(Article by Ram VamsiKrishna, a post-graduate from IIT-Bombay, now working in Bangalore)
ఒరేయ్ నాని బాబు... ఒసేవ్ హనీ పాపా... ఈళ్ళెవరూ అనుకుంటన్నావా? ఈ ఆర్టికల్ అయ్యేంత వరకూ నువ్వు అబ్బాయి ఐతే నీ పేరు నాని బాబని , అమ్మాయి అయితే హనీ పాపని ఫిక్స్ అయిపో. ఈ రోజు చిల్డ్రన్సు డే కదా, అందుకే సిన్నప్పుడు పెట్టుకున్న ముద్దు పేర్లతో, సిన్నప్పుడు ఆడేసిన చిత్ర ఇచిత్రమైన ఆటల గురుంచి చెప్పుకుందారి. అట్టా ఎర్రి మొహాలేసుకుని సూత్తారేట్రా బాబూ, చదవండీ...
1. పెన్ను పెట్టే ఆట: ఇది ఆట కాదు, వేట ! హనీ పాపా... కళ్ళు మూస్కోవే , ఇది బాగా violent గేము, జడుసుకుంటావ్. మాస్టారు ఎవడినైనా లేపి క్వశ్చన్ అడిగితే ఆడు తిరిగి కూర్చునేటప్పుడు కింద పెన్ను, పెన్సిలు పెట్టే సున్నితమైన ఆటన్నమాట . ఆడు ఎంత గట్టిగా కూర్చుంటే అంత ఇంపాక్ట్ ఈ గేమ్ లో . నేనైతే ఒకసారి డివైడర్ పెట్టేశా మా ఫ్రెండ్ ఒకడికి , తర్వాత మాస్టారు దుమ్ము దులిపేసేరనుకో , అది వేరే కథ !
View post on imgur.com
2. భూమ్ భూమ్ షకలక: ఈ పేరు ఎవడు పెట్టేడో తెలీదు గానోరేయ్ ఆడికి Oscar కాదు Bhaskar ఇయ్యాలి . తాగి పడేసిన సోడా మూతలు ఏరి , ఇంట్లో సైలెంట్ గా క్యాండిల్, అగ్గి పెట్టె కొట్టేసి ఒక పొయ్యి తయారు చేసి , దాని మీద సోడా మూత పెట్టి , అందులో మైనం బాగా కరిగించాలి . బాగా మరిగిన తర్వాత అందులో నీళ్ళు కొట్టేవంటే మంటలు లేస్తాయ్ , ఆ ఘట్టాన్నే భూమ్ భూమ్ షకలక అని పిలిచాడు మహానుబావుడు. ఈ ఆట ఆడుతూ ఎన్ని సార్లు మూతి , ముడ్డి కాలిపోయాయో లెక్కే లేదు.
View post on imgur.com
3. ముక్కు గోకుడాట: ఇది మనలోని భక్తి పిచ్చి కి పరాకాష్ట . ముక్కు 108 సార్లు గోక్కుంటే ఆంజనేయ స్వామి కనిపిస్తాడని ఎవడో ఆవదమ్ మొహం గాడు చెప్పడం , రక్తాలోచ్చేవరకూ గోకేసుకోవడం . ఆ ఎర్ర ముక్కులు చూసుకుని ఆంజనేయ స్వామి కనిపించేడని ఒకడు, కల్కి భగవాన్ కనిపించేడని ఒకత్తి. ఇంటికి ఎల్లిన తర్వాత ఒక్క ఆంజనేయ స్వామేం కర్మ , జీసస్ , అల్లా కూడా కనిపించేసేవారు అమ్మ చేతిలో .
View post on imgur.com
4. గూటీ బిళ్ళ – గుర్రాలాట: ఈ ఆట భలే ఇచిత్రమ్ గా ఉంటదొరేయ్ నాని బాబూ .. కర్ర బిళ్ళ ఆట కి IPL format అన్నమాట . ఇద్దరు కెప్టెన్లు , రెండు టీమ్ లు. ఒక కెప్టెన్ బిళ్ళ ని కొట్టి గెలిపించే వరకూ , opposite టీమ్ వాళ్ళు playing టీమ్ ఒంగుంటే వాళ్ళ మీద గుర్రం లాగా ఎక్కి ఎక్కిరిస్తూ స్వారీ చేస్తారన్నమాట .
View post on imgur.com
5. జోరు బాల్: ఈ ఆట కి రూల్స్ ఉండవే హనీ పాపా , స్పార్టన్స్ ఆడే ఆట. బాల్ ఎవడికి దొరికితే ఆడు ,ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవడిని కావాలంటే ఆన్ని, నడ్డి ఇరిగిపోయేవరకూ బాదెయ్యడమే . మానవత్వానికి మినిమమ్ 330 కిలోమీటర్లు దూరం లో ఉండే ఆట.
View post on imgur.com
6. అమ్మా నాన్న ఆట: ఒరేయ్ నాని బాబు... నాకు తెల్సు రా నువ్వు ఈ పేరు చదవగానే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావని . ఈ రోజు మనం సిన్న పిల్లలమ్ గాబట్టి సిన్న పిల్లల్లాగే ఆలోచిద్దాం , ఎదవ డబుల్ మీనింగులు తీసేవంటే జోడిచ్చుక్కొట్టేత్తాను. నాని బాబు గాడు , హనీ పాప అమ్మా నాన్న ల్లాగా act చేసే cute గేమ్ అన్న మాట !
View post on imgur.com
7. సబ్యిండర్ – కరెంట్ షాక్: దీన్ని ఒరిజినల్ గా ఏమంటారో గుర్తు లేదు గానీ ఒరేయ్ , సబ్యిండర్ , కరెంట్ షాక్ పరిగెత్తే ఆటలన్నమాట. ఎవడో ఉస్సైన్ బోల్ట్ బీబత్సం గా పరిగెడతాడంట అని ఇన్నాం గానీ అప్పట్లో ఈ ఆటల్లో ఒక్కక్కరు రింగు , రింగులేసేసేవోరు. దొంగ పెట్టేవాడు పరిగెట్టుకుంటూ వచ్చి ముట్టుకుని కరెంట్ అంటాడు , వెంటనే కరెంట్ షాక్ కొట్టిన కాకి లాగా నిలబడిపోవాలి, ఇంకొకడోచ్చి షాక్ అని శాప విమోచనం చేసే వరకు !
View post on imgur.com
8. ఆమని – Yes sir!: ఒసేవ్ హనీ పాపా.. ఈ ఆట నీదేనే .. ఈ ఆమని తొక్కుడు బిళ్ళ కి కజిన్ సిస్టర్ అన్నమాట ! ఒక బిళ్ళ ఇసిరి , కళ్ళు మూసుకుని ఒక్కొక్క బాక్స్ ని , borders తొక్కకుండా ఆడే ఆట . కళ్ళు మూసుకుని ఒక్క బాక్స్ లోనికి ఎంటర్ అవ్వగానే ఆమని అంటది ఆడే పిల్ల. కరెక్ట్ గా ఎంటర్ అయితే Yes sir అని , borders తోక్కేస్తే No sir అని హనీ పాపలందరూ బుజ్జి బుజ్జి గా ముద్దు ముద్దు గా ఆడేసుకునే ఆట!
View post on imgur.com
ఒకటా రెండా ఎన్ని ఆటలు , ఎన్ని జ్ఞాపకాలు . ఆటలన్నీ అయిపోతే క్రియేటివిటీ తో కొత్త ఆటలు కనిపెట్టి ఆడేసేవాళ్లం .ఇప్పుడూ ఉన్నాయి ఆటలు , గుళ్ళో పరుగులు , Subway లో Surf పేకెట్లూని . ఒంటి కి exercise లేక గుమ్మడి కాయల్లా తయారవుతున్నారు మన అభినవ నాని బాబులూ , హనీ పాపలూ .. సచ్చిపోయినియ్యి రా బాబూ , ఫీలింగ్స్ అన్నీ సచ్చిపోయినియ్ ! ఒరేయ్ బాబూ సంపూర్ణేష్ .. కనిపెట్టి పంపించరా కొత్త జాతి ని .. అందుకే రేపు పెళ్లి అయ్యాక , మీకు ఇంకో నాని బాబూ గాడో , హనీ పాపో పుట్టేకా ఈ ఆటలు గురించి వాళ్ళకొక్కసారి చెప్పేయండి . ఇలాంటి notorious and cute గేమ్స్ ఇంకా మీకేమైనా తెలిస్తే , ఆ కామెంట్ బాక్స్ లో పడేయ్యండి .
చివరగా , బాలల దినోత్సవ శుబాకాంక్షలు !