మామూలు సబ్జెక్ట్ మీద పి.హెచ్.డి చేయడం సాధారణమే.. సమాజానికి ఉపయోగపడే అంశం మీద పి.హెచ్.డి చేస్తే మాత్రం అది అసాధారణమే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బుల్లోడు మేడిది జాన్ విలియమ్ కేరి "ఇన్వెస్టిగేషన్ ఆన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆక్యులారిటి ఇన్ ఎలక్ట్రోయన్సి ఫెలోగ్రామ్" అనే సబ్జెక్ట్ మీద పీ.హెచ్.డి పూర్తి చేశారు. ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నాడు. తను రూపొందించిన పరికరంతో ప్రపంచ వైద్య విధానంలో తన పేరును పదిలపరుచుకున్నారు..
ఎన్ని రకాల కొత్త రోగాలు వస్తున్నాయో అంతే స్థాయిలో కొత్త పరికరాలు కూడా వచ్చేస్తున్నాయి, కాకపోతే ఇందులో వేగం పెరిగిపోయింది. పెరాలసిస్, కోమా, బ్రేయిన్ ట్యూమర్, కొన్ని రకాల తలనొప్పులకు సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి ఎంఆర్.ఐ స్కానింగ్ చేస్తారు. కాని దీని వల్ల 100% రిజల్ట్స్ వస్తాయా అంటే లేదు. స్కానింగ్ లో బ్రేయిన్ లోని నాడులలో చలనాలను గమనించవచ్చు ఐతే వీటిని చాలామంది డాక్టర్లు సరిగ్గా అర్ధం చేసుకోకపోవడంతో ట్రీట్మెంట్ విషయంలో చాలా లోపాలు వచ్చి పేషెంట్ మరింత ఆనారోగ్యం పాలయ్యే అవకాశం ఉండేది. ఐతే మెదడు నాడుల కదలికలను గుర్తించేందుకు "ఆటోమేటిక్ ఐబ్లింక్ డిటెక్టర్ యూజింగ్ మైరియో" అనే పరికరాన్ని జాన్ విలియమ్ తయారుచేశాడు.
ఈ పరికరం కేవలం 3,000లో తయారుచేశారు. ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్ కు జతచేసి బ్రేయిన్ టెస్ట్ చేస్తే మాత్రం పక్కా రిజల్ట్స్ వచ్చేస్తుంది. దీనివల్ల డాక్టర్లకు ఖచ్చితమైన సమాచారం తెలిసి అందుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి. దీనిని తయారుచేయడానికి తక్కువ ఖర్చు అవ్వడంతో భవిషత్తులు వైద్య ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.