మన సొసైటీ లో 4th పిల్లర్, మీరు తలుచుకుంటే చేయలేనిది ఏమి లేదు సార్. అందుకే నేను నా వంతుగా ఏమన్నా చేద్దాం అని వ్యవసాయాన్ని వృత్తి గా ఎంచుకున్నా. త్వరలోనే మంచి మార్పు చేసి చూపిస్తాను సార్ అన్నాడు.
అప్పటి దాకా జరిగే తంతుని calm గా గమనిస్తున్న రామయ్య సైతం లేచి నిలబడ్డాడు. ఇప్పుడు అతని కళ్ళలో ఇదివరకటి ఆత్మన్యూన్యత లేదు, ఆత్మవిశ్వాసం ఉంది. ఏదో ఒకటి కొత్తగా చేసితగిన జాగ్రత్తలు తీస్కుంటే వ్యవసాయం కూడా లాభసాటి గా చేయచ్చు అన్న నమ్మకం కుదిరింది, సూరి మాటలు విన్న తర్వాత. అప్పటిదాకా వివిధ డిస్కషన్స్ తో హోరెత్తిన ఆ room లో నుంచి ముగ్గురు బయటకు వచ్చి నడక సాగించారు, తమ తమ లక్ష్యాల వైపుగా. త్వరలోనే అందరూ కలిసి రైతు ని నిజంగా రాజు ని చేస్తారు అని అశిస్తూ..