This Telugu Girl Deserves All Praise For Inventing A Device That Can Identify Drug Users!

Updated on
This Telugu Girl Deserves All Praise For Inventing A Device That Can Identify Drug Users!

ఆఖరికి స్కూల్స్ లో కూడా డ్రగ్స్ దొరికేస్తుంది.. పెద్ద వారంటే అన్ని తెలిసి కూడా తెగించి డ్రగ్స్ వాడుతున్నారు. డ్రగ్స్ వల్ల భవిషత్తులో ఎంతటి భయంకరమైన నష్టాలు వస్తాయో తెలియని పిల్లలను వాటి బారిన పడకుండా కాపాడుకోవాలి. తప్పు చేసిన తర్వాత కన్నా ఆ తప్పు జరుగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటే చాలావరకు జరుగబోయే నష్టాలను అపవచ్చు Pro Re Nata పరికరంతో. పిల్లలు డ్రగ్స్ తీసుకుబోయే ముందుగానే ఈ పరికరంతో పేరెంట్స్ గుర్తించవచ్చు. దీనిని 16సంవత్సరాల అలియా మహ్మద్ అనే మన తెలుగమ్మాయి తన బృందంతో కలిసి కనుగొన్నారు.

ఇది ఎలా పనిచేస్తుంది..? ఇది అచ్చంగా రిస్ట్ బ్యాండ్ లా ఉంటుంది. స్కూల్ కి వెళ్ళే పిల్లలు కాని డ్రగ్స్ వాడే వారికి ఈ రిస్ట్ బ్యాండ్ వేస్తే డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాల దగ్గరకు వచ్చినప్పుడు, లేదంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత శరీరంలో నుండి వచ్చే చెమటను రిస్ట్ బ్యాండ్ సెన్సర్లు గుర్తించి డ్రగ్స్ తీసుకుంటున్నారనే మెసేజ్ అటాచ్ చేసిన ఆప్ ద్వారా పేరెంట్స్ మొబైల్ కు వెళుతుంది. ఒకవేళ పిల్లలు రిస్ట్ బ్యాండ్ కావాలనే తీసేసినా గాని మెసేజ్ వెళ్ళిపోతుంది. ఏ రకంగా చూసినా గాని డ్రగ్స్ తీసుకుబోయే ముందు గుర్తించడంలో Pro Re Nata చాలా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నదని శాస్ర్తవేత్తలు గుర్తించారు.

అమెరికా లోని Conrad spirit of innovation challenge నిర్వహించిన ఈ పోటిలో వందలాది మంది పాల్గొన్నా గాని ఈ రిస్ట్ బ్యాండ్ రూపొందించిన టీం కే అవార్డ్ వచ్చింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో అమెరికాలో ఉంటున్న అలియా పేరెంట్స్ మన తెలుగువారే. నాన్న ఆసీఫ్ ది మచిలీపట్నం అమ్మ సమ్రీన గారిది విశాఖపట్టణం. అలియా మహ్మద్ చాలా టాలెంటెడ్ అమ్మాయి. కేవలం 8వ తరగతి చదువుతుండగానే అప్పటి అమెరికా ప్రెసిడెంట్ నుండి "Out Standing Academic Excellence" అవార్డ్ గెలుచుకున్నారు. అధికారులు గుర్తిస్తే ప్రస్తుతం టాలీవుడ్ ను, తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని ముందుగానే నియంత్రించడంలో ఈ Pro Re Nata అత్యంత శక్తివంతంగా ఉపయోగపడే అవకాశం ఉంది.