Everything You Need To Know About Brahmasri Chaganti Koteswara Rao!

Updated on
Everything You Need To Know About Brahmasri Chaganti Koteswara Rao!
ఈ కాలంలో మంచి Motivational గా ఉండే Movies నే చూడటం లేదు... కనీసం స్కూల్ లో కాలేజీలో, బయట తెలిసినవాళ్ళు ఏదో మంచి చెబుతుంటే ఆపురా బాబు నీ సోది ... సావదొబ్బకు అంటు కసురుకుంటున్న ఈరోజుల్లో... ఈ యెదవ సోది ఏంటి అని కాలక్షేపానికి టి.వి చూస్తూ.. ఎప్పుడో క్రుతయుగం, త్రేతయుగం, ద్వాపరియుగం నాటి పురాణాలను చెప్పే చాగంటి వారి ప్రవచనల దగ్గర ఆగిపోయే వారు మనచుట్టు చాలమందే ఉన్నారు.. నిజమైన మంచితనం అంటే ఏమిటి? మనల్ని ముందుకు నడిపిస్తున్న ధర్మం గురుంచి చెబుతు.. ఒక కొడుకు ఎలా ఉండాలి? తల్లి, తండ్రి, భర్త, భార్య, తమ్ముడు, అన్న ఇలా ప్రతిఒక్కరిలో స్వచ్చమైన శక్తివంతమైన నిజాయితినీ పెంపొందిస్తున్నారు బ్రహశ్రీ శ్రీ. చాగంటి కోటేశ్వరరావు.. మన ప్రతి ఇంటిలో మంచి చెడులను వివరించే ఒక పెద్ధ కొడుకుగా తన ప్రసంగాలు, ప్రవచనలతో ఇప్పటి కలియుగంలో తనవంతు ధర్మ భాద్యతను అందిస్తున్నారు.. అసలు ఈ చాగంటి ఎవరు? ఈ మూడు, నాలుగు సంవత్సరాల నుండి టి.వి లో కనిపిస్తున్న ఈ చక్రవర్తి గురుంచి తెలుసుకుందాం... 1 copy అందరూ అనుకుంటున్నట్టు చాగంటి వృత్తి పౌరహిత్యం కాదు... ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి... ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా జాబ్(కాకినాడు). ఆయన భార్య సుబ్రమన్యేశ్వరి కూడా గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి... చాగంటి వారి నాన్న సుందర శివ రావు ఒక సాధారణ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసేవారు... ఆయనకు వచ్చే జీతంలో కొందరి పేద విధ్యార్ధులను చదివించేవారు... చాగంటికి ఒక సోదరుడు ఇద్దరు సొదరీమనులు.. చిన్నతనం నుండే వేదాలు, ఉపనిషత్తులు, సకల పురాణానాలలో మంచి ప్రావీణ్యంతో ఎదిగి ఒక మర్రి చెట్టులా మనందరికి అద్యాత్మిక నీడను అందిస్తున్నాడు.. 56 సంవత్సరాల చాగంటికి ఒక పాప బాబు.. గవర్నమెంట్ లో ఉద్యోగం, మంచి జీతం వస్తున్నా అందరిలా అతను తన కొరకు మాత్రమే ఆలోచించలేదు... ఒక రకంగా ప్రజలలో శాంతి, ధర్మం, ఒకరిమీద ఒకరికి ప్రేమ లాంటివన్ని సాధ్యపడాలంటే వారందరు అధ్యాత్మికంగా పరిణితి చెందాలని ఉద్యోగం చేస్తూ ఇప్పటికి ఒక నెలలో 10నుండి 15 రోజుల పాటు ప్రవచనాల ద్వార ప్రజలను బాగుచేస్తున్నారు...ఎవరైనా గౌరవంగా డబ్బులిచ్చిన ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఒక వేళ తీసుకున్న వాటి ద్వారా ఏవో ఒక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తారు.. వారి నుండి పూలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు అది కూడా భక్తుల దీవెనలకు గుర్తుగా.. 2 copy ఆయన సాధించిన ఘనతలో... సంస్కృతంలో డాక్టరేట్ ను అందుకున్నారు..42 రోజులలో సంపూర్ణ రామాయణం, భాగవతం అనర్గళంగా ప్రవచించారు. 30రోజులలో శివపురాణం, 45 రోజులపాటు లలితా సహస్రనామాలు అనర్గలంగా వినిపించారు.. హైందవ సంక్కృతిలోని రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం, బ్రహ్మపురాణం వంటి 120 పురాణాలు అనర్గలంగా వివరించగలరు... అతని అధ్యాత్మిక సేవకు గుర్తుగా ఎన్నో సంస్థలు గౌరవ పూర్వకంగా సరస్వతి పుత్ర, ప్రవచన చక్రవర్తి లాంటి బిరుదులెన్నో అందిచాయి.. ఒక్క హిందూ మతాన్ని మాత్రమే కాక సర్వ మతాల్లోని మంచి తనాన్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. భారతరత్న అబ్ధుల్ కలాం అంటే ఆయనకు అమితమైన గౌరవం ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను తన ప్రవచనంలో చాల చోట్ల ఉదాహరణగా తీసుకుంటారు... ఇలాంటి మతసామరస్యాన్ని, సనాతన ధర్మాన్ని వివరిస్తున్న చాగంటి ప్రభుత్వంతో పాటు మరిన్ని సేవలు అందించాలనే ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం చాగంటిని ప్రభుత్వ సలహాదారుగా కూడ నియమించింది..సిని దర్శకులు రాఘవేంద్ర రావు, విశ్వనథ్, శ్రీకాంత్ అడ్డాల లు రెగ్యులర్ గా చాగంటి ప్రవచనాలు వింటారు 7 copy ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుల మంచితనాన్ని మనతెలుగు వారికి భోదిస్తున్నారు..ఇప్పుడు దేశ విదేశాలలో ఒక సినిమా హీరోకు ఉన్నంతా అభిమానులు ఆయన మాటాలను ఆచరిస్తున్నారు.. కనుమరుగు అవుతున్న మన ఇతిహాసాల సారంశాన్ని తన వాక్కుతో మనకందిస్తున్నారు... ఎంతమంది నుండి మనం దేవతల గురుంచి తెలుసుకుంటున్నా కూడా చాగంటి ప్రవచనంలో వింటేనే అసలయిన దేవతల చరిత్ర మనకళ్ళముందు కనపడుతుంది..