Everything You Need To Know About Bhagat Singh, One Of The Bravest Freedom Fighters Of The Country!

Updated on
Everything You Need To Know About Bhagat Singh, One Of The Bravest Freedom Fighters Of The Country!

అప్పుడు భగత్ సింగ్ కు మూడు సంవత్సరాలు. తండ్రి కిషన్ సింగ్ భగత్ ను ఎత్తుకుని కొత్తగా పొలంలో తోట వేస్తున్న ప్రాంతానికి వెళ్ళారు. అందరూ ఏదో ఒక పనిచేస్తున్నారు భగత్ సింగ్ తన చిన్ని చేతులతో గడ్డిపరకలను భూమిలో నాటుతున్నారు, అక్కడి వారు భగత్ సింగ్ ను చూసి సరదాగా ఏం బాబు ఏం చేస్తున్నావ్ అని అడిగితే మూడు సంవత్సరాల భగత్ సింగ్ ఇచ్చిన సమధానానికి వారు ఆశ్ఛర్యపోయారు. "తుపాకులను నాటుతున్నా" ఈ జవాబుతోనే అక్కడి వారందరికి అర్ధం అయ్యింది ఇతను మామూలు వక్తి కాదు ఇలాంటి జన్మ, బతుకు, వ్యక్తిత్వం, ధైర్యం కేవలం కోట్లల్లో కొంతమందికే ఉంటుంది అని.. చిన్నప్పుడు తన తోటి పిల్లలతో ఎంత సరదాగా ఆడుకునే వారో అంతే క్రమశిక్షణతో దేశంపై మమకారం చూపించేవారు. ఒకసారి బాబాయ్ అజిత్ సింగ్ బ్రిటీష్ వారిపై పోరాడటానికి వేరో ప్రాంతంలో ఉంటే తన మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న పిన్నిని ఓదార్చుతూ "ఇలా కన్నీరు పెట్టుకోవద్దు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించాలి, అవసరమైతే రేపటి భవిషత్ తరాలకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలి. రేపు నేను కూడా బాబాయ్ లాగానే పోరాడుతా అని ప్రతిజ్ఞలు చేసేవారు."

bhagarsinghpic1_1_0001

ఇంత చిన్న వయసులోనే అంతటి దేశభక్తి రావాడానికి ప్రధాన కారణం వారి కుటుంబం అంతా దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమం చేస్తున్నవారే. తనకు ఊహ తెలిసినప్పటి నుండి బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తునే ఉన్నారు. చిన్నప్పుడు బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ కాకుండా ఆర్య సామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ లో చదివారు. ఆ రోజుల్లో మహాత్మ గాంధీ గొప్ప సత్యగ్రహాలు, ఉద్యమాలు శాంతియుతంగా చేసేవారు. గాంధీ "సహాయ నిరాకరణోద్యమానికి" ప్రభావితం అయ్యి 13 సంవత్సరాల వయసులో ప్రభుత్వ పాఠశాలల పుస్తకాలు, ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసిన వస్తువులను తగలబెట్టి నిరసన ప్రదర్శించేవారు.. తర్వాత మహాత్ముడి అహింసా పద్దతులపై నిరాశ చెంది వాటి ద్వారా స్వాతంత్ర్యం రాదు అని నమ్మి బ్రిటీష్ వారిపై శారీరక దాడులు చేస్తేనే వారు భయపడి పారిపోతారు అప్పుడే స్వాతంత్ర్యం వస్తుందని బలంగా నమ్మి హింస మార్గాన్ని ఎంచుకున్నారు.

simon-go-back

తన దేశభక్తి ఎంత ఉన్నతంగా ఉండేదో దాని ప్రదర్శన కూడా అంతే వీరోచితంగా ఉండేది. బ్రిటీష్ వారిపై ఉద్యమిస్తూ నాటకాలు కూడా ప్రదర్శించేవారు. భగత్ సింగ్ గొప్పనటులు కూడా. భారతదేశ మహా వీరులైన రానా ప్రతాప్, చంద్రగుప్త, భరత్ దుర్ధశ వంటి వారి పాత్రలు వేస్తు నటించేవారు. "గన్ను పట్టి శత్రువులను ఎలా వెంటాడారో పెన్నుపట్టి దేశ యువతలో స్పూర్తిని రగిలించేవారు". వివిధ పత్రికలకి వ్యాసాలు రాస్తు ఎంతోమందికి దేశ స్వేచ్ఛ లక్ష్యానికై దిశ నిర్ధేశం చేసేవారు. లెనిన్, కారల్ మార్క్స్ వంటి వారి పుస్తకాలు చదవడంతో భగత్ ఒక బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నాడు. వయసు పెరుగుతున్న కొద్ది భగత్ సింగ్ కు దేవుని మీద నమ్మకం పోయింది. భారత జాతికి ఎప్పటికి ఒక పీడ కలలా ఉండే "జలియన్ వాల బాగ్" దుర్గటనలో దాదాపు 400మంది వరకు చనిపోయారు, ఇది పంజాబ్ లోని అమృత్ సర్ ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో భగత్ సింగ్ స్కూల్ నుండి బయటకు వచ్చి ఆ ప్రదేశానికి వెళ్ళి "దేశ పౌరుల రక్తంతో తడిచిన అక్కడి మట్టిని ఒక పాత్రలో పెట్టుకుని ఆ మట్టినే దైవంగా భావించి ప్రతిరోజు ఆ మట్టికి ప్రణామం చేసేవారు".

qlq3lds

బ్రిటీష్ వారికి ఏనాడు భగత్ సింగ్ భయపడలేదు! "మీరు నన్ను చంపొచ్చు కాని నా వ్యక్తిత్వాన్ని చంపలేరు, మీరు నా శరీరాన్ని తుక్కు తుక్కుగా ముక్కలు చేయవచ్చు కాని నా ఆత్మస్తైర్యాన్ని, దేశభక్తిని కాదు" అని నినదించేవారు. మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లేభాయ్ పటేల్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, భగత్ సింగ్ వంటి గొప్ప భరతమాత కన్న బిడ్డలను చూసి బ్రిటీష్ వారు భయపడి చచ్చేవారు. ఎందుకంటే "వీరు ఎంత మేధావులో, ఎంత ధైర్యం కలవారో అంతే మొండిపట్టున్న వారు. వీరు ఏదైనా బాగా ఆలోచించి చేస్తారు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసే వరకు వదిలిపెట్టరు. భగత్ సింగ్ కు నిండా 25 సంవత్సరాలు కూడా నిండకుండానే బ్రిటీష్ వారికి కొరకరాని కొయ్యగా నిలిచాడు. తను పుట్టిందే బానిస బతుకుల విముక్తి కోసం, బ్రతికున్నంత కాలం వారికి ఒక ధైర్యంగా నిలిచారు. భగత్ సింగ్ ఎక్కడ ఉన్న అక్కడి సమస్యలను నిర్మూలించడానికి ఉద్యమం చేసేవారు. ఖైదిగా జైలులో ఉన్నప్పుడు.. "ఆ సమయంలో జైలులో భారత ఖైదీలను ఒక రకంగా బ్రిటీష్ ఖైదీలను మరోకరంగా సిబ్బంది చూసేవారు ఇలాంటి అసమానత్వం ఉండకూడదు అని నిరాహార దీక్ష చేసి ఖైదీల హక్కులకై పోరాడారు.

154601

ఆ కాలంలో చిన్న వయసులోనే పెళ్లిళ్ళు జరిగేవి. పెళ్ళిచేసుకుంటే నా భార్య నా పిల్లలు అంటూ స్వార్ధం, భయం పెరుగుతాయని తల్లి దండ్రులకు నిఖ్ఖచ్చిగా "నా జీవితం ఈ దేశానికే అంకితం నేను వివాహం చేసుకోను అని చెప్పిన గొప్ప యువకుడు". దేశభక్తులు శాంతియుతంగా, వివిధ మార్గాల ద్వారా ఉద్యమం చేస్తుంటే వారికి రక్షణగా భగత్ సింగ్ ఉండేవారు. బ్రిటీష్ పోలీసులు, అధికారులు ఉద్యమ కారులపై తిరగబడితే ఆ పోలీసులపై దాడిచేసి బ్రిటీష్ వారికి వెన్నులో వణుకు గా ఉన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ పై బ్రిటీష్ వారి దాడి తర్వాత ఆయన మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్ మరియు అతని సన్నిహితులు దాడులకు దిగారు. ఈ క్రమంలో పోలీస్ వారికి పట్టుబడ్డారు. భగత్ సింగ్ మరియు సుఖ్‍దేవ్, రాజ్‍గురు బ్రతికి ఉంటే వారికి మరింత నష్టం అని భావించి వారికి ఉరిశిక్ష విధించారు.

qlq3lds

భగత్ సింగ్ తండ్రి, మరికొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు క్షమభిక్ష ద్వారా ఉరిని తప్పించాలి అని ప్రయత్నించినా భగత్ సింగ్ మాత్రం "నేను ఎవరి మీద ఐతే పోరాటం చేస్తున్నానో వారి కాళ్ళ కింద పడి నా తల పెట్టాలా..? నా దేశం కోసం నేను యుద్ధం చేశా నాకోసం కాదు! నేను క్షమభిక్ష కోరుకోను!" అని తన వ్యక్తిత్వాన్నిచాటుకుని క్షమాభిక్షకు విభేదించారు. సాధారణంగా ఉరిశిక్ష విధించిన ఖైదికి జైలు సిబ్బంది ఉదయం ఉరితీసే వారు.. కాని భగత్ సింగ్ ని మాత్రం రాత్రి 7గంటలకు ఉరితీశారు(ఎక్కడ భగత్ సింగ్ కోసం జైలుపై దేశభక్తులు దాడి చేస్తారో అన్నభయంతో). భగత్ సింగ్ మెడకు ఉరితాడు భిగించే ముందు, చనిపోయే ముందు పలికిన చివరి మాటలు "ఇంక్విలాబ్ జిందాబాద్"(విప్లవం వర్ధిల్లాలి) అని దిక్కులు ప్రెక్కటిల్లేలా, అక్కడి సిబ్బంది చెవులు తూట్లు పడేల, జైలు ప్రాంగనం నుండి భారతదేశాన్నంతటికి వినపడేలా గట్టిగా నినదించి అమరుడయ్యారు.

bhagat-singh-great-photos

"భగత్ సింగ్.. మీరు చనిపోయినా మీరు మాకు అందించిన పోరాట స్పూర్తి ఎప్పటికి బతికే ఉంటుంది ఆ స్పూర్తే మా లోని దేశభక్తిని ఒక వీర సైనికునిలా రక్షించుకుంటుంది.." ఇంక్విలాబ్ జిందాబాద్..

71985_461256420614095_1110718212_n

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.