20 Rib-Tickling Cartoons By Rakesh That Will Surely Make Your Day!

Updated on
20  Rib-Tickling Cartoons By Rakesh That Will Surely Make Your Day!

2003లో ఈనాడు ఒక కార్టూన్ కాంపిటీషన్ పెట్టింది. 16 సంవత్సరాలకు పైబడిన వారు ఇందులో పాల్గొనవచ్చు అనే నిబంధనతో. మెదక్ లో ఉంటున్న రాకేశ్ దీనిని చూసి కొన్ని బొమ్మలు గీసి ప్రయత్నించాడు. రాకేశ్ కు "నేను ఎంపిక అవుతానని అంతగా నమ్మకం లేదు". ఎందుకంటే ఇప్పుడంటే ఆర్టిస్ట్ కు గౌరవం ఉంది, టాలెంట్ ను గుర్తించగలుగుతున్నారు అప్పటి పరిస్థితులలో చదువు మాత్రమే గొప్ప భవిషత్తును ఇవ్వగలదని నమ్మే రోజులు కదా. కాని మారుతున్న కాలానికి సూచికగా అమ్మ నాన్నలు, బంధువులు, ఇరుగుపొరుగు వారి నమ్మకాలను కదిలించడానికి "ఉత్తమ కార్టూనిస్ట్" విజయం రాకేశ్ జీవితంలోకి వచ్చింది.

రాకేశ్ 17 సంవత్సరాల నుండే ఫ్రీ లాన్సర్ గా ఈనాడుకు బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. ఒక రకంగా ఈనాడు రాకేశ్ కు విశ్వవిద్యాలయంలా ఉపయోగపడింది. రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు వాటిలోపాలు, ప్రతిపక్షాల వారు వేసే తప్పటడుగులు వంటి వాటి మీద ఎలాంటి దృష్టికోణంలో పరిశీలించగలగాలి మొదలైన విషయాలు నిశితంగా నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోనే ఈనాడులో ఫుల్ టైమ్ ఉద్యోగిగా చేరారు. తన ప్రతిభను మరింత మెరుగుపరచడం కోసం ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు హైదరాబాద్ JNTUలో BFA కోర్స్, సాయంత్రం 5 నుండి రాత్రి 11:30 వరకు ఈనాడులో ఉద్యోగం ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డిగ్రీ, విలువైన అనుభవాన్ని సంపాదించారు. రాకేశ్ గారు ఇప్పుడున్న కార్టూనిస్ట్ లందరికన్నా చిన్నవారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్నారు. 15 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో దాదాపు ప్రతిరోజూ భౌతికంగా, మానసికంగా కార్టూన్ తో గడిపేవారు. గ్రాస్పింగ్ పవర్, ఎక్కువ శాతం లక్ష్యంతో గడిపితే మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు అని నమ్మే రాకేశ్ గారి ఆలోచనాత్మక కార్టూన్స్ కొన్ని...

1. లెక్కలోకి రావు ఇక.

2. అమ్మనాన్నల అతి జాగ్రత్తలో పిల్లల రెక్కలు చిక్కుకుపోయాయి.

3. పరిగెత్తక తప్పదు.

4. బంధాన్ని.. చిత్రంలో చక్కగా బంధించారు

5. ఎంత పొదుపు చేస్తే అంత లాభం. వారికి!

6. అవునవును.

7. బాణాలన్నీ వంగిపోతున్నాయ్.

8. బిల్ కట్టేటప్పుడు నేను కూడా ఇదే చెప్తా.

9. ఆ బాబు రాసుకో.. నాకు వంటల ప్రోగ్రాం కోసం ఒకటి, కాల్స్ మాట్లాడుకోవడం కోసం ఒకటి, మొత్తం రెండు ఫోన్లు. మా అబ్బాయి గేమ్స్ ఆడుకోవడం కోసం ఒకటి, ఆఫీసు పనులకు ఒకటి, పర్సనల్ కోసం మరొకటి.

10. పెళ్లి అనే బంధం మొదలయినప్పటి నుండి మీ చేతుల్లో ఉండేది అదే కదా అమ్మ.

11. గ్రహాంతరవాసులు.

12. డామిట్!!

13. అంతలా తల్లి ప్రేమ పెరిగిందనమాట.

14. నేను క్యూలో నిలబడ్డప్పుడు కనీసం పోలీస్ కానిస్టేబుల్ కూడా నిలబడలేదు.

15. అన్ని మాటలే!!

16. పారిపోండి.. అది మనవైపే దూసుకువస్తుంది.

17. పతంజలి ఇదొక కమర్షియల్ బ్రాన్డ్(ప్రస్తుతం).

18. వరదల్లో కేరళ ఈదుతుంది.

19. పో పోవయ్య!!

20. ముక్కుసూటిగా...