This Story Will Perfectly Represent The Scenario That We Are Facing Now

Updated on
This Story Will Perfectly Represent The Scenario That We Are Facing Now

Contributed By Hari Atthaluri

హైవే పక్కనే ఓ డాబా... టైం ఇంకో గంట ఐతే క్యాలండర్ లో డేట్ మారిపోతుంది... అప్పుడే ఒక బస్ వచ్చి ఆగింది.... ఒక్కొకరు దిగుతున్నారు...

ఆకలితో ఉన్న వాళ్ళు తినే టేబుల్స్ వైపు...ఆపుకున్న వాళ్ళు washroom వైపు స్పీడ్ గా వెళ్లిపోతున్నారు.... అక్కడ అప్పటీకే చాలా మంది ఉన్నారు... అర్దరాత్రి అవుతూ ఉన్నా కూడా.. ఆకలి కేక లు ఆర్డర్లు రూపం లో వినిపిస్తూనే ఉన్నాయి...

ఇంతలో సడన్ గా ఒక పోలీస్ జీప్ స్పీడు గా వచ్చి ఆగి ఉన్న బస్ కి అడ్డం గా ఆగింది.. అందరూ ఒక్కసారి గా ఆ సైరన్ వైపు చూసారు... ఓ లుక్ ఇచ్చి మళ్లీ normal గా తిండి గోల లో పడి పోయారు... కొంత మంది normal గా ఉండటానికి ట్రై చేస్తున్నారు...

అలా ట్రై చేస్ వాళ్ళలో , అక్కడే ఓ మూల గా కూర్చున్న ఇద్దరి లో ఒకడు ఏరా బావా, మనకోసమే వచ్చినట్టు ఉన్నారు బాబాయి లు..ఇపుడు ఎలా రా..అన్నాడు... నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు బే అని వాడికి మాత్రమే వినపడేలా అని, ఏం తెలియనట్టు తింటున్నారు. కొట్టేసిన నగల బ్యాగ్ వైపు ఇంకో సారి చూసుకుంటూ...

ఆ పక్కనే కూర్చున్న టీనేజ్ జంట.. అప్పటిదాకా మాట్లాడుకుని సడెన్ గా సైలెంట్ అయిపోయారు, ఆ జీప్ రాగానే.. అమ్మాయి చిన్న గా వణుకుతుంది.. వాళ్ళ నాన్న పోలీస్ కి కంప్లయింట్ ఇచ్చేసి ఉంటాడు ఈ పాటికే... ఈ పోలీస్ uncles తన కోసమే వచ్చారు అని...లేచి పోయి ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నా పని ఐపోతుంది అని....

ఆ పక్క టేబుల్ లోని ఇంకొ కుర్రోడు హడావుడి గా ఫోన్ తీసి memory card formart button నొక్కుతున్నాడు... తను morph చేసిన ఫొటోస్ వల్ల పోలీస్ లు ఇలా తనని వెతుక్కుంటూ, ఇంత దూరం వచ్చారా అని భయపడుతూ...

ఇంకో పక్కన కూర్చోవటానికి కి రెడీ ఐన వాడు కూడా.. ఫోన్ రాక పోయినా వచ్చినట్టు లేచి అలా చీకట్లోకి వెళ్ళిపోయాడు..తన దగ్గర ఉన్న గన్ దొరుకుతుందేమో అని...ఎక్కడ తను ఓల్డ్ రౌడీ షీటర్ అని గుర్తు పడతారు ఏమో అనే అనుమానం తో...

బస్ డ్రైవర్ వెంటనే పక్కన పాన్ షాప్ లోకి వెళ్లి సెంటర్ ఫ్రెష్ ఇవ్వండి అని అడుగుతున్నాడు... ఎక్కడ drunk n drive check చేస్తారు ఏమో అని... తను తాగిన వాసన వస్తుంది ఏమో అని...

అపుడే ఒక వ్యాను డాబా వైపు గా వచ్చి...మళ్లీ గేర్ మార్చుకుని వెళ్ళిపోతుంది...అందులో ఒకడు వామ్మో...మన కోసమే వీళ్ళు కాపు కాసి ఉంటారు... వ్యాన్ లో లోడ్ ఉంది అని వీళ్ళకి information వచ్చేసి ఉంటుంది... అర్జెంట్ గా బాస్ కి ఫోన్ చెయ్యి ..దొరికితే ఇంకేమైనా ఉందా... జీవితాంతం జైల్ లోనే ఉండాలి అని అరుస్తూ...

ఆ హోటల్ ఓనరు మాత్రం... ఆ జీప్ ని చూసి..వచ్చేశారు మళ్లీ మామూలు కోసం అని లోపల తిట్టుకుంటూ బయటకు ఓ సారి వాళ్ల వైపు చూసి ఓ సలాం పెట్టీ...

అరేయ్ చిన్నా... ఈ పాకెట్స్ సర్ వాళ్లకి ఇచ్చి రారా అని బిర్యాని తో పాటు గాంధీ గారి బొమ్మలు ఉండే కాగితాలు కూడా కొన్ని పెట్టి పంపించాడు....

అవి అందటం ఆలస్యం... జీప్ అలా వెళ్లిపోవటం ఇలా ఇక్కడ అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చు కోవటం ఒకేసారి జరిగాయి...

ఇక్కడ పోలీస్ రావటం అనేది ఆ హోటల్ ఓనర్ కి చాలా చిన్న విషయం... చాలా సాధారణ విషయం...

కాని అంత చిన్న విషయమే ఇవాళ వాళ్లకి ముచ్చెమటలు పట్టించింది... తప్పు చేస్తున్నామా అనే ఫీల్ లోపల ఉంది కాబట్టే , అది భయం గా మారి... ఆ పోలీస్ నా కోసమే వచ్చారు అనుకునేలా చేసింది..

పోలీసులు ఉన్న ఆ పది నిముషాలు.. సెకండ్ సెకండ్ కి ఉన్న భయం ని అంతకంతకూ పెంచి.. ఓ మినీ సైజు నరకం చూపించింది..

తప్పు చేస్తున్నాం అని మనకు తెలుసు... మన మనసుకు కూడా తెలుసు... కానీ అంతగా లెక్క చేయం...

దొరకటం లేదు అంటే, మనం చేస్తుంది రైట్ అని కాదు.. ఆ రోజు కి మన అదృష్టం బాగుంది అని...అంతే.. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఆ జీప్ నిజం గా మన కోసమే వస్తుంది...

ఇప్పుడు వాళ్ళలో పుట్టిన భయం.... "ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కి ఫోన్ చేసి నిజం చెప్పేలా చేసింది" "memory card format చేశాక చీ ఇలాంటి తప్పు ఇంకోసారి చేయను, దేవుడు ని క్షమించు అని మనసులోనే అడిగేలా.. ఆ కుర్రాడి మనసు మార్చింది" "ఆ డ్రైవర్ తో ఇప్పుడు ఎందుకు లే రిస్క్ అని, ఇంకో డ్రైవర్ చేతికి బస్ స్టీరింగ్ ఇచ్చేలా చేసింది" "ఆ ఇద్దరూ నగల బ్యాగ్ ని అక్కడే వదిలేసెలా చేసింది" "ఆ రౌడీ షీటర్ తన గన్ ని అలా చీకట్లో విసిరేసే లా చేసింది" పోయిన వ్యాను....! ఈ రోజు కాకపోతే ఇంకో రోజు దొరుకుతుంది... లేదా అందులో ఉన్న వాళ్ళు అదే భయం తో మారటం ఐనా జరుగుతుంది....

"ఎవరు చెప్పినా వినని మనం మన భయం చెప్తే ఖచ్చితంగా వింటాం" అంతో ఇంతో మారతాం... ప్రస్తుతం ఆ భయం పేరు కరోనా.. ఆ కరోనా మనకు అంటుకుంటుందేమో అని భయం తో చేతులు కడుకుంటున్నాం, ఆ కరోనా భయం ఇంట్లో ఉంటున్నాం, ఆ భయం తో తాకకుండా నమస్కారం లాంటివి అలవాటు చేసుకుంటున్నాం. అలా మన ఆరోగ్యం మీద, మన అలవాట్ల మీద మనోక భయం concern ఏర్పడింది. తప్పదు అనుకున్నప్పుడు కూడా తప్పు చేయకండి చిన్న చిన్న జాగ్రత్తలే... మన జీవితం మన చేతుల్లో..