అర్చన సురేష్ గారు ఉద్యోగం చేసింది మామూలు కంపెనీలలో కాదు మెక్రోసాఫ్ట్, హెచ్.ఎస్.బి.సి, యాహు, ఐటి హబ్ లలో చేస్తు లక్షల్లో జీతం అందుకున్నారు, ఐన గాని వాటిలో అంతగా ఆనందం పొందలేదు. కొన్ని సంవత్సరాల క్రితం అర్చన అమ్మగారు క్యాన్సర్ వ్యాదితో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అక్కడి ఆవరణలో ఉన్న నిరుపేద రోగులను చూసి చలించిపోయారు, అప్పటికప్పుడు ఏం చేయాలో తోచక తన ఇంటికి వెళ్ళి దుప్పట్లు, వేసుకునే బట్టలు, ఆహార పదర్ధాలు తీసుకువచ్చి అక్కడున్న భగవంతుడు ఇచ్చిన బంధువలకు ఆత్మీయంగా అందించారు. అప్పుడు తెలిసింది ఇందులో ఇంత ఆనందం ఉంటుందా అని.. ఇక అప్పటినుండి తన సేవా ప్రస్థానం మొదలయ్యింది.
అర్చన పుట్టింది కూడా ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలోనే. స్వశక్తితో జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. సంపాదించిన తర్వాత తమ కోసం ఖర్చుపెట్టడంలోనే సంతృప్తి ఉంటుందనుకుంటారు కొంతమంది కాని వాటిని సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఊహకందనంత ఆనందం ఉంటుందని గుర్తించిన అర్చన "బ్రింగ్ ఏ స్మైల్" ను స్థాపించి ఆనందాలను పంచుతున్నారు. తన డబ్బును మాత్రమే కాదు ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పి హైదరాబాద్ లోని అపార్ట్మెంట్స్ కు వెళ్ళి అక్కడి కుటుంబాలకు సమస్యలను వివరించి బొమ్మలు, బియ్యం, ఇతర వంట సామానులు, బట్టలు వారికి తోచిన సహాయాన్ని తీసుకుని పేదలకు అందిస్తున్నారు.
ఒక వ్యవస్థ గా: "బ్రింగ్ ఏ స్మైల్" అంటే ఒక సమిష్టి వ్యవస్థగా రుపొందించి సమజానికి అంకితమిచ్చారు. సోషల్ మీడియాను, వాట్సప్ ను ఉపయోగించుకుంటు దాదాపు 100మందికి పైగా ఈ వ్యవస్థలో వాలంటీర్లు భాగం అయ్యారు. హైదరాబాద్ లోని ఖరీదైన రెస్టారెంట్స్, హోటల్స్ కు ప్రతిరోజు వెళ్ళి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని, పండ్లను సేకరించి ప్రతిరోజ కొన్ని వందలమందికి అందిస్తుంటారు. అంతేకాదు అర్చన గారు ప్రత్యేకంగా ఇద్దరు నిరుపేద అమ్మాయిలను దత్తత తీసుకుని వారి పూర్తి భాద్యతను చూసుకుంటున్నారు. "నువ్వు ఏది ఇస్తే అదే నీకు ప్రపంచం తిరిగి ఇస్తుందనంటారు అలా తన ఆనందాన్ని ఇతరులకు పంచుతూ మరింత ఆనందాన్ని తిరుగిపొందుతున్నారు".