Why Do People Suicide: This Guy's Honest Note Is A Brutal Reality

Updated on
Why Do People Suicide: This Guy's Honest Note Is A Brutal Reality

Contributed By Hari Atthaluri

ఆత్మ హత్య, కారణం ఏదైనా చాలా మంది మొదట కనిపించే ఆప్షన్ అయిపోతోంది ఇది. పరీక్ష లో ఫెయిల్ అవుతామనిపించినప్పుడు, అనుకున్న జాబ్ రానప్పుడు, ప్రేమించిన వ్యక్తి ఇలా కారణమైన ఆత్మహత్య అనే క్షణికావేశపు నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అలా నా స్నేహితులు కూడా ఈ నిర్ణయం తీస్కుని దూరమైనప్పుడు నాలోని ఆలోచనలు ఇవి. నా మనవి ఇది. నిజానికి ఆత్మహత్య ని నిర్ములించడానికి రెండు వైపుల ఆలోచించాలి. రెండు వైపులా అవగాహన ఉండాలి.

Side 1 పక్క మనిషి బాధని దిగులు తో ఉన్నా కూడా పట్టించుకోని, వాళ్ళతో టైం గడపలేని మనది తప్పా ? తన లోని సంఘర్షణ ని బయటకు చెప్తే అర్థం చేసుకోలేని...ఓదార్పు ఇవ్వలేని కుటుంబం తప్పా ?? చిన్న చిన్న వాటిని కూడా మహా పాపాలు గా చూస్తూ... చూపిస్తూ...ఎత్తి చూపుతూ దెప్పి పొడుస్తూ ఉండే ఈ సొసైటీ తప్పా ??

ప్రతి దాన్ని "పరువు" & "పరుగు" తో కలిపి దాన్ని ఓ ఉరి తాడు లా చేస్తున్నాం... అందుకే ఏం సమస్య వచ్చినా ఎవరు ఎం అనుకుంటారో అని వాళ్లకు వాళ్ళే భయపడి, ఎం అవ్వకముందే ఏదోకటి చేసుకునేలా ప్రేరేపిస్తున్నాం.... ఫెయిల్ ఐతే సూసైడ్... ఫెయిల్ అవుతా ఏమో అని సూసైడ్... పేరెంట్స్ కి నచ్చినట్టు ఉండలేకపోతున్నా అని సూసైడ్... టైం కి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు. అలా అవ్వకపోతే సూసైడ్... అప్పులు ఉంటే సూసైడ్... ఆప్తులు లేరు అని సూసైడ్...

ఇవేం తప్పులు కాదు... అలాగే ఇవి అందరి లైఫ్ లో ఒకే టైం కి ఒకేలా జరగవు... అది అందరకీ తెలుసు... కానీ అలా అవ్వకపొతే అదేదో పాపం అన్నట్టు గుచ్చి గుచ్చి.. అడిగి అడిగి.. మాటల్తో మనం బాధ పెట్టడం వల్లే వాళ్ళు "చావు" అనే పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు... ఇలా వాళ్ళని అర్ధం చేసుకోలేని మనదే పెద్ద తప్పు..

Side 2 చచ్చిపోవటానికి కూడా ఎలా అనే దానికి ఎన్నో రకాలు గా ఆలోచించి, ఎంతో కొంత టైం తీసుకుని ప్రిపేర్ అవ్వాలి... అన్ని రకాల ఆలోచనలు ని నీకు ఉన్న ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ వెతకటానికి వాడొచ్చు కదా ??? పోయిన సంవత్సరం ఇదే రోజు..నీకు ఏం ప్రాబ్లెమ్ ఉంది ! గుర్తుందా ??? అంతకముందు ? అంతకముందు ?? ప్రతి రోజు కొత్తవి వస్తూనే ఉంటాయి... అవన్నీ సాల్వ్ చేసి...ఇపుడు ఇక్కడ వరకు వచ్చింది నువ్వే కదా !! ఇన్ని కష్టాలు..అన్ని పరీక్షలు చూసింది పాస్ ఐయ్యింది నువ్వే కదా !! యే తల్లి తండ్రి ఐనా తమ ఆశలు తగ్గట్టు పిల్లలు ఉండాలి అనుకుంటారు కానీ అంత కన్నా ముందు తమ పిల్లలు నిండు నూరేళ్ళు బతకాలి అనే కోరుకుంటారు... యే బిడ్డ కూడా నన్ను ఇలా అనాధ ని చేసి చచ్చిపొండి అని తల్లి తండ్రుల ని కోరుకోదు..!!

అసలు సృష్టిలో ఏ ప్రేమ బలి కోరదు...అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ..!! మన వల్ల అవ్వదు అనిపిస్తే, దాని గురించి ముందే చెప్పండి..pressure తీసుకోకండి.వెంటనే అర్దం చేసుకోరు ఎవ్వరూ !! తిడతారు... పడండి.. టైం ఇవ్వండి.. వాళ్ళే ఒప్పుకుంటారు.. మనకి నచ్చిన వాళ్ళు మన లైఫ్ లో లేకపోతే ఏం అవ్తుంది ?? ఏం అవ్వదు...

చిన్నప్పటి నుంచి చాలా చూసి ఉంటాం.. చాలానే నచ్చి ఉంటాయి. అవన్నీ కావాలి అనుకున్నా రాలేదు గా..ఇది కూడా అంతే...కొన్ని రోజులు ఆగితే ఇంకోటి నచ్చుతుంది... మనకి బాధలు మూడు రకాలు గా వస్తాయి... మనం చేసేవి.. మనం చేయనవి.. అసలు మనకు యే సంబంధం లేనివి..

1.మనం చేసింది తప్పే అవ్వొచ్చు.. పూర్తి బాధ్యత మనదే అవ్వొచ్చు.. కాని అది తప్పు అని తెలుసుకున్నాం.. అప్పుడు చేయాల్సింది క్షమించండి అని అడగటం, ఆ తప్పు ఇంకోసారి చేయకుండా ఉండటం... అంతే కాని చావడం కాదు .. 2.మనం ఏం చేయల.. పక్కనొడి తప్పుకి మనం అనుభవిస్తున్నాం....అది భాగస్వామి అవొచ్చు..బంధుత్వం అవ్వొచ్చు... బిజినెస్ అవ్వొచ్చు...

జరిగింది తప్పు కాదు... నమ్మి మోసపోవటం... అలాంటప్పుడు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేయండి... తర్వాత మీకు నచ్చినట్టు మీరు ఉండండి... మనలో మనం మధన పడి చావడం కంటే అదే బెటర్...

3. అసలు మనకు ఏం సంబంధం లేనివి... దీన్నే విధి ..దరిద్రం.. ఏమైనా అనుకోండి...దీన్ని మనం ఏం చేయలేం... కానీ దీనికి కూడా టైం ఇవ్వండి... ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు... సంవత్సరం తర్వాత అంతగా గుర్తు ఉండదు.... కొన్ని సంవత్సరాలు ఆగితే అసలు ఎవడకి గుర్తు రాదు... సీతమ్మ కూడా రాముడు వస్తాడు, మళ్ళీ అంతా బాగుంటుంది అనే లంక లో అన్ని రోజులు నమ్మకం గా ఉంది.... దేవుళ్ళు కూడా వెయిట్ చేశారు కష్టం వస్తె... మనం ఎంత ???

ముందు problem వస్తే ఫ్రెండ్స్ తో ఐనా share చేసుకోండి please.... క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకండి.. ఇలాంటి నిర్ణయం వల్ల స్నేహితుడు ని పోగొట్టుకున్న ఒకడు.