కొన్ని అద్భుతాలు ప్లాన్ చేస్తే జరగవు అనుకోకుండా అలా జరిగిపోతాయి ఆ అద్భుతం మనకు గుర్తింపును, కొత్త జీవితాన్ని అందిస్తుంది. ఇక ఆ అద్భుతాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడంలోనే తెలుస్తుంది మన ప్రతిభ. హైదరాబాద్ కు చెందిన దివ్య రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు. కదేది కల్తీకి అనర్హం అన్న స్థాయిలో కల్తీ జరిగిపోతుంది ఇలాంటి పరిస్థితులలో పిల్లలకు సరైన పోషకవిలువలు అందించడానికి పాలు ఎంతో అవసరం.. అలాంటి స్వచ్చమైన ఆవుపాల కోసం ఎన్నోచోట్ల ప్రయత్నాలు చేశారు కొన్ని చోట్ల "ఇస్తామని చెప్పి అందులోను పాకెట్ పాలు, నీళ్ళు ఎక్కువ పోయడంలాంటివి చేస్తుండేవారు.
ఈ అవస్థ నాకు మాత్రమే కాదు నా బంధువులకు స్నేహితులకూ ఉంది. మనకోసం, మన మిత్రులు బంధువుల కోసం మనమే ఆవులను పెంచుకోవచ్చు కదా అని చెప్పి 2015లో 30ఎకరాల తన ఫాం హౌజ్ లో 15 ఆవులతో గోశాలను ఏర్పాటుచేశారు. కేవలం స్వచ్చమైన పాలను సరఫరా చేద్దామనే ఉద్దేశం తప్ప మరే ఇతర ఉద్దేశం లేకపోవడంతో పాలు నాణ్యతతో ఉండడంతో ఇతర బయటి వ్యక్తులు కూడా కోరడం జరిగింది.. ఇంకేముంది ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ వ్యాపారం ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ సక్సెస్ సాధిస్తుందని మరోసారి రుజువైంది.
200కు పైగా ఆవులతో: విదేశి ఆవుల వల్ల పాలదిగుబడి ఎక్కువగా వస్తుంది అన్నమాటే కాని ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అవ్వి ఏమాత్రం తట్టుకోలేవు. దివ్యరెడ్డి గారు దాదాపు ప్రతి ఆవును కూడా గుజరాత్ నుండే ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. వీటికి ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. వీటికందించే గడ్డి ఇతర ఆహారం కూడా బయటినుండి కాకుండా ఇదే ఫాంలో పండిస్తారు.
నమ్మకం: వ్యాపార సంబంధాలు ధృడంగా ఉండాలంటే నమ్మకం ఏర్పడాలి, 99సార్లు మంచి చేసి తెలియకుండా ఒక్క తప్పు జరిగిన నమ్మకం సన్నగిల్లుతుంది.. దివ్యరెడ్డి గారు వినియోగదారుల ఆనందం కోసం ఏ చిన్న అజాగ్రత్తకు పాల్పడకుండా జగ్రత్తలు తీసుకుంటారు. ఆవు నుండి పాలు తీసుకున్న 3గంటలలోపే ప్రతి వినియోగదారునికి ఉదయం సాయంత్రం హైదరాబాద్ లోని పదిహేను ప్రాంతాలకూ చేరిపోతుంది. పాలు మాత్రమే కాదు స్వచ్చమైన నెయ్యి, వెన్న కూడా సరఫరా చేయడం వీరి అదనపు ప్రత్యేకత. "సరిగ్గా ఉపయోగించుకోవాలే కాని వ్యర్ధం అంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు." సుమారూ 200కు పైగా ప్రతిరోజు వచ్చే పేడ, గోమూత్రంతో అగరబత్తీలను తయారుచేయడం, బయోగ్యాస్ కోసం వినియోగించడం, పేడ పసుపు ఇసుకలతో వినాయక విగ్రహాలు తయారుచేయడం లాంటివి కూడా చేస్తుంటారు.
మహాకవి శ్రీశ్రీ గారు ఓ సందర్భంలో "అగ్గిపుల్ల సబ్బుబిల్ల కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం" అని అన్నట్టుగా న్యాయంగా డబ్బు సంపాధించడంలో చిన్నది, పెద్దది, నామోషి అన్న తారతమ్యం లేదు. ఇంజినీరింగ్ చదివి మొదట తన పిల్లల కోసం ఎంచుకున్న మార్గమే ఇప్పుడు దివ్య గారికి మంచి ఆదాయాన్ని అందించే ఉపాధినిచ్చింది.