Contributed by Bharath Dhulipalla
స్కూల్ నుండి వచ్చినవెంటనే టీవీ ఆన్ చేసి JETIX channel పెట్టి s.p.d నుండి dynothunder అంటూ అన్ని power rangers programs చూడటం . Night tution నుండి రాగానే చక్రవాకం , మొగలి రేకులు అంటూ ఏవేవో సీరియల్స్ వస్తుంటే, అందులో ఫ్యాక్షన్ ఫైట్స్ చూస్ i ఇది సినిమా నా లేదా సీరియల్ ఆ అని డౌట్ రావటం ,వాళ్ళు అదే సీరియల్ కి ప్లస్ అనుకోని దాన్ని ఇంకా మేము చూడలేమురా బాబోయ్ అన్నంతవరకు కొనసాగించడం,
Those were the days
మా ఫ్రెండ్ తప్పు చేసాడని తెలిసిన వాడిని సమర్థిస్తూ అవతల ఉన్న గ్యాంగ్ ని కొట్టడం ,
Those were the days
ఇంటర్ హాస్టల్ లో "అనిత ఓ అనిత " అంటూ పొద్దున్నే repeated mode లో సాంగ్ పెట్టి మాకు నిద్రలేకుండా చేసిన రోజులు, Eamcet వస్తుందంటే చాలు పొద్దున్న లేచిన దగ్గరినుండి రాత్రి నిద్రపోయేవరకు, గంటకి ఒక టెస్ట్ పెట్టి ఇంకమేము ఇక్కడ ఉండలేమురా బాబోయి అని మాకు చిరాకు తెప్పించిన రోజులు
Those were the days
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ఒకసారి క్లాస్ లో ఒక అమ్మాయి నన్నే చూస్తుందని నేను అనుకోని నేను ఓ ఫీల్ అయిపోతుంటే నా ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయి చూస్తుంది నిన్ను కాలేదు నీ వెనకున్న వాడినని చెప్పి ఆకాశంలో ఎగురుతున్న నన్ను కింద పడేసిన రోజులు,
Those were the days
నాకు 3 backlogs, నా ఫ్రెండ్ కి 2 backlogs ఉంటే వాడి దగ్గరికెళ్లి పార్టీ ఇవ్వమని అడగటం వాడు పార్టీ ఎందుకురా ఇద్దరికి backlogs ఉన్నాయి కదా అని అంటే " నాకు అవేం తెలియదు నాకంటే నీకు తక్కువ ఉన్నాయి " అని చెప్పి వాడి దగ్గర పార్టీ తీసుకున్న రోజులు
Those were the days
అటెండెన్స్ 65 కి తక్కువ ఐన వాళ్ళందరిని ఎందుకు తక్కువయిందని అడిగితే అందరం హెల్త్ ఇష్యూ అని చెప్పి 100 రూపాయలకి కాలేజీ దగ్గర్లో ఒక మెడికల్ సర్టిఫికెట్ చేయించడం , ఆ సర్టిఫికెట్స్ చుసిన ప్రిన్సిపాల్, మేము దొంగ సర్టిఫికెట్స్ చేయించాం అని తెలుసుకొని మా అందరికి ఒక ఫోటో frame కట్టించి కాలేజీ లో ప్రతి బ్రాంచ్ క్లాస్ లో గోడ కి తగిలించి మమ్మల్ని యెదవులని పరిచయం చేసిన రోజులు,
Those were the days
ఇంట్లో నెల రోజులకని ఇచ్చిన డబ్బులని, బ్లాక్ లో సినిమా టిక్కెట్లు కొని నచ్చిన ఫుడ్ తిని వారం లో డబ్బులు అని అయిపోగొట్టి మిగితా 3 వారాలు ఎం చెయ్యాలో తెలియక కాలిగా కూర్చొన్న రోజులు
Those were the days
స్కూల్ నుండి కాలేజీ వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తుంటే, " ఆ పాత రోజులు అప్పుడేమో ఎప్పుడైపోతాయ్ రా అని ఇప్పుడేమో అప్పుడే అయిపోయాయి " అని బాధ పడిన రోజులు
Those were the days
ఈ జీవితం అప్పుడే అయిపోలేదు ఇంక ఉందని కళ్ళు తెరిచి చుస్తే మేనేజర్ కోపం తో నన్నే చూస్తూ " సాయంత్రం లోపు వర్క్ కంప్లీట్ అవ్వకపోతే నీకు జీతం కట్ " అని చెప్పి వెళ్తే, ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు అని పాత కథ నే మల్లి ఫస్ట్ నుండి మొదలుపెట్టానేమో అని అనిపించినా ఈ రోజు
Those were the days