Contributed By Raviteja Ayyagari
వర్ష కాలం మొదటి చినుకు కురిసిన వేళ... భాగ్యనగరం ఆ అమృతవర్షిణి జడిలో తడిసి మైమరచిన వేళ... ప్రతి ప్రేమ కథ మొదలయ్యే లాగా కాఫీ షాప్ కాదు. వర్షం వల్ల స్థంభించిపోయిన హైదరాబాద్ ట్రాఫిక్ లో ఒక బస్సులో. నిపుణ్: ఆ అమ్మ! వెనక్కి వెళ్తున్న. ఇక్కడ కుంభవృష్టిలా కురుస్తోంది వర్షం. ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇవాళ బస్సు లో వెళ్ళాను. పర్లేదులే. మనకి ఇప్పుడు పెద్దగా దేశానికీ ఏమి చెయ్యాలో అన్న పంచ వర్ష ప్రణాళికలు ఏమి వెయ్యక్కర్లేదు. అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోన్ పెట్టాకా తన బాగ్ లో నుంచి పుస్తకం తీసి ఎదో రాస్తున్నాడు నిపుణ్. బస్సు ఇంకొంచం ముందుకి కదిలింది. తన పక్కన కూర్చున్న మనిషి దిగి, ఒక అమ్మాయి అక్కడ కూర్చుంది. నిపుణ్ ని చూసి, ఈ కాలం లో కూడా ఇలా పుస్తకము, కలము పట్టుకుని ఇలా రాస్కుంటారా అనే ఒక అయోమయమైన మొహం పెట్టింది మీనాక్షి.
మొదట్లో హడావిడి చేస్తున్నాడేమో అనుకుని పట్టించుకోలేదు. కానీ అతను రాస్తున్న ఆ కవిత్వం "కానవచ్చే మానే ఎరుగును ఊతనిచ్చే వేరు అతిశయాన్ని కాంతినిచ్చే సూరీడే ఎరుగును తనకై తపించే మానవ ఆశలని బీరమిచ్చే పితరులు ఎరుగును భావించే నీ మనసులోని సల్లాపాన్ని పయనించే నీకైనా ఎరుకనా ఎద మరిచే నీ గమనానికి గమ్యాన్ని?" ఆ కవిత్వం చూసి, నోరు వెళ్ళపెట్టింది. నిపుణ్ తనని గమనించాడు.
మీనాక్షి: మీరు చాలా బాగా రాస్తున్నారు! నిపుణ్: అయ్యో! అలాంటిది ఏమి లేదండి. ఖాళీ గా ఉండడం ఎందుకు అని ఎదో పిచ్చి రాతలు రాస్తున్న. మీనాక్షి: పిచ్చి రాతలు అని ఎందుకు అనుకుంటున్నారు? ప్రేరణనిచ్చే రాతలు అని అనుకోవచ్చు గా. నిపుణ్: అంటే, నా ఆలోచనలు ఎవరికీ పెద్దగా అబ్బవు. ఎవరు ఇష్టం కూడా చూపించరు. అందుకే నాలోని భావాలను ఇలా నా పుస్తకంలో రాసుకుంటూ, నాకు నేనే కాంఫిడెన్స్ ఇచ్చుకుంటున్న. మీనాక్షి: సూపర్ అండీ! నిజంగా చాలా బాగుంది. btw, నా పేరు మీనాక్షి. నిపుణ్: నిపుణ్! మీనాక్షి: మీరు ఎం చేస్తూ ఉంటారు? నిపుణ్: software. మీరు? మీనాక్షి: నేను కూడా అదే. కానీ నాకు ఫ్యాషన్ డిజైన్ అంటే ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా ఏవో డిజైన్ డ్రెస్సులు కుడుతూ ఉంటాను. నిపుణ్: నైస్ నైస్! ఇంకేంటి? మీనాక్షి: చెప్పాలి. మీకు కవిత్వం రాయడానికి inspiration ఎవరు? నిపుణ్: సాటి మనుషులు. మీనాక్షి: అవునా! వింతగా ఉంది. నిపుణ్: ఇందులో వింత ఏమి లేదండి. ప్రతి మనిషిలో నాకు ఒక భావము కనిపిస్తుంది. ఆ భావం ఆధారంగా కవిత్వం రాసేస్తా. మీనాక్షి: మరి నాలో ఎం కనిపిస్తోంది? నిపుణ్: తెలియని బాధ! ఎవరితో అయినా పంచుకుంటే బాగుండును అని ఎదురుచూస్తోంది మీ మనసు. మీనాక్షి ఆ మాట విని అవాక్కయ్యింది. మీనాక్షి: అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? నిపుణ్: చిన్న లాజిక్ వాడాను. ఇంత రద్దీ గా ఉన్న బస్సు లో ఒక అమ్మాయి, అందులో smartphone కాలంలో, అసలు ఫోన్ వైపు చూడకుండా, వచ్చిన కాల్స్ అన్ని కట్ చేస్తూ, కష్టపడి రాలడానికి ప్రయతిస్తున్న కన్నీటి చుక్కతో దాగుడుమూతలు ఆడుతూ ఉన్నారంటే ఎదో బాధలో ఉన్నట్టే అని అనుకున్న. అది నిజమని మీరే చెప్పారు. మీ బాధ ని తొలగించే శక్తీ నాకు లేదు. కానీ, మీకు ఉత్తేజాన్ని ఇచ్చే ఒక కవిత నా దగ్గర ఉంది.
“ఆశను ఆశయంగా మార్చుకో బాసకు బలాన్ని చేర్చుకో నిరాశను నిబ్బరంగా ఓర్చుకో శ్వాసకు సహవాసం ఇచ్చుకో తీరం ఏదైనా దూసుకుపో దూరం ఎంతైనా తరిగించుకో భారం ఏదైనా కరిగించుకో సారం ఇదియే తెలుసుకో”
మీనాక్షి కి ఆ మాటలు హాయిగా అనిపించాయి. అదే సమయంలో తన మనసులో నిపుణ్ మీద ఇష్టం కలిగింది. మీనాక్షి: ఒక్క conversation లో నా మీద ఇంత impact ఎవరు create చెయ్యలేదండి. మీరేమనుకోనంటే నాకు అప్పుడప్పుడు ఇలాంటి moral boosters కావాలి. మీ నెంబర్ ఇస్తారా? నిపుణ్: నా కవిత్వాన్ని ఇంతలా ఆదరించింది మా అమ్మ, నాన్నల తర్వాత మీరే. తప్పకుండ. కానీ నాకు whatsapp లేదు. మీరు నాకు కాల్ చెయ్యాలి. అందులో నేను ఫోన్ పెద్దగా వాడను. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి అమ్మ, నాన్నగార్లతో మాట్లాడడానికి వాడతా. అంతే. అలా అని కాల్ చేస్తే ఎత్తకుండా ఉండను. కాకపోతే, నేను ఫోన్లో కంటే డైరెక్ట్ గా మాట్లాడడానికి ఇష్టపడతాను. అలా నంబర్స్ పంచుకున్నారు. కొన్ని నెలల తర్వాత... నిపుణ్: "కన్నుల కథ వింత కాదా! దూరం ఎంతైనా భావం ఒక్కటే పలుకును కదా! ఎన్ని లీలలు నీ చెంత నాధా! తీరం ఏదైనా దారిని మళ్ళించుదువు కదా!" హమ్మయ్య! ఇప్పటికి నా పుస్తకం పూర్తయ్యింది. దీనికి సగం credit నీకే. నా కలంలో ఎప్పటికి అరిగిపోని సిరా లా నువ్వు నాకు దొరికావు. నేనెంత అదృష్టవంతుడిని. మీనాక్షి: ఆ అదృష్టం నాది. నా జీవితానికి ఒక కొత్త అర్థం పలికిన మీరు నాకు life partner గా రావడం అంటే అదృష్టమే గా. ఇలాంటి కావ్యాలు మీరు మరెన్నో రాస్తూ ఉండాలి. మన బంధం ఎప్పటికి ఆ కలం సిరాలా లాగ మిగిలిపోవాలి.