A Real Life Love Story Documented In A Girl’s Diary. Will They Meet Or Not?

Updated on
A Real Life Love Story Documented In A Girl’s Diary. Will They Meet Or Not?

Contributed By Pranaya

70% వాస్తవంగా జరిగిన సంఘటనలతో అందంగా రుపొందించిన కథ ఇది. ఐదు భాగాలుగా నిర్మించిన ఈ కథ ప్రతిరోజూ(ఐదు రొజులు) పోస్ట్ కాబోతుంది.

నేను ప్రణయ. మంచి ఉద్యోగం, అందుకు తగ్గట్టే మంచి శాలరీ.. కానీ నాలో ఎదో తెలియని వెలితి. సినిమా కథలు రాయాలని నా కోరిక. అలా నేను రాసిన కథలు పట్టుకొని చాలా సినిమా ఆఫీసులు తిరిగాను. లాభం లేదు. అందరూ కొత్త కథలు కావాలి అనేవారే తప్పా నేను రాసిన కథలు ఒక్కరు కూడా చదవలేదు. నేను రాసిన కథలు కనీసం మ్యాగజైన్లలొ అయిన పబ్లిష్ చేయాలని ప్రయత్నించాను. కుదరలేదు. అదే సమయంలో నాకు మా కంపెనీ ప్రాజెక్ట్ పై జర్మనీ వెళ్లాడనికి అవకాశం వచ్చింది. ఇంట్లో వాళ్ళ ఒతిడి, ఫ్రెండ్స్ ప్రెషర్ చేయడం వల్ల ఇష్టం లేకుండానే స్టార్ట్ అయ్యాను ఎయిర్పోర్ట్ కి.

అది శంషాబాద్ ఎయిర్పోర్ట్, 12 మే 2018. చెక్ ఇన్ అయ్యాను. ఏంటి ఈ లైఫ్. ఇష్టం ఉన్నది చేయలేక ఇష్టం లేనిది బలవంతంగా చేయలేక నాలా ఎంతోమంది వాళ్ళ కలలు వదులుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికి నేను ఒక స్ఫూర్తి కావాలి. ఇష్టమైన దానికోసం కష్టపడిన తర్వాత సుకపడతాం అన్న ధ్యైర్యం నింపగలగాలి అనిపించింది. ఒక్క కథ ఒకే ఒక్క కథ నా జీవితాన్ని చేంజ్ చేస్తుందేమో అన్నా ఆశ తో పేపర్ పై పెన్ పెట్టాను. కళ్ళు ముసుకున్నాను. పక్కనే చిన్నపిల్లల అల్లర్లు, అనౌన్స్ మెంట్స్, అమ్మ నాన్న మాటలు ఇవన్నీ నా మైండ్ లో తిరుగుతున్నాయ్. వెంటనే కళ్ళు తెరచి నా కుడి పక్కకు తిరిగాను. నాకు రెండు అడుగుల దూరంలొ ఒక డైరీ పడి ఉంది. ఆ చుట్టు పక్కల ఎవరు లేరు. డైరీ చేతిలోకి తీసుకున్నాను. ఓపెన్ చేయాలా వద్ద అన్న కన్ఫ్యూషన్ లో ఓపెన్ చేసేసా.

అంశుమలిక... తన పేరు. అది ఒక అమ్మాయి డైరీ. వెంటనే డైరీ మూసేసాను. ఒక అమ్మాయి పెర్సనల్ డైరీ చదవడం తప్పు అనిపించింది. వెళ్లి కాఫీ తెచుకున్నాను. కాఫీ తాగుతున్నా కూడా నా ధ్యాసంత డైరీ పై నే ఉంది. ఇంకో ఆలోచన లేకుండా డైరీ ఓపెన్ చేసేసా.

Date : 12 మే 2018 అంటే ఈరోజే. ఆ అమ్మాయి ఇక్కడే ఏక్కడో ఉండాలి అని నా కళ్లు తనకోసం వెతుకుతుంటే ఆ డైరీ లో మొదటి లైన్ నన్ను ఆపేసింది.

"రెండు దేశాల మధ్య యుద్ధం కంటే రెండు మనసుల మధ్య యుద్ధం చాలా ప్రమాదకరం."

ఎవరు ఈ అమ్మాయి ఎంతబాగా రాసింది అనుకున్నాను. చదవడం కొనసాగించాను. "మనం ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనల్ని ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే మనం ఇష్టపడ్డవాళ్లే మనల్ని ఇష్టపడితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేము. నా లైఫ్ లో అదే జరిగింది. ప్రతి ఒక్కరికి లైఫ్ లో కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి. 10 -15 ఏళ్ళ వయస్సు లో ప్రేమ కళ్ళ దగ్గర మొదలై మాటల దగ్గర ఆగిపోతాయి. 15 - 20 ఏళ్ళ వయస్సు లో ప్రేమ మాటల దగ్గర మొదలై అర్థం చేసుకోలేక ఆగిపోతాయి. 20 - 25 ఏళ్ల వయస్సులో ప్రేమ మనలో కొత్త మనిషిని మనకి పరిచయం చేస్తూ ఈ లోకం ని మరిచిపోయేలా చేస్తుంది. నాకు అదే జరిగింది. అలా చేసింది......... అర్జున్."

"నువ్వు నాకోసం పుట్టిన దేవతవి, నా లక్ష్మీ దేవి వి, లైఫ్ లో నేను ఎలాంటి పరిస్థితి లో ఉన్న నన్ను నువ్వు వదిలేయద్దు. ఎప్పటికి నన్ను నీ నాని లాగే నీ గుండెల్లో దాచుకోవాలి. ఎంత పొస్ కొట్టిన నువ్వే నా బలం బలహీనత", అర్జున్ నాతో చెప్పిన ఈ మాటలు ఎప్పటికి మరువలేను. ఎన్నీ గొడవలు అయిన ఎంత తిట్టుకున్న ఈ మాటలు గుర్తుచేసుకోగానే తను నా పై చూపించిన ప్రేమే గుర్తుంటుంది తప్ప ఇంకేం గుర్తుండవ్. ఆరు సంవత్సరాల ప్రేమను గుండెల్లో దాచుకొని, నిన్ను మార్చిపోలేక, వదిలి ఉండలేక పిచ్చి దాన్ని అవుతున్న. మనసులో ఎదో ఒకమూల నువ్వు వస్తవు మళ్ళి నన్ను కలుస్తావు, ఇంకా నాకోసం వైట్ చేస్తూ ఉంటావన్న నమ్మకంతో బెంగళూర్ వస్తున్నా.

కళ్ళ లో నీళ్లు , గుండెల్లో నీ పై ప్రేమ . ఈ రెండు తప్ప నా మైండ్ లో ఇంకో ఆలోచన లేదు.

ఇంతకీ ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కిందా..? అర్జున్ ని కలిసిందా.? వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారా.? అన్న ఆతృత తో పేజీ తిప్పాను. ఖాళీ పేజీ. వెంటనే నా కళ్ళు ఆ అమ్మాయి కోసం వెదకడం మొదలెట్టాయి. ఎలా వెతకాలి ఆ అమ్మాయి ని. అర్థం కాలేదు. కాసేపు అలా కూర్చుండిపోయా.

దేవుడే దారి చూపించినట్టు నాకు ఈ డైరీ దొరికింది. నా ప్రయాణం ఇపుడే మొదలైంది. ఆ అమ్మాయి ని కలిసి ఈ ప్రేమ కథ ని పూర్తి చేయాలని డిసైడ్ అయ్యా. వెంటనే టికెట్స్ చింపేసి జీవితం అనే ప్రయాణం లో ఒక కొత్త అధ్యాయం కి నాంది పలికాను. ఆ అమ్మాయి నా జీవితాన్నే మార్చేసింది.