కాలేజ్ అని రేసింగ్ లకు: "రోడ్డు మీద తప్పతాగి బైక్ రేసింగ్ లో పాల్గొన్న యువకులు పట్టుబడ్డారు" అనే వార్తా కథనాలు చూడడం వల్ల "బైక్ రేసింగ్" అంటే సందీప్ (సత్యనారాయణ రాజు) అమ్మ నాన్నలకు మంచి అభిప్రాయం లేదు. కొంతమంది వ్యక్తుల వల్ల ఈ గేమ్ చులకనైన మాట నిజమే కాని ఇది ఒక ప్రొఫెషనల్ గేమ్. RTO నుండి వచ్చిన మామూలు లైసెన్స్ ద్వారా ఈ గేమ్ ను ఆడటానికి కుదరదు, "Federation of motor sports" అనే సంస్థ పెట్టే పరీక్షలలో క్వాలిఫై అయ్యాకనే బైక్ రేసర్ లైసెన్స్ వస్తుంది అప్పుడే అర్హుడు. అమ్మ నాన్నలు అర్ధం చేసుకోవడం లేదు అని సందీప్ రేసింగ్ లను ఆపేయ్యలేదు. కాలేజ్ కు వెళ్తున్నాను అని వెళ్లి మనోడు బైక్ రేసింగ్ లో పాల్గొనేవాడు.
టీవీ, యూట్యూబ్ లే సందీప్ గురువులు: అమలాపురం నుండి హైదరాబాద్ లో స్థిరపడ్డ సందీప్ కుటుంబం ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. లక్ష్యం చిన్నతనంలోనే స్థిరపడుతుంది అని ఇక్కడ కూడా మరో సారి ఉదాహరణగా చెప్పవచ్చు. తన తోటి మిత్రులు టీవీ లో కార్టూన్ నెట్ వర్క్, సినిమాలను చూడడానికి ఇష్టపడితే సందీప్ స్పోర్ట్స్ ఛానెల్ లో వచ్చే బైక్ రేసింగ్ లను చూసేవాడు. పెద్దయ్యాక ప్రాక్టీస్ కూడా ఎవరో ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర కూడా తీసుకోలేదు, చిన్నతనం నుండి టీవీలో రేసింగ్ చూసిన అనుభవం యూట్యూబ్ లో ట్రైనింగ్ వీడియోలు చూసి రోడ్డు మీద జనం అంతగా తిరగలేని ప్రదేశాలలో, సమయాలలో ప్రాక్టీస్ చేసేవాడు. తన లక్ష్యానికి చేరువ కావడం కోసం ఉపయోగపడ్డ టీవీ, యూట్యూబ్ లే సందీప్ గురువులు.
విజయాలు వస్తుంటే భయం తొలగిపోయింది: సందీప్ తన పూర్తి ఆనందాన్ని రిలాక్సేషన్ ను రేసింగ్ లోనే వెతుక్కున్నాడు. తన విలువైన సమయాన్ని రేసింగ్ ప్రాక్టీస్ కోసం, రేసింగ్ లో పాల్గొనాలంటే శరీరం మనసు అదుపులో ఉండాలి ఇందుకోసం జిమ్ లో ఎక్సెర్సయిజ్, మెడిటేషన్ లాంటివి చేస్తుంటాడు. వృధా ఖర్చులు చెయ్యకుండా తనదగ్గర ఉన్న డబ్బుతో రేస్ ట్రాక్ లను ఇంత సమయానికి అని అద్దె తీసుకుని అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. బైక్ రేసింగ్ లంటే గాయాలవుతాయి ఉద్యోగ పరంగా భవిషత్తు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉందేమో అని అమ్మ నాన్నలు భయపడేవారు మొదట. సందీప్ చిన్న అనుమానం లేకుండా చేసే ప్రాక్టీస్ తో, హెల్మెట్ సేఫ్టీ రేసింగ్ సూట్ వేసుకుని పాల్గొన్న రేసింగ్ లో చాంపియన్ గా ఎదుగుతుండడంతో వారిలో భయం కూడా తగ్గుతూ వచ్చింది.
సందీప్(సత్యనారాయణ రాజు) అందుకున్న విజయాలు: ఇప్పటివరకు రాష్ట్ర దేశ స్థాయిలో పాల్గొన్న పోటీలలో సందీప్ 21 ట్రోఫీలు గెలుచుకున్నాడు. -2016 నుండి 2018 వరకు pulser festival of speed రాష్ట్రస్థాయిలో చాంపియన్. -హోండా మోటార్స్ వారి హోండా వన్ మేక్ లోను మొదటిస్థానం. -2016 లో చెన్నై లో జరిగిన KTM orange day లో చాంపియన్.