Here’s All You need to Know About Doklam Issue And The India-China Border Standoff!

Updated on
Here’s All You need to Know About Doklam Issue And The India-China Border Standoff!

భారత్ చైనాల మధ్య మునుపెన్నడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి . దీనికి కారణం టిబెట్ లోని డోక్లామ్ పీఠభూమిలో చైనా నిర్మిస్తున్న రహదారి . అసలు ఈ డోక్లామ్ పీఠభూమి ఎక్కడుంది,చైనా నిర్మించే ఈ రహదారి మీద భారత్ అభ్యంతరాలు ఏమిటి , అసలు భారత్ చైనా సరిహద్దులో ఎం జరుగుతుంది . ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం.

భారత్ చైనా ల మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉన్నాయి . సరిహద్దు సమస్య వల్లనే 1962 లో భారత్ చైనా యుద్ధం సంభవించింది . భారత్ చైనాల మధ్య సరిహద్దుగా మనం భావించే Macmohan లైన్ ని చైనా గుర్తించదు . మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని చైనా తమ దేశంలో ఒక భాగంగా దక్షిణ టిబెట్ గా భావిస్తుంది . సిక్కిం ని కూడా మన దేశంలో ఒక భాగమని చైనా గుర్తించింది ఈ మధ్యనే . చైనా తమ భూభాగంగా భావించే టిబెట్ పై భారత్ వైఖరి వంటివి నిత్యం భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలని పెంచుతూనే ఉన్నాయి . ఇక అంతర్జాతీయ మార్కెట్ లో స్థిరమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ ,ఎక్కడ తమకి పోటీగా మారుతుందో అనే భయాలు.భారత్ అమెరికా మధ్య స్నేహ సంబంధాలుతో ఆసియాలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుందో అనే సందేహాలు ఒకపక్క . చైనా తీసుకునే నిర్ణయాలని గుడ్డిగా సమర్ధించకపోవడం లాంటి చర్యలు భారత్ చైనా మధ్య దూరాన్ని పెంచుతూ ఉన్నాయి.

డోక్లామ్ పీఠభూమి భారత్ భూటాన్ టిబెట్ దేశాల Trijunction లో ఉంది . భారత్లోని సిక్కిం రాష్ట్రానికి, భూటాన్ దేశానికి అతి దగ్గరలో టిబెట్లో ఉంది ఈ ప్రాంతం ,ఇక్కడ చైనా ఒక రహదారిని నిర్మిస్తుంది,ఈ రహదారి నిర్మాణం వల్ల భారత దేశ భూభాగానికి చైనా అతి చేరువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈశాన్య భారతానికి - భారతదేశానికి మధ్య వారధి గా ఉన్న ప్రాంతాన్ని సిలిగురి కారిడార్ అంటాము. ఇది కేవలం 50కి .మీ ల వైశాల్యంతో ఉన్న ప్రాంతం దీనిని చికెన్ నెక్ ఏరియా అని అంటుంటారు. ఈశాన్య భరతం లోని ఏడు రాష్ట్రాలకి రాకపోకలు,వస్తు వాణిజ్య సరఫరాలు, సైనిక భద్రత దళాల రాకపోకలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరుగుతుంటాయి . ఒకవేళ చైనా డోక్లామ్ లో పాగా వేసినట్లయితే క్రమ క్రమంగా భారత భూభాగంలోకి చొరబాట్లతో ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లో చాలా సార్లు చైనా తమ సైనికులను భారత భూభాగంలోకి పంపి సరిహద్దుల్ని మార్చివేసింది. దేశ భద్రత కారణాల దృష్ట్యా భారత్ చైనా నిర్మిస్తున్న ఈ రహదారిని వ్యతిరేకిస్తుంది.

డొకోలా అనే ప్రాంతం లో చైనా ఇదివరకే ఒక రహదారిని నిర్మించుకుంది . ఇది భూటాన్ కి అతి సమీపంలో ఉంది . చైనా ఈ రహదారిని మరింత విస్తరిస్తూ భూటాన్లోని భూభాగానికి చేరువగా వచ్చాయి . దీనికి బదులుగా చైనా తమ ఆదీనంలో టిబెట్ లో కొంత భూభాగాన్ని భూటాన్ కి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ భూటాన్ భారత్ తో ఉన్న సంబంధాల వల్ల చైనా ప్రతిపాదనని తిరస్కరించింది . చైనా డోక్లామ్ లో రహదారిని నిర్మించకుండా భారత దళాలు భూటాన్లోని డొకోలా ప్రాంతం వద్ద చైనా కి అడ్డుపడడంతో విషయం తీవ్రరూపు దాల్చింది. దీనికి నిరసనగా చైనా,భారత యాత్రికులు మానస సరోవరానికి వెళ్లే నాథులా పాస్ ని మూసివేసింది.

డోక్లామ్ లో ఇరువైపులా రెండు దేశాల సైనిక దళాలు మోహరించి ఉన్నాయి . అప్పటినుండి చైనా భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి . దౌత్యవేత్తలు విదేశీ వ్యవహారాల అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ సరిహద్దులో పరిస్థితి మాత్రం మారటం లేదు. యుద్దానికి చైనా సిద్ధం అంటూ చైనా దేశాధ్యక్షుడు క్సీ జింపింగ్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది . భారత్ కూడా ఇది 1962 నాటి భారత్ కాదు అని దీటుగా సమాధానం ఇచ్చింది .యుద్ధం అనివార్య అవ్వాల్సినంతగా పరిస్థితులు చేయి దాటి పోలేదు.చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి . గతంలో చేసుకున్న పంచశీల ఒప్పందం ,ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య వర్తక వ్యవహారాల వల్ల చర్చలతోనే సమస్య పరిష్కారం జరగోచ్చునని భారత్ భావిస్తుంది. కానీ చైనా రోజురోజుకి చేస్తున్న కవ్వింపు చర్యల వల్ల మాత్రం సరిహద్దులో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయాందోళనలు ఉన్నాయి.

భారత్ చైనాల మధ్య వైరం పెరగడానికి కారణాలు - చారిత్రాత్మక నేపథ్యం చైనా భారత్ లు ఆసియాలో అతి శక్తివంతమైన దేశాలు. చైనా, భారత్ ఎక్కడ తనకి పోటీగా మారుతుందో అనే భయం మొదటి నుండి ఉంది. అప్పటి ప్రధాని నెహ్రు చైనాతో స్నేహసంబంధాల కోసం పంచశీల ఒప్పందం చేసారు. కానీ టిబెట్ వ్యవహారం లో భారత్ వైఖరి వల్ల ,దలైలామా కి భారత్ లో ఆశ్రయం కల్పించడం వల్ల చైనా భారత్ పై కోపాన్ని పెంచుకుంది. సరిహద్దు సమస్యని సాకుగా చూపి 1962 లో యుద్దానికి తెరలేపింది. జమ్మూలోని కీలకమైన ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. నాటి నుండి భారత్ చైనా మధ్య సంబంధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి . ఇక భారత్ ఎదుగుదల,అగ్రరాజ్యం అమెరికా తో స్నేహ సంబంధాలు. రోజురోజుకి మెరుగవుతున్న భారత ఆర్థిక పరిస్థితిని గమనించిన చైనా నేరుగా భారతిని దెబ్బ కొట్టలేక అడ్డదారిలో భారత్ కి ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ వస్తుంది. దీనిలో ఒకటి కారకోరం రహదారి నిర్మాణం . చైనా ఆక్రమించుకున్న ఆక్సాయిచిన్ నుండి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చైనా ఒక పెద్ద రహదారిని నిర్మించి పాకిస్తాన్ కి కావాల్సిన ఆయుధాల్ని సరఫరా చేస్తుంది . భారత్ ని దెబ్బ తీయాలనే లక్ష్యంతో పాక్ తో మైత్రి పెంచుకుంది. ఇక చైనా ఎంచుకున్న మరో మార్గం ,ఈశాన్య రాష్ట్రాలు . ఈశాన్య రాష్ట్ర ప్రజలపై మిగతా రాష్ట్రాల వారు చూపే వివక్ష ని చైనా తెలివిగా ఉపయోగించుకుంటుంది. భారతీయులుగా గుర్తించనపుడు భారత్లో ఉండడం ఎందుకంటూ ఈశాన్య రాష్ట్ర ప్రజలని రెచ్చగొడుతూ అక్కడి తీవ్రవాద సంస్థలకి ఆర్థిక ఆయుధ సాయం చేస్తుంది .మరో పక్క భారత్ తో స్నేహ సంబంధాలు ఉండే దేశాలైన నేపాల్ శ్రీలంక వంటి దేశాలకి ఆర్థిక సహాయాలని చేస్తూ వాటిని తమ వైపు తిప్పుకుంటుంది. భారత్ ని ఇరకాటంలోకి నెట్టే ఏ అవకాశాన్ని చైనా వదులుకోవట్లేదు. ఓ వైపు ఉన్నత స్థాయిలో చేయి చేయి కలుపుతూనే మరోవైపు తన కుటిల బుద్దిని చాటుకుంటుంది . చైనా తీసుకునే నిర్ణయాలని గుడ్డిగా ఆమోదించకపోవడం కూడా చైనాకి భారత్ పై ద్వేషం పెరగడానికి మరో కారణం . ఇప్పుడు కూడా అంది వచ్చిన డోక్లామ్ సమస్యని మరింత పెద్దదిగా చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంది.