రచయితగా త్రివిక్రమ్ గారి మొదటి సినిమా స్వయంవరం అయినా, మొదటి అవార్డు ని తెచ్చిన చిత్రం "చిరునవ్వుతో". ఈ సినిమా నుండి త్రివిక్రమ్ అనే పేరు గట్టిగా వినపడటం మొదలయ్యింది. ఈ సినిమా లో ఛలోక్తులు సూక్తులు సమపాళ్లలో ఉంటాయి. చూసినంత సేపు అస్సలు bore కొట్టకుండా సరదాగా సాగిపోతుంది సినిమా.
సాధారణంగా చాలా సినిమాలో, climax లో heroine కి పెళ్లి జరుగుతూ ఉంటుంది, చివర్లో హీరో వచ్చి ఆ పెళ్లి ని ఆపి heroine ని తనతో తీస్కుని వెళ్ళిపోతాడు. ఇక్కడ చాలా సార్లు ఆ పెళ్ళికొడుకు పాత్రని చూసి జాలిపడి ఉంటాం. అలాంటి ఒక పెళ్లి కొడుకు కథ గా ఈ సినిమా మొదలవుతుంది.
ప్రేమించిన అమ్మాయికి ప్రేమ ని చెప్దాం అనుకునే సమయానికి ఆ అమ్మాయికి వేరే అబ్బాయి తో పెళ్లి కుదురుతుంది. సాధారణంగా ఈ సమయంలో హీరో తనలో తాను బాధపడుతూ.. అమ్మాయికి తన ప్రేమ విషయం ఎప్పటికి తెలియజేయకూడదు అనుకుంటాడు. కానీ పెళ్లి కుదిరిన heroine కి propose చేయడమే interval bang.
విలన్ మోసగాడు. కానీ ఈ విషయాన్నీ నిరూపించడానికి హీరో ఏ ప్రయత్నం చేయడు. సాధారణంగా చివర్లో విలన్ మోసగాడు అని అందరికి తెలిసేలా చేసి హీరోయిన్ ని పెళ్లిచేసుకోవచ్చు. అలా కూడా చేయడు. విలన్ తో ఒప్పందం చేసుకుని అస్సలు గొడవలు పెద్ద పెద్ద dialogues లేకుండా పెళ్లి చేసేసుకుంటాడు. ఇది ending.
ఇలా.. ఈ సినిమా లో కొన్ని cinema stereotypes ని చాలా తెలివి గా దాటారు త్రివిక్రమ్ గారు. హీరో character ని చాలా బాగా different గా, ఒక నిజాయితీ విలువలున్న మనిషిగా రాసుకుని అతని చేత మనిషి గురించి, పెళ్లి గురించి, ప్రేమ గురించి తన ఆలోచనలని చాలా సులువుగా లోతుగా చెప్పించారు త్రివిక్రమ్ గారు. అందులో కొన్ని మంచి డైలాగ్స్ ఇవి.
త్రివిక్రమ్ గారి సినిమా అన్నిట్లో నాకు చాలా ఇష్టమైన సినిమా. త్రివిక్రమ్ గారిలో ఉన్న యువకుడి ఆలోచనలకు ప్రతిబింబం లా ఉంటుంది ఈ సినిమా. మణిశర్మ గారి పాటలు కూడా చాలా బాగుంటాయి "చిరునవ్వుతో", " సంతోషం సగం బలం" పాటలు తప్పకుండ వినాల్సిన పాటలు. అస్సలు bore కొట్టని screenplay తో ఈ సినిమాని పి.రాంప్రసాద్ గారు direct చేశారు. ఇప్పటికి ఈ సినిమాని చూడకపోతే, చూస్తూ monday ని మొదలుపెట్టండి.