గోపిరాజాది కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర ఒక చిన్న ఊరు, విజయవాడ KL Universityలో Engineering చదువుతున్నారు. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. నాన్న పంటను కన్నబిడ్డలా కాపాడుకునే క్రమంలో పురుగుల మందులు Spray చేస్తుంటారు. ఈ క్రమంలో గోపి నాన్న గారికి ఆరోగ్యం బాలేదంటే హాస్పిటల్ లో చూపిస్తే పురుగుల మందులు చేతితో Spray చేయడం, వాటిని దగ్గరి నుండి పీల్చుకోవడం వల్ల Lung Infection సోకిందని డాక్టర్ల ద్వారా తెలిసింది. గోపి అప్పుడే అనుకున్నాడు.. ట్రీట్మెంట్ ద్వారా నాన్న ఆరోగ్యం కుదుటపడవచ్చు కాని అలా కుదుటపడిన తర్వాత కూడా నాన్న మళ్ళి ఇలాగే, ఇదే పద్దతిలో పురుగుల మందులు ఉపయోగించాల్సి ఉంటుంది.. ముందు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తే నాన్న మాత్రమే కాదు, నాన్న లాంటి ఎంతోమంది రైతులు ఆరోగ్యంగా ఉంటారని ఆలోచించి కొంతమంది తోటి విద్యార్ధుల సహకారం, ఇంకా KL University వారి ప్రోత్సాహంతో ఈ "Drone Technology"ని వ్యవసాయానికి తగ్గట్టుగా ఉపయోగపడేలా రూపొందించాడు. ఈ డ్రోన్ తో మనిషి అవసరం లేకుండా పంటకు అవసరమయ్యే మందులను Spray చేసుకోవచ్చు.
ఈ డ్రోన్ బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. దీనికి 12 Megapixel Camera ఉంటుంది. ఈ కెమెరా ద్వారా రైతు ఒక Particular Placeలో కూర్చుని Droneని ఆపరేట్ చేసుకోవచ్చు. మామూలు Spray మిషన్స్ తో ఐతే గంటకు ఒక్క ఎకరానికి మాత్రమే మందు చల్లగలం కాని ఈ డ్రోన్ ద్వారా కేవలం 10నిమిషాలలోనే ఒక ఎకరానికి సరిపోయేంతటి మందును Spray చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో ఇంకో గొప్ప ప్రత్యేకత ఉంది.. డ్రోన్ కొంత ఎత్తులోకి వెళ్ళి పంటనంతటిని Scan చేసేస్తుంది. ఈ Scanతో పంటకు ఏ తెగులు ఆశించిందనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ Scan ద్వారా తెగులు మాత్రమే కాక ఒక మామిడి తోటలో ఎన్ని పండ్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
ఈ డ్రోన్ పనితీరును ప్రతిష్టాత్మక ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము శాస్త్రవేత్తలు పరిశీలించి ఇది వ్యవసాయానికి మంచి ఉపయోగంగా ఉంటుందని భావించారు. రైతులందరికి అందుబాటు ధరలో ఉండేలా తగిన ప్రణాళికలు చేస్తున్నారు. ఈ డ్రోన్ లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు చెన్నైకి చెందిన ఒక కంపెనీతో కలిసి ఉత్పత్తి చేయబోతున్నారు. ముందుగా వీటి పనితీరును రైతులకు వివరించి వీటిలో ఇంకేమైన ఉపయోగాలు అవసరమా అని తెలుసుకుంటారు. ప్రస్తుతం గోపిరాజా తపన ఒక్కటే ..ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఎలా ఉందో వచ్చే పది సంవత్సరాలలో ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ డ్రోన్ ఉండాలని కృషిచేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.