Everything You Need To Know About The First Vice-President Of India!

Updated on
Everything You Need To Know About The First Vice-President Of India!

రాధాకృష్ణన్ గారిది ఒక హిందూ బ్రహ్మణ కుటుంబం వీళ్లది చాలా పేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిని చేయాలనుకున్నారు కాని రాధాకృష్ణన్ బాగా చదువుకుని ఉద్యోగం చేయ్యాలకునేవారు. రాధాకృష్ణన్ కు పుస్తకాలు అంటే చాలా ఇష్టం రోజుకు దాదాపు 12గంటల వరకు పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అలా ఆరోజుల్లోనే ఎంఏ ఫిలాసఫీ వరకు చదివి 20సంవత్సరాలకే మద్రాస్ ప్రెసిండెన్సి కళాశాలలో ప్రొఫెసర్ అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మన తెలుగువారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆయన విద్యార్ధులు వారి భుజాలమీద ఎత్తుకొని కాలేజీ చుట్టు ఊరెగించారట "అది వారి ప్రేమకు చిహ్నం."

Dr.-Sarvepalli-Radhakrishnan

సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5వ తేదిన వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు స్వాతంత్ర్యం వచ్చాక మొదటి ఉపరాష్ట్రపతిగా బాబు రాజేంద్రప్రసాద్ తర్వాత రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన రాసిన ఇండియన్ ఫిలాసఫి అనే పుస్తకం ప్రపంచపు అత్యున్నత పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. అలా దాదాపుగా 25 పుస్తకాలు వరకు రచించారు. భారతీయులు మరియు వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా, ఉన్నతంగా ఉంటుందో నాటి కాలంలో ప్రపంచ అధినేతలకు తెలిసింది ఆయన వల్లనే. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తేదిన భారతదేశంలో టీచర్స్ డే గా జరుపుకుంటారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆయన విద్యార్ధులను ఏ విధంగా తీర్చిదిద్దుతారో అని.

AR7956-U						3 June 1963 Meeting with Dr. Sarvepalli Radhakrishnan, President of India, 4:35PM. Please credit "Abbie Rowe. White House Photographs. John F. Kennedy Presidential Library and Museum, Boston" AR7956-U 3 June 1963
Meeting with Dr. Sarvepalli Radhakrishnan, President of India, 4:35PM.
Please credit "Abbie Rowe. White House Photographs. John F. Kennedy Presidential Library and Museum, Boston"

సర్వేపల్లి రాధాకృష్ణన్ చేపట్టిన పదవులు:

1) మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు (1918-1921). 2) బ్రిటన్ లో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రెస్ కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. 3) ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రెస్ లో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. 4) 1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయడానికి ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు Comparative Religion అనే సబ్జెక్ట్ మీద స్పీచ్ ఇచ్చారు. 5) ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసారు (1931-1936). 6) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసారు (1939-1948). 7) భారత రాయబారిగా రష్యాలో పనిచేసారు (1949-1952). 8) విశ్వవిద్యాలయాల విద్యా కమీషన్ కు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు (1948). 9) యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు (1948). 10) యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు (1952). 11) బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు (1962).

Ph. Studio/February, 56, A22d(vi) The Vice-President Dr. S. Radhakrishnan laying the Foundation Stone of the A.G. C.R. Office building at Mathura Road in New Delhi on February 16, 1956. Ph. Studio/February, 56, A22d(vi)
The Vice-President Dr. S. Radhakrishnan laying the Foundation Stone of the A.G. C.R. Office building at Mathura Road in New Delhi on February 16, 1956.

రాధాకృష్ణన్ అందుకున్న గౌరవాలు:

1) బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు అందుకున్నారు (1931). 2) ఉపాధ్యాయుడిగా, రాష్ట్రపతిగా, దేశానికి చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన "భారతరత్న" బిరుదు పొందారు (1954). 3) ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవారి నుండి ఎన్నోగౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు. 4) ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ Chevening Scholarship ప్రకటించింది

Photo Studio/February,1954,A22d(v)/A22a(v) The Vice-President, Dr. S. Radhakrishnan, inaugurating the Round-Table Conference on the Teaching of the Social Sciences, in South Asia in the old Convocation Hall, Delhi University, on February 15, 1954. The Conference has been organized by the UNESCO. Photograph taken on the occasion shows Dr. S. Radhakrishnan delivering his inaugural address. Photo Studio/February,1954,A22d(v)/A22a(v)
The Vice-President, Dr. S. Radhakrishnan, inaugurating the Round-Table Conference on the Teaching of the Social Sciences, in South Asia in the old Convocation Hall, Delhi University, on February 15, 1954. The Conference has been organized by the UNESCO.
Photograph taken on the occasion shows Dr. S. Radhakrishnan delivering his inaugural address.