లైఫ్ లో మన మీద పడే ప్రెజర్ వల్ల మనం చాలా ఎదగవచ్చు ఒక రకంగా "అవసరం" వల్లనే మనం ముందుకు సాగుతున్నాం. విజయవాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ డేవిడ్ రాజు గారు చదువుకున్నది ఐదవ తరగతి మాత్రమే కాని 58 సంవత్సరాలలో ఆయన సాధించినవి ఒక్కసారి పొందుపరిస్తే యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అందుకుంటారేమో. కొంతమంది పేరు కోసం కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు, డబ్బు కోసం చేస్తుంటారు, రాజు గారు మాత్రం "ఇది సమజానికి ఎంతో అవసరం" అని ఆవిష్కరణలు చేస్తుంటారు.
విజయవాడ ప్రాంతానికి చెందిన డేవిడ్ రాజు గారు ఓ పేద కుటుంబంలో జన్మించారు. టెక్నాలజికి సంబందించి పెద్దగా చదువుకోలేదు కాని యంత్రపరికరాలను విప్పి నిశితంగా నిశితంగా పరిశీలించేవారు. ఎక్కడికైనా మెకానిక్ దగ్గరికి వెళ్తే వారు చేసే రీపేర్లను కూడా తీక్షణంగా చూసేవారు. ఏదైనా కొత్తవి ఆవిష్కరించాలంటే చదువుకన్నా ఆసక్తి ముఖ్యం అని రాజు గారి జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. వారు తయారు చేసిన కొన్ని అద్భుతాలను తెలుసుకుందాం..
రైతుల కోసం: ప్రతిరంగంలో అప్ డేట్ అవ్వడం కన్నా వ్యవసాయంలో అప్ డేట్ అవ్వడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో సోలర్ సిస్టమ్ వాడుతున్నాం కాని దానికి మించి రాజు గారు మాగ్నెటిక్ మోటార్ తయారుచేశారు. మాగ్నెటిక్ మోటార్ కు సోలర్ పవర్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఇవ్వేమి అవసరం ఉండదు. పొల్యూషన్ ఉండదు, సౌండ్ ఉండదు, కరెంట్ షాక్ ఉండదు. వ్యవసాయంలో మిగిలిన మోటర్లకు చేసే ఖర్చులు కూడా దీనికి ఉండదు. 20వేలతో తయారుచేసిన ఈ మోటార్ సుమారు 100కేజీల బరువు ఉంటుంది. ఇంత బరువు ఉన్నా కాని ఇది వ్యవసాయానికి రైతులోకానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
గాలితో నడిచే లారీ: ఇదేంటి టన్నుల బరువుండే లారీని నడపాలంటే ఖచ్చితంగా డీజిల్ అవసరం ఉంటుంది.. గాలితో ఎలా.? అనే ఆశ్చర్యం మీకు వచ్చి ఉంటుంది. అందరీలా ఒకేరకంగా ఆలోచిస్తే కొత్తవి అస్సలు కనుగొనలేము. స్వతహాగా బస్ డ్రైవర్ ఐన రాజు గారు ఇంజిన్ ను ఇంకోరకంగా నడిపితే ఎలా ఉంటుంది.? అని ఆలోచించేవారు. పంటపొలాల్లో బోర్లు వేయడానికి బండరాళ్ళను తొలగించే సమయంలో గాలి కంప్రెషన్ తో రంద్రాలను చేయడం జరుగుతుంది. అదే ఒత్తిడితో పెట్రోల్ లేకుండా వాహనాలను ఎందుకు నడపలేమనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం చాలా రకాల పరిశోధనలే చేశారు. గొప్ప ఆలోచన హాస్యంతో మొదలవుతుందన్నట్టు రాజు గారిని అంతే హేళనగా చూసేవారు. తన ఊహ మీద తనకు ఖచ్చితమైన నమ్మకం ఉండడంతో ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అందరి ఊహకుమించి 2014లో పెట్రోల్, డీజిల్ సహాయం లేకుండా మొదటిసారి జీప్ ను, 2016లో లారీని నడిపించి అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.