అన్ని దేశాలతో పాటు మన దేశంలోను యాక్సిడెంట్స్ జరుగుతున్నా గాని WHO లెక్కల ప్రకారం మన భారతదేశంలోనే యాక్సిడెంట్స్ మూలంగా అత్యధికంగా చనిపోతున్నారని తేలింది. సరైన ట్రీట్మెంట్ అందకపోవడం ఒక కారణమైతే, ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో డబ్బు చేతికందకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఇదంతా గుర్తించి కలత చెంది సోమశేఖర్ గారు నిరుపేదల నుండి మధ్యతరగతి వారికి ఒక గొప్ప ధీమాను అందిస్తున్నారు.
డా. సోమశేఖర్ గారు: సోమశేఖర్ గారు చిన్నతనం నుండి చాలా కష్టపడి చదువుకున్నారు. ఆర్ధికంగా అంతంత మాత్రంగా ఉన్నా గాని అప్పులు చేసి మరి డాక్టర్ అయ్యారు. ఆ తర్వాత "లక్ష్యం చేరుకున్నా కదా అని శేఖర్ ఆగిపోలేదు". డబ్బు సంపాదించడమే అతని లక్ష్యం అయ్యేదుంటే అక్కడితోనే ఆగిపోయుండే వారేమో కాని అతని లక్ష్యం పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేయడం. అదే సంకల్పంతో 2015లో Sadhana Unique and Innovative Trauma Services(S.U.I.T.S) ను తన మిత్రులతో కలిసి ప్రారంభించారు.
799కే 2,00,000 రూపాయల వైద్యం: అవును ఒక్కసారి రూ.799 చెల్లిస్తే రూ.2,00,000 వరకు యాక్సిడెంట్స్ కు సంబంధించిన ఉచిత వైద్యం 12నెలల వ్యాలిడిటీతో తీసుకోవచ్చు. అది కూడా కార్పోరేట్ హాస్పిటల్స్ ఐన కేర్, అపోలో, యశోద, కిమ్స్, గ్లోబల్ ఇలాంటి హైదరాబాద్ లో ఉన్న 30కి పైగా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఉన్న 1,500కు పైగా హాస్పిటల్స్ లో పూర్తి ఉచితంగా (2,00,000) ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ అదృష్టవశాత్తు సంవత్సరంలో ఏ యాక్సిడెంట్ జరుగకుంటే ఆ డబ్బుతో మిగిలిన ప్రమాదం గురైన వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. దీని వల్ల మన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఛారిటీ రూపంలో మనం మరొకరిని ఆదుకునే అవకాశం ఉంది.
3,000 మంది ప్రాణాలను రక్షించారు: ఈ పద్దతి మూలంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ సేవల మూలంగా ఇప్పటికి సుమారు మూడు వేలకు మందికి అత్యవసర చికిత్స అందించారు. ఎన్నో కంపెనీలు, కాలేజీలు ఇందులో మెంబర్ షిప్ తీసుకున్నారు.
మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతదేశంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాలు అత్యధికం. ఇక నుండి మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఆత్మీయులకు యాక్సిడెంట్స్ జరిగితే వారు కోలుకోవాలనే ఆశించుకోవచ్చు తప్పా డబ్బు దొరుకుతుందా లేదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరంలో ఎన్నో వృధా ఖర్చులు చేస్తుంటాం ఖర్చులు తగ్గించుకుని మనకు మాత్రమే కాకుండా మన ఆత్మీయులకు ఇందులో మెంబర్ షిప్ తీసుకుంటే ఎంతో ధీమాను అందించగలుగుతాం.