Meet The 21-Year Old Young Talent Behind Agnyaathavaasi's CGI !

Updated on
Meet The 21-Year Old Young Talent Behind Agnyaathavaasi's CGI !

ఏప్రిల్ 2 2008 జల్సా సినిమా రిలీజ్ ఐన రోజు. అప్పుడు మనోడు 7వ తరగతి చదువుతున్నాడు, ఫ్రెండ్స్ తో థియేటర్లో గాల్లోకి పేపర్లను ఎగరేస్తూ బీభత్సంగా ఎంజాయ్ చేసాడు. ఆ నాడు ఏ కంబినేషన్లనైతే చూసి మైమరచిపోయాడో ఇప్పుడు అదే కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు “విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్” గా వారితో కలిసిపనిచేశాడు.. ప్రస్తుతం అతని వయసు 22, కానీ అజ్ఞాతవాసి గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండడానికి ఒక గొప్ప కారణం. హీరో మాత్రమే కాదు, తలుచుకుంటే అభిమానులు సైతం హీరో స్థాయికి ఎదగగలరు అని చెప్పుకోవడానికి మనకున్న లెటెస్ట్ ఉదాహరణ నిఖిల్.

నాన్న నేర్పరితనం: అప్పట్లో నిఖిల్ నాన్న గారు విజయవాడ ఆంద్రజ్యోతి లో రిపోర్టర్. “ఒక వక్తి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువు ఒక్కటే కాదు” అని బలంగా విశ్వసించే వ్యక్తి ఆయన. అందుకు తగ్గట్టే నిఖిల్ కు ఇష్టమైన వాటిలోనే శిక్షణ ఇప్పించారు.

చిచ్చరపిడుగు: క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, అవి కూడా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళతాయి అని గట్టిగ నమ్మే నిఖిల్ నాన్నగారి గురించి చెప్పుకున్నాం కదా! ఐతే మనోడు కేవలం ఒక్క రంగంలోనే టాలెంటెడ్ కాదు! సెకండ్ క్లాస్ నుండే డ్రాయింగ్ నేర్చుకుని ఫోర్త్ క్లాస్ వచ్చే సరికల్లా ముఖ్యమంత్రి గారి నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని 18 సంవత్సరాలు నిండినవారు రాసే “డ్రాయింగ్ టెక్నికల్ ఎక్సమినేషన్స్” 2004-2005 లో పూర్తి చేసి స్టేట్ రికార్డు కొట్టేశాడు. 2014 లో “డ్రాయింగ్ టెక్నికల్ టీచర్స్ కోర్స్” కూడా పూర్తి చేసాడు. 6వ తరగతిలోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ అందుకుని స్టేట్ నేషనల్ లెవెల్స్ లో గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్, ఒక బ్రోంజ్ మెడల్ గెలుచుకున్నాడు. కుదిరినప్పుడల్లా డాన్స్ పోటీల్లో ప్రథమ స్థానం కొట్టేసేవాడు.

11 సంవత్సరాలకే మల్టీమీడియా: రాబోయే రోజులన్నీ టెక్నాలజీని ఉపయోగించుకుని తీసే సినిమాలే, మల్టీమీడియా కోర్స్ చేస్తే భవిషత్తులో ఉజ్వల భవిషత్తు ఉంటుందని తెలియడంతో నిఖిల్ మల్టీమీడియా కోర్స్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాడు. అలా 7వ తరగతి లోనే గ్రాఫిక్స్ లో అద్భుతమైన ప్రతిభ చూపించాడు.

డైరెక్టర్ తేజ గారు షాక్: 2007 “కేక” సినిమా కోసం తేజ గారు ఆడిషన్స్ చేస్తున్నారు. అది తెలుసుకుని సినిమాలంటే ఆసక్తి ఉన్న మనోడు ఆడిషన్స్ కు అటెండ్ అయ్యాడు. అప్పటివరకు నిఖిల్ డ్రాయింగ్, డాన్స్, కరాటే, ముల్టీమీడియాల్లో తాను సాధించిన మెడల్స్ సర్టిఫికెట్స్ చూసిన తేజ గారు నిఖిల్ నాన్న గారితో “అతి తక్కువ వయసులో వీడు సాధించిన ఘనత నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ సాధించి ఉండరు, ఒక వేళ ఉన్నా వీడు మాత్రం ప్రత్యేకం” అని మెచ్చుకున్నారట. ఈ టాలెంట్ మరింత సానబడాలి అని చెప్పి “PIXELLOID” కి సజెస్ట్ చేశారు. తేజగారు సజెస్ట్ చేయడం వల్ల నిఖిల్ కు మొదట ఎంట్రస్ ఎగ్జామ్ పెట్టారట. అందులో మనోడు 98% మార్కులతో క్వాలిఫై అయ్యాడు. అప్పుడు నిఖిల్ వయసు 11. కాని కొన్ని ఆలోచనల వల్ల పిక్సిలయిడ్ లో జాయిన్ కాలేక తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

“నేను నా ఫ్రెండ్స్ లా టెన్త్ తర్వాత చదువుతూ ఆ లైఫ్ ని గడపాలనుకోడం లేదు.." అని చెప్పి Pixelloid లో “విజువల్ ఎఫెక్ట్స్” కోర్స్ నేర్చుకోవాలని చెప్పి విజయవాడ ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్ లో 530 మార్కులకు 497 మార్కులతో టెన్త్ కాల్స్ పూర్తి చేసి, మూడు సంవత్సరాల తరువాత 2011లో lo PIXELLOID కి వెనుతిరిగాడు.

"నాన్న మిగిలినవారు నా గురించి ఏమనుకుంటారో నాకు అనవసరం నేను మాత్రం టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీ.జి అంటూ చదువుతూ నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు, నేను pixelloid లో కోర్స్ ప్రారంభిస్తాను అని చెప్పి విజయవాడ ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్ లో 530 మార్కులకు 497 మార్కులతో టెన్త్ క్లాస్ పూర్తి చేసి మరల pixelloid కే వచ్చాడు.

మొదటి సినిమా శ్రీరామరాజ్యం: 14 నెలల కోర్స్ లో తనతో పాటు ఉన్న స్టూడెంట్స్ అందరూ డిగ్రీ, ఇంజినీరింగ్, పీ.జి చేసినవారే, వారందరిలో కన్నా మనోడే చిన్నవాడు. కోర్స్ పూర్తికాక ముందే నిఖిల్ అద్భుతమైన ప్రతిభ చూపించడంతో బాపు గారి శ్రీరామరాజ్యం సినిమా 3డి వర్క్ కోసం నిఖిల్ మొదటిసారి పనిచేశాడు. జులాయి, దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాలకు 18 సంవత్సరాలు నిండకుండానే పనిచేశాడు. ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఫిల్డ్, కొంతమంది వారికేవారు సాటిలేరు అని అనుకుంటుంటారు. ఈ సెగ నిఖిల్ కు కూడా తగిలింది “వీడు చాలా చిన్న పిల్లోడు వీడు చెబితే నేను వినేదేంటి” అనే మాటలు ఎన్నో విన్నాడు. ఈ ఫీల్డ్ లో ఎలా నడుచుకోవాలో, వచ్చే ఇబ్బందులనెలా ఎదురుకోవాలో వాళ్ళ అక్క ప్రవల్లిక అంజూరి నుండి ప్రతి విషయాన్ని నేర్చుకున్నాడు. వాటన్నిటికీ బాధ పడి కృంగిపోలేదు. అతని ఎదుగుదలతోనే వారందరికి బదులిచ్చాడు. 2013, 6టీవి సీఈఓ పర్వతనేని వెంకటకృష్ణ గారిచ్చిన అవకాశంతో విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గా ఎలక్ట్రానిక్ మీడియా లో 2 సంవత్సరాలు పనిచేసి, ఆ తర్వాత 2015 lo “హారిక & హాసిని క్రియేషన్స్” వంటి అగ్ర నిర్మాణ సంస్థలో అవకాశం సంపాదించుకున్నాడు.

అజ్ఞాతవాసి కోసం కొత్త టెక్నాలజీ: 100 కోట్లకు పైగా బడ్జెట్, తనకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, భారతదేశం గర్వించదగ్గ కెమెరామెన్ మణికంధన్ లాంటి టెక్నీషియన్స్.. వీరందరితో కేవలం 21 సంవత్సరాలకే పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. “టాలెంట్ ఉంటే ప్రాంతం, భాష, మతం ఆఖరికి వయసు కూడా అవసరం లేదు అని చెప్పుకోవడానికి ఇదోక గొప్ప ఉదాహరణ. ఇంతమంది మహానుభావులు మధ్య తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఎంతో శ్రమించాడు నిఖిల్. సాధారణంగా గ్రాఫిక్స్ కోసం గ్రీన్, బ్లూ మ్యాట్ ఉపయోగిస్తారు, కాని డిఓపి మణికంధన్ గారి ఆలోచన అంగీకారంతో ఈ సినిమాని వైట్ మ్యాట్ లో చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారి నుండి త్రివిక్రమ్, మణికంధన్ ల వరకు ఎంతోమంది ప్రశంసలు అందుకుని సినిమాని అనుకున్న తేదిలోకి, ఊహించినంత అందంగా రావడానికి ఎంతగానో కృషిచేశాడు.

కేవలం 21 సంవత్సరాలకే నిఖిల్ ఈ స్థాయికి ఎదిగాడంటే అది నిఖిల్ గొప్పతనం మాత్రమే కాదు ఎందరో మహానుభావులు, ప్రతి అవసరానికి అండగా నిలబడిన “వడ్డే శోభనాద్రీశ్వర రావు గారు (మాజీ ఎంపి, వ్యవసాయ శాఖ మంత్రి), చలసాని వెంకటేశ్వర రావు (పండు, టిడీపి లీడర్) గారు, అగ్ర నిర్మాతల జాబితాలోనున్న యస్. రాధాకృష్ణ (చినబాబు), యస్. నాగ వంశీ గార్ల సహకారంతోపాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్” ప్రోత్సాహంతోనే ఈ స్థానం సంపాదించుకున్నాడు. అంతే కాకా 10వ తరగతి వరకు ఉచిత విద్య అందించిన విశ్వశాంతి విద్యాసంస్థ అధినేత మాదాల సుబ్రమణేశ్వర రావు గారికి ఈ కీర్తి. ఓవరాల్ గా చెప్పాలంటే వీడి జర్నీ అయితే అద్భుతం, 22 ఏళ్ళ వయసులో నిఖిల్ సాధించిన ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే! మనచుట్టూ ఎంతోమంది ప్రతిభ గలవారున్నా, మనం ఎంతో కొంత సహాయం చేసినా, వారి విజయంలో, వారు అందుకునే ప్రతి సత్కారంలో, మనం భాగస్వాములమవుదాం అనే విషయం మరువరాదు. జైహింద్!