This Story Of Guy Who Gives A Surprise Gift On His Mom's Birthday Is Relatable

Updated on
This Story Of Guy Who Gives A Surprise Gift On His Mom's Birthday Is Relatable

Contributed Kartheek Voggu

శనివారం పొద్దున్న 9 అవుతుంది! బాల్కనీ నుండి వర్షం పడ్తున్న శబ్దం! అలారం గట్టిగా మోగుతూనే ఉంది! ఆర్య, లేచి అలారం ఆఫ్ చేసి, మొబైల్ లో డేట్ చూసి, తనని తానే తిట్టుకుంటూ నెంబర్ డయల్ చేశాడు! ( మొబైల్ రింగ్ అవుతూ ఉంది.. కొన్ని రింగ్స్ తర్వాత ఆన్సర్ అయింది )

" హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే అమ్మ! " " ఈ రోజు నా బర్త్ డే అని నాకే గుర్తులేదు! నువ్వు బాగా గుర్తు పెట్టుకున్నావు రా! " " నీకు మా విషయాలు తప్ప నీవి నీకు ఎందుకు గుర్తు ఉంటాయి ? అదే నేను నా బర్త్ డే కి ఇంట్లో ఉంటే ఈ పాటికి గుడికి కూడా తీస్కెళ్ళిపోయి ఉంటావు! " “ మాటలు బాగా నేర్చుకున్నావు రా! నీతో మాట్లాడి నేను గెలవలేను! " ( ఇద్దరు నవ్వులు ..! ) " సరే అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తా! " " సరే రా! త్వరగా ఫ్రెష్ అయి ఎదో ఒకటి తిను! " " ఓకే అమ్మ! బాయ్! " ( కాల్ ఎండ్ అయింది )

ఫోన్లో ఎదో చెక్ చేస్తున్నాడు ఆర్య! అయిపోయిన తర్వాత, ఫ్రెష్ అయ్యి, కాఫీ సిప్ చేస్తూ బాల్కనీ లో నిల్చుని, తనకి నచ్చిన ఇళయరాజా సాంగ్స్ వింటూ అమ్మతో దిగిన ఫొటోస్ చూస్తూ ఉన్నాడు! ............

( కాలింగ్ బెల్ మోగుతూ ఉంది! ) ఒక 55 వయసు గల ఆయన, డోర్ ఓపెన్ చేసి పార్సెల్ తీసుకున్నారు! " ఏమిటి అండి అది? " ( కాఫీ తాగుతూ ఇళయరాజా సాంగ్స్ వింటూ ) " ఏమో ఇందు నాకు కూడా తెలీదు ఎవరు పంపారో! " “ ఓపెన్ చేయండి! " ( పార్సెల్ ఓపెన్ చేయగానే.. ఇందిరా ముఖంలో పెద్ద చిరునవ్వు..! ) " నాకు చాలా ఇష్టం అయినా కలర్ అండి, మొన్న ఆ మధ్య ఎంత వెతికిన మంచిది దొరకలేదు. ఎంత బాగా గుర్తు పెట్టుకుని కొని పంపాడో! ఈ అమ్మ అంటే వాడికి ఎప్పుడు ప్రేమే! " ( మాటల్లో చిన్న గర్వం! ) “ చాల్లే బడాయి! నీ కొడుకేలే, ఆ చీరా పక్కన పెట్టి దాన్లో ఇంకా ఏమో ఉన్నాయి చూడు! " " ఆ చూస్తున్నా! " ( ఆ బాక్స్ లో ఇంకా ఎం ఉన్నాయో చూసింది )

" ఇళయరాజా మ్యూజిక్ ఆల్బమ్స్! మొన్న ఆ మధ్య మాటల్లో అన్న, ఈ నెట్ నుండి సాంగ్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంది రా, ఎదురింటి వాళ్ళనో, పై ఇంటీ వాళ్ళనో అడగాల్సి వస్తుంది అని. వెధవ! ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాడో ఇది కూడా! " “ అవును ఇందు! వాడికి మనం అంటే చాలా ప్రేమ! ఇప్పుడు ఉన్నా పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది రేపు మనల్ని ఎలా చూస్తారా అని, కానీ మన ఆర్య ని చూస్తే , గుండెల మీద చెయ్యి వెస్కొని, రేపటి గురించి ఆలోచించకుండా ప్రశాంతగా ఉండచ్చు! " ( పార్సెల్ లో ఇంకా ఎం ఉన్నాయో ఇద్దరు చూస్తున్నారు! ) " ఫోటో ఆల్బం! " ( ఫొటోస్ చూస్తూ )

" ఇవి వాడు నేను తీసుకున్న ఫొటోస్! అరె, ఇది నా క్లోస్ ఫ్రెండ్ వైష్ణవి! ఎప్పుడో మిస్ అయిపొయింది. వీడికి ఎలా దొరికింది అసలు! ఇది మా క్లోస్ ఫ్రెండ్స్ అంతా కాలేజ్ అయిపోయాక తీసుకున్న ఫోటో! ఇది మిస్ అయ్యా అని చాలాసార్లు ఫీల్ అయ్యా అండి! " ( ఇందిరా కళ్ళలో చిన్నగా నీళ్లు ) " సర్లే ఇందు! రిలాక్స్! అందులో ఇంకా ఎదో ఉన్నట్టు ఉంది, చూడు! " " లెటర్! ఎం రాశాడో చూద్దాం ( నవ్వుతు )

హాయ్ అమ్మ! హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే! నాకు తెల్సు ప్రతీ ఇయర్ లాగానే ఈసారి కూడా నీ బర్త్ డే మర్చిపోయి ఉంటావు అని, అందుకే నీకు బాగా ఇష్టం అయినా కలర్ శారీ నేనే కొని పంపుతున్న! ఇది కొనడానికి షోరూం వెళ్తే, అందరు నన్ను ఎలా చూసారో తెల్సా! అయినా సరే నేను ఎం ఫీల్ అవలేదు లే! నీ ఫ్రెండ్స్ ఫొటోస్ కలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెల్సా! నీ ఫ్రెండ్స్ అందరి నంబర్స్ కనుకొని, కాల్స్ చేసి, కొందర్ని కలిసి, ఫొటోస్ కోసం రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ కి ఇదిగో ఇలా అయింది!

యు అర్ ది బెస్ట్ థింగ్ హాప్పీన్డ్ టూ మీ అమ్మ! అందరి ఇళ్లలో ఎలా ఉంటారో నాకు తెలీదు నువ్వు మాత్రం నాకు ఏది కావాలో అది చూస్ చేస్కునే ఫ్రీడమ్ ఇచ్చావ్. నువ్వు ఇది కావాలి అది కావాలి, నీకు ఇన్ని మార్కులు రావాలి, అన్ని రావాలి అని ఎప్పుడు నా మీద ప్రెషర్ పెట్టలేదు, పడనివ్వలేదు! నాకు ఆనందం అంటే ఏంటో, ఎదగడం అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో నేర్పించావు. నేను సాధించాల్సిన ఆస్తి ' నలుగురిలో గౌరవం, నలుగురి నమ్మకం ' అని నేర్పించావు. ఈన్ని ఇచ్చిన నీకు ఏం ఇచ్చినా, ఎంత చేసినా తక్కువే ! ఎప్పటికి నేను ఇవ్వగలిగింది ఏమి జరిగినా నీకు నేను ఉన్నానన్న ధైర్యం, నీ కోసం ఏదైనా చెయ్యగల ప్రేమ!! ఐ లవ్ యు అమ్మ! నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి! ఇట్లు నీ ఆర్య! ( లెటర్ మీద అమ్మ చెంప మీద నుండి జారిన కన్నీళ్లు )!