This Open Letter From A Frustrated Engineer To His Dad Is Definitely An Eye Opener To All The Parents!

Updated on
This Open Letter From A Frustrated Engineer To His Dad Is Definitely An Eye Opener To All The Parents!

To, తన కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా Engineer ఏ కావాలనుకునే తండ్రీ, దాదాపు ప్రతీ ఇల్లు, సమాజం.

Subject : "ప్రతీ తండ్రీ తన కొడుకు/కూతురు ని వాళ్ళకి ఇష్టమైన దారి వైపు వెళ్లనివ్వాలని"

గౌరవనీయులైన తండ్రి గారికి, మీ ప్రేమ కి ప్రతిరూపమైన మీ కొడుకు రాయునది. మీరు అక్కడ కుశలం గానే ఉన్నారని ఆశిస్తున్నాను. కానీ నేను ఏ మాత్రం కుశలం గా లేను. అదేంటి పోయిన వారం లోనే డబ్బులు పంపాను కదా అని అనుకోకండి ఇది నా మనసుకు సంబంధించిన విషయం. ఎప్పట్నుంచో మీకు రాయాలనుకుంటున్నాను. కానీ ఈరోజే నా ధైర్యం మేల్కొంది. ఇక ఎవరు ఏం చెప్పినా వినేది లేదు అంటుంది. అవును నేనూ నా మనసు ఎలా చెప్పిందో అలాగే నడుచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు, అమ్మా చెప్పింది విన్నా. ఇక దయచేసి ఈ ఒక్కసారి నేను చెప్పేది కాస్త ఆలోచించండి. మీకు ఉత్తరం చివరిలో చెప్పేది అర్థంకావడానికి ఇప్పడు ఒక చిన్న కథ చెబుతాను.

రాతి యుగం నాటి కాలం లో మనుషులు నిప్పు, నీరు, ఆయుధాలు, అన్నీ వారికి వారే ఆలోచించి కనిపెట్టారు. కొంచెం తర్వాతి కాలం లోకి వద్దాము. ఇక్కడ మనుషులు రాజ్యాలు స్థాపించి రాజులయ్యారు. ఆ తర్వాత దండయాత్రలు, యుద్దాలు జరిగాక, ఒక స్వతంత్ర దేశం గా పరిఢవిల్లింది మన దేశం. ఆ తర్వాత మనుషులు చదువులకి ప్రాధాన్యం ఇచ్చారు. ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అంటే, వాళ్ళ పిల్లల మనస్సుని తెలుసుకోకుండా చదివించే అంత! ఇదే చిన్న కథ. ఇక్కడ యుగాలు , కాలాలు , సంవత్సరాలు మారినప్పుడు దానికి తగిన విధం గా మనుషులు మారిపోయారు. వారికీ ఏది అవసరమో, వాళ్ళకి ఏది ముఖ్యమో, ఏది జీవితమో అని అన్నీ తెలుసుకుంటూ వచ్చారు. ఆ కోవ లోకే మీరూ వచ్చారు. మీ కొడుకుకి చిన్నప్పట్నుంచి అన్నీ చాలా బాగా నేర్పించారు. అన్ని వాటిల్లో ఫస్ట్ రావాలనే తయారు చేసారు . తండ్రి గా మీ భాద్యత అది . కానీ ఒక తండ్రి గా మీరు మీ కొడుకుకి ,తన ఇష్టాలకి , తన ఆలోచనలకి , స్వేచ్ఛ ని మాత్రం ఇవ్వలేకపోయారు .

ఈ ఉత్తరం మీకు అందినప్పుడు మీరు ఏ TV లోనో ఏ సినిమానో కాలు మీద కాలు వేస్కొని చూస్తుండవచ్చు . కానీ చిన్నప్పట్నుంచి తనకున్న ఎన్నో కలల్ని నాశనం చేసుకొని చివరి సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న మీ కొడుకు మాత్రం లోలోపల కుమిలిపోతూ రాస్తున్న ఉత్తరం ఇది. నేనేం వీడి కలల్ని నాశనం చేశాను ? అని అనుకోకండి. చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటా నాన్న అని గొడవ చేసినప్పుడు రెండు పీకి స్కూల్ లో PET Sir కి అప్పగించినప్పుడు, ఇంకొంచెం పెద్దయ్యాక స్కూల్ లోనే ఉన్నప్పుడు క్రికెట్ నేర్పించండి నాన్న అని అన్నప్పుడు ఒకే ఒక్కసారి పీకి, IIT కోచింగ్ కి పంపినప్పుడు, Inter కి వచ్చాక, Horse Riding కి వెళ్తాను అని చెప్తే, మీరే మాట్లాడటం మానేసి నన్ను నాలో కుమిలి పోయేలా చేసి , B.Tech లో తోసేశారు . నేనేం చేశా నాన్న ? నా ఇష్టాయిష్టాలు మీతో వ్యక్తపరచడం తప్పా ? లేదా మేరే నా ఇష్టాయిష్టాలు అంగీకలించలేదా ? ఏది నిజమో మీకు తెల్సు కదా . సమాజం మీ కొడుకు చదువుకోకుండా తిరుగుతున్నాడంటే మీరు ఎంత సిగ్గు పడతారో కదా . ఆ సిగ్గు పడకూడదనే నన్ను చదివిస్తున్నారా ?

అదేంటి నేను ఇన్ని చేసినా వీడికి కృతజ్ఞత లేదా అని అనుకోకండి. అవును లేదు . నిజాంగానే లేదు. ఎప్పుడైతే మీరు ఇంజనీర్ ఏ కావాలనే ఉద్దేశ్యం తో మీ కొడుకుని ఒక మరమనిషిలా తయారు చేసారో ఆరోజే నాకు మీకు కృతజ్ఞత చెప్పాలనిపించలేదు . మీరు అనుకోవడం లో తప్పు లేదు . కానీ ఇక్కడ ఇంజనీరింగ్ అంటే దేశం లో ఎక్కడా విలువ లేదు . ఎందుకు విలువ లేదు అనుకోకండి . ఇంజినీరింగ్ లో చేరిన ప్రతీ వాడు చివరికి ఏ అయిదు లేదా ఆరు అంకెల జీతం తోనే తన తర్వాతి జీవితం గడిపేయాలనుకుంటున్నాడు. అదే తప్ప, గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పమంటే వాడికి అలంటి ఆలోచనే రాదు.

మొన్న ఫోన్ చేసినపుడు మీరు అన్నా ఒక విషయం నాకు గుర్తుంది . "ఇప్పుడు B.Tech మధ్యలో ఉన్నావ్. ఇప్పుడు ఏమైనా Startups అని పిచ్చిపిచ్చి ఆలోచనలు చేసావో , ఇప్పటివరకు చదివిన చదువు అంతా వృధా. అలాంటివన్నీ నీకు జాబ్ వచ్చాక చేస్కోవచ్చు" అని అన్నారుగా. మీరు చెప్పినట్టే లోకం లో అందరూ అలాగే ఉంటె , చివరికి ఈ లోకం లో అందరి పేర్లు పక్కనా B.Tech లేదా MBBS అనో ఉండును ఏమో . కానీ అలా లేదే ! సినిమా హీరోలు తో మొదలు పెట్టి, చిన్న చిన్న startups పెట్టి success అయ్యినవాళ్లు కూడా ఉన్నారు కదా . అవన్నీ రోజూ మీకు కనబడుతూనే ఉన్నాయ్ కదా. మీకెప్పుడూ అనిపించలేదా మీ కొడుకుని తన ఆలోచనలు చెప్పనివ్వాల్సింది అని. తన ఆలోచనలకి విలువ ఇవ్వాలనిపించలేదా ?

PV సింధు కి నాకు ఒకే age నాన్న. కానీ వాళ్ళ నాన్న కీ మీకూ తేడా ఏమిటో తెలుసా ? వాళ్ళ నాన్న తనని తెల్లవారుఝామున 3 గం|| కి బాడ్మింటన్ అకాడమీ కి తీసుకెళ్లేవారు . మీరు అదే రోజు నేను స్విమ్మింగ్ నేర్చుకుంటానంటే రెండు పీకి మా PET sir కి అప్పగించారు . పైన చెప్పిన కథ లో మనుషులు మారారు నాన్నా కాలం తో అనుగుణం గా . మీరు మాత్రం మారలేదు నాన్న . తండ్రిగా మీరు గెలుస్తూనే వచ్చారు , కొడుకు గా ఈరోజు Strength of Materials సప్లీ కి text book లో ఫార్ములాలు బట్టీ కొడుతూ నేను ఇక్కడ ఓడిపోయాను .

మీ గౌరవాన్ని అంగీకరించకుండా నేను ఒక Startup పెట్టాను. అది ఇంకా మొదటిదశలోనే ఉంది. అది సక్సెస్ అయ్యినతర్వాతే ఒక సంతృప్తి పడిన వ్యక్తిగా ఇంటికి వస్తా నాన్న. భయపడకండి నాకేం కాదు. ఇంజినీరింగ్ నాకు జీవితం అంటే ఏంటో నేర్పింది. ఇక సెలవు.

ఇట్లు మీ ఇంజినీరింగ్ కొడుకు ప్రతీ ఇంజినీరింగ్ కాలేజ్ సమాజం