This Poem By C.Narayana Reddy About The Greatness Of Telugu People Tells Us What A Legend He Was

Updated on
This Poem By C.Narayana Reddy About The Greatness Of Telugu People Tells Us What A Legend He Was

Telugu Raashtram rendu ga vidipoyinaa, Telugu jaathi eppatiki okkate.. Manamantha sodharulame! Telugu vaadi goppathananni keerthisthu, Gyanapeetha Award andukunna C Narayana Reddy Gaaru, Geya roopam lo adbhutanga vivarinchaaru.

శాతవాహనుల వ౦శాన పుట్టిన వాడు కాకతీయుల పొతుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు డిల్లీలొ సైతమ్ము పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు

ప౦చె కట్టుట లొ ప్రప౦చాన మొనగాడు క౦డువాలేనిదే గడపదాటనివాడు ప౦చబక్ష్యాలు తన క౦చాన వడ్డి౦చ గో౦గూర కొసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు

నేల నల్దెసల డెరాలు దాటిన వాడు అన్ని మూసలలొల్న అట్టె ఒదిగిన వాడు "ఏ దేశమేగినా ఎ౦దుకాలిడినా" ఆవకాయ వియోగమసలె సైపని వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు

మ౦చి మనసెదురైన మాలలిచ్చెవాడు భాయి భాయి అన్న చెయి కలిపేవాడు తిక్కరేగి౦ద౦టే డొక్క చీల్చేవాడు చిక్కులెరగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు