T.T.D వారి కులరహిత గోవిందానికి శతకోటి శుభాకాంక్షలు!

Updated on
T.T.D వారి కులరహిత గోవిందానికి శతకోటి శుభాకాంక్షలు!
“కులాన్ని నేను నమ్ముతానా? కులం ఒక సంఘ పరిణామం. మతానికి, దేవుడికి వాటిని అంటగట్టకండి. అయినా భారత దేశంలో కుల ప్రాధాన్యం కేవలం తండ్రి చేసే పనిలో కొడుకు కొనసాగడం వల్లనే పెరిగింది.”- స్వామి వివేకానంద (“Do I believe in caste? Caste is a social custom; Religion and God have nothing to do with it. This caste system had grown by the practice of the son always following the business of the father" - Swami Vivekananda.) swamivivekananda వీడేంటి రా కులాలు మతాలు అని చావగొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ point ఉంది మాస్టారు! మన తిరుమల తిరుపతి దేవస్థానం (T.T.D)వారు లేరు?వారు ఒక గొప్ప కులరహిత కార్యానికి నడుం బిగించారండి. కులాలకు అతీతంగా గుళ్ళలో పూజలు చేయడానికి గాను ఒక certificate కోర్సు అందుబాటులోకి తెచ్చారండి. అంటే గుడిలో పౌరహిత్యం (sacred prayers as an occupation) చేయడానికి ఇక కులం అనే అడ్డుగోడ లేదన్న మాట. ఇది ఒక historic decision అని చెప్పుకోవాలి. thehindu Pic courtesy: The Hindu చాలా ఏళ్ళ క్రితం, కుల పిచ్చి peaks లో ఉన్నప్పుడు, నిమ్న వర్గాల (lower castes) వారిని దేవాలయాల్లో కి కూడా రానిచ్చేవారు కాదంటండి. ఇప్పటికి మన దేశంలో కొన్ని గుళ్లలోకి కులం పేరుతో ఈ వివక్ష కొనసాగుతూనే ఉందండి. ఒకపక్క మనది కంప్యూటర్ యుగం అని చంకలు గుద్దుకున్నా, ఇప్పటికి ఇలా కులాల కుంపట్లు, అంటరానితనాలతో దేశం ఏదో ఒక మూల మగ్గిపోతుంటే సమ సమాజ నిర్మాణానికి తెచ్చుకున్న స్వాతంత్ర్యం ప్రపంచం దృష్టిలో ఒక వెటకారంగా కనబడుతుంది. పద కవితా పితామహులు, శ్రీ వేంకటేశ్వరుని అత్యంత గొప్ప భక్తులు అయిన శ్రీ అన్నమాచార్యుల వారు ( అదేనండి Akkineni Nagarjuna గారు, K.Raghavendra Rao గార్ల combinationలో వచ్చింది కదా సినిమా? మీకన్ని cinema బాషలో చెప్పాలండి, తప్పట్లేదు) ఆయన ‘బ్రమ్హ మొక్కటే పరబ్రహ్మమ్మొక్కటే’ అనే సంకీర్తనలో ఇలా గొప్పగా కులం అనే concept ని కడిగేశారు. “కందువగు హీనాదికములు ఇందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ” ( There are no differences of high & low.’ Lord venkateshwara is the indwelling spirit of the good to one and all; All the beings in creation are one because the indwelling spirit in every creature is one & the same.) dwaraka-tirumala-temple తమిళనాడు లో మొదలైన ఈ certificate కోర్సు మహత్కార్యం మన తిరుమల వెంకటేశ్వరుడి దగ్గర కూడా మొదలవ్వడం మనకెంతో గర్వకారణం. తిరుమల ని ఆదర్శంగా తీసుకుని దేశంలో ఉన్న దేవస్తానాలన్ని జాతి వివక్ష ను తరిమి కొట్టి 'దేవుడు' అనే conceptని అందరికి చేరుస్తారనే నమ్మకం తో ఈ దేశం, నేటి youth ఎదురు చూస్తోంది. అన్నం పెట్టె రైతు చిన్న కులం వాడైనా ఆ అన్నంతోనే గుళ్ళలో ప్రసాదాలు తయారు అవుతున్నాయి. అలాంటప్పుడు ఈ వివక్షలకు goodbye చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది దేవుడు మనిషికి శక్తిని ఇస్తాడు.ఎప్పటికైనా మార్పు అనేది మనిషి మాత్రమే తీసుకురాగలుగుతాడు. కులం కంటే గుణం గొప్పధి. వర్ణం కంటే జ్ఞానం గొప్పది అంటారు, అదే అసలు సిసలు నిజం. sv_10-large-brt-56 T.T.D వారికి మన మనసుల్లో శతకోటి శుభాకాంక్షలు . వారి దళిత గోవిందం లోక కళ్యాణకారకం!