ఏదైనా అనుకున్నది జరగడం లేకుంటే నా దరిద్రం అలా ఉంది అనుకుంటుంటాం, టైం బాగోలేకుంటే శని దేవుడిని వేడుకుంటే బాధలు తీరుతాయని నమ్ముతాం. అత్యంత మహిమాన్విత శివలింగాలను ఎంతోమంది దేవతలు ప్రతిష్టించారు కాని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినది సాక్షాత్తు శనిదేవుడు.
పూర్వం ఇక్కడ నిత్యం యజ్ఞాలు జరుగుతూ ఉండేవి అశ్వత్థుడు, పిప్పలుడు అనే రాక్షసులు మారువేషంలో వచ్చి యజ్ఞాలకు ఆటంకం కలిగించేవారట. ఒక్కోసారి బ్రాహ్మణులను సైతం చంపి తినేవారట. ఈ రాక్షసులను సంహరించ గల సత్తా శనిదేవునికే ఉందని శనిని వేడుకున్నారట వారు ఊహించినట్టుగానే శనిదేవుడు రాక్షసులను చంపివేశారు ఐతే ఇలా చంపడం వల్ల శనికి బ్రహ్మ హత్య పాపం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కావడానికి ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించారు.
ఈ గుడి రాజమండ్రి నుండి 38కిలో మీటర్ల దూరంలో ఉన్నది. శనిదేవుడు పాపాలు చేసేవారికి విరోధిగా, ధర్మాన్ని పాటించే వారి పట్ల అండగా ఉంటారు. అలాగే శనిదేవుడు జ్ఞాన కారకునిగా వ్యవహరిస్తారని భక్తులు భావిస్తారు టైం బాలేదని అనుకుంటాం కాని టైం బాలేనప్పుడే చాలా నేర్చుకుంటాం. ఇక్కడి శివలింగాన్ని శని ప్రతిష్టించడం వల్ల తనకెంతో ఇష్టమైన నలుపు రంగులో ఈ లింగం ఉంటుంది. ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువగా శనివారం, శని త్రయోదశి, మాస మహా శివరాత్రి పర్వదినాలలో ఎక్కువగా వస్తుంటారు శనికి దేశవ్యాప్తంగా అతి తక్కువ దేవాలయాలు ఉండడం, శనిదేవుడే ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు.