Even After 70 Years Here Is Why 'Pathaala Bhairavi' Is Never Before Ever After Classic

Updated on
Even After 70 Years Here Is Why 'Pathaala Bhairavi' Is Never Before Ever After Classic
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కాదు కదా, కనీసం ఆంధ్రరాష్ట్రం కూడా ఏర్పడక ముందు విడుదలైన చిత్రం గురించి... స్పెషల్ ఎఫెక్ట్స్ కాదు కదా కనీసం కంప్యూటర్ కూడా లేని రోజులలో నిర్మించిన చిత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పాతాళ భైరవి - ఓ మామూలు కుర్రాడు, రాకుమారిని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే సర్వసాధారణ ఊహ మీద కట్టిన మాహాద్భుత కళాఖండం. ఈ చిన్న ఊహకి ఉజ్జయిని అనే రాజ్యాన్ని backdrop-గా పెట్టి, రాకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే కుర్రాడిని కథానాయకుడిగా చేసుకొని, అతీంద్రియ శక్తుల కోసం పాతాళ భైరవిని వెతుకుతున్న మాంత్రికుడిని ప్రతినాయకుడిగా ఉపయోగించి, కథ ఎక్కడా ప్రేక్షకుడి ఊహకు అందకుండా నడిపిన విధానం పింగళి గారి ఆలోచనా స్థాయిని తెలియచెప్తుంది. కథ పరంగా చూసిన, కథనం పరంగా చూసిన, సాంకేతికంగా చూసిన ఈ చిత్రం ఇప్పటికీ ఓ అద్భుతమే. ఈ సాంకేతిక సృష్టి గురించి కొంత సమాచారం: 1. మధిర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన "కాశీ మజిలీ కథలు" ఆధారంగా పింగళి నాగేంద్రరావు, కమలాకర కామేశ్వరరావు కూర్చిన కథ. 2. ఆలూరి చక్రపాణి, బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి విజయ వాహిని స్టూడియోస్ నుండి వచ్చిన రెండవ చిత్రం. ఆ తర్వాత వాళ్ళు నిర్మించిన చిత్రాలతో విజయ వాహిని అంటే ఓ బ్లాక్ బస్టర్ బ్రాండ్ గా మారిపోయింది. 3. మాంత్రికుడి మాయలు, పాతాల భైరవి దగ్గరికి వెళ్ళే ముందు జరిగే సన్నివేశాలు, రాకుమారిని కోటతో సహా ఎత్తుకెళ్ళే సన్నివేశం అప్పట్లో ఎలా ఆలోచించారో, ఎలా తీసారో అనేది ఆలోచిస్తేనే దర్శకుడి గొప్పతనం తెలిసిపోతుంది. కదిరి వెంకట రెడ్డి గారు ఆ కాలంలో అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలా సృష్టించారో ఆయనకే తెలియాలి. 4. మార్కస్ బార్ట్లే గురించి ఎంత చెప్పినా తక్కువే. రాత్రి పూట తీసిన సన్నివేశాలు, పెద్ద పెద్ద సెట్స్ ని చూపించిన విధానం... అబ్బో! మీరు కేకండి బార్ట్లే గారు. 5. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు, నేపధ్య సంగీతం రెండూ సినిమాకు తగ్గట్టుగా అద్భుతంగా కుదిరాయి. ప్రేమకోసమై వలలో పడెనే, కలవరమాయే మదిలో, ఎంత ఘాటు ప్రేమయో పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 6. "సాహసం సేయరా డింభకా", "నరుడా... ఏమి నీ కోరిక ?", "నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా!", "తప్పు, తప్పు..." ఇలా కొన్ని మాటలు తెలుగు వాడుకలో కలిసిపోయాయి. అవన్నీ ఈ సినిమా కోసం పింగళి గారి కలం నుండి జాలువారి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంభాశనాస్త్రాలు. మాటలు, పాటలు, కథ మూడు పింగళి నాగేంద్రరావు గారే. పింగళి గారు మీరు తోపులకే తోపండి బాబు. 7. CNN - IBN వారి చిరకాలం నిలిచిపోయే అత్యుత్తమ 100 చిత్రాల జాబితాలో ఒకటి. భారత అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శింపబడిన మొట్ట మొదటి తెలుగు సినిమా. సినిమా చూడాలనుకునే వారి కోసం కొన్ని… ప్రేమలో ఉన్న ప్రతీ యువకుడి సమాధానం 1 (1) దేవుడా... బాబ్జే ఇప్పుడెలా వాడుతున్నామో అప్పట్లో ఈ డైలాగ్ వాడేవాళ్ళు 2 (1) ఇప్పటికీ కొంతమందికి కష్టమే... మరి మహారాణి దక్కాలంటే కనీసం ఈ సమాధానం కూడా తెలీకపోతే తప్పే కదా. 4 (1) ప్రేమించిన వ్యక్తి పై అమ్మాయి, అబ్బాయి ఊహలు 3 (1) జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికోసం సింపుల్ మంత్రం. 5 (1) సినిమా పేరు పడిన వెంటనే... నటీనటుల పేర్లు కాకుండా, ఒక సినిమాకు మూలం ఐన కథా రచయిత పేరు వేయడం చక్రపాణి, నాగిరెడ్డి, వెంకట రెడ్డి గారి సంస్కారానికి నిదర్శనం. ఆద్యంతం మలుపులు, ఆశ్చర్యాలతో నిండిపోయిన పాతాళ భైరవి చిత్రాన్ని ఇప్పటివరకు చూడనివాళ్ళు వెంటనే చూసెయ్యండి, చూసినవాళ్ళు రిపీట్ ఏసేయ్యండి