దేశ రాజధాని ఢిల్లీ లో పొల్యూషన్ భయానక పరిస్థితిలోకి చేరిపోయింది. ప్రభుత్వం ముందుకు వచ్చి సరి బేసి సంఖ్యల విధానం అమలులోకి తెచ్చింది. అంటే వెహికిల్ చివరి నెంబర్ సరి సంఖ్యలో ఉండే వెహికిల్స్ ఒకరోజు, బేసి సంఖ్యలన్న వెహికిల్స్ మరోరోజు రోడ్డు మీదకు అనుమతిస్తారు. దీని వల్ల 50% వెహికిల్ ద్వారా వచ్చే పొల్యూషన్ కంట్రోల్ చేయవచ్చుననే లక్ష్యం. వినటానికి భయంగా ఉంది కదూ.. అవును మనకు కూడా భవిషత్తులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది. ప్రతిరోజూ కొన్ని వందల కొత్త వెహికిల్స్ రావడం, మరోపక్క చెట్లు నరికేస్తుండడంతో ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం మన దగ్గర రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం, మెట్రో అధికారులు, జూమ్ కార్ కంపెనీ ముందుకు వచ్చింది.
మెట్రో ట్రైన్స్ వల్ల ట్రాఫిక్ ముందు ఉన్నట్టుగా లేదు. మెట్రో ట్రైన్ మెయిన్ రోడ్ వరకే పరిమితమవుతుంది. ట్రైన్ దిగి తిరిగి ఇంటికి వెళ్ళడానికి మళ్ళి ఆటో కాని, పర్సనల్ వెహికిల్ కాని మళ్ళి వాడాల్సి ఉంటుంది. ప్రయాణికులను పూర్తి గమ్య స్థానాలకు చేరవేస్తూ, పొల్యూషన్ తగ్గించాలని సర్వీస్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్ అండ్‌టీ మెట్రో సీఓఓ అనిల్‌కుమార్ సైనీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, జూమ్ కార్ ఇండియా సీఓఓ సుదీంద్రరెడ్డి కలసి బ్యాటరీతో నడిచే మహీంద్ర ఈ2ఓ ప్లస్ కార్లను ముందుగా 25 కార్లతో మియాపూర్ మెట్రో స్టేషన్ లో ప్రారంభించారు.
మెట్రో ట్రైన్ ట్రాక్ ద్వారా 45 ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. ఈ శక్తి ద్వారానే ఎలక్ట్రిక్ కార్లు చార్జ్ చేయబడతాయి. ప్రస్తుతం 25 కార్లు ఉన్నా భవిషత్తులో 65 మెట్రో స్టేషన్లలో 250 కార్లకు పెంచబోతున్నారు. ఈ విధానం ద్వారా ఎలక్ట్రిక్ కార్ల కు మంచి పబ్లిసిటీ జరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ఆధారంగా నడిచే వెహికిల్స్ ను తగ్గుముఖం పట్టి ఈ ఎలక్ట్రిక్ చార్జింగ్ కార్లు మరింత పెరగబోతున్నాయి. మహీంద్రా E2O Plus కార్లను వినియోగిస్తున్నారు. 15 వోల్టుల పవర్ తో చార్జింగ్ చేసేందుకు దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ ద్వారా ఐతే ఒక్కసారి బ్యాటరీ ఫుల్ కావడానికి 90 నిమిషాలు పడుతుంది, ఫుల్ చార్జింగ్ తో 140కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్ లో అందుబాటులో ఉన్న వీటి రెంట్ గంటకు రూ.40 గా నిర్ణయించారు. నెలరోజులకు మాత్రం రూ.10,000 చెల్లించి కార్ ఉపయోగించుకోవచ్చు. ఈ కార్ ను వినియోగించుకోవాలనుకునే వారు "zoom car self drive car rental" యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ డీటెల్స్ పొందుపరచాలి. యాప్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెలరోజులు రెంట్ కు తీసుకుంటే కనుక మనకు ఇంకో అద్భుతమైన అవకాశం కూడా ఉంది. మనం రెంట్ కు తీసుకున్న కారును ఇతరులతో షేర్ చేసుకుని ఇలా కూడా కొంతవరకు సంపాదించుకోవచ్చు
For more info visit their website.