This Government School In Nizamabad Is Beating All Private Schools In The Area With Quality Education!

Updated on
This Government School In Nizamabad Is Beating All Private Schools In The Area With Quality Education!

ఎంత ఖర్చయినా పర్వలేదు పిల్లల బంగారు భవిషత్తు కోసం ఎంతో Sacrifice చేసి తమ కనీస అవసరాలన్నీటిని తగ్గించుకుని వేలు, లక్షల్లో ఫీజులు, డొనేషన్లు కట్టి Private Schools లో Join చేయిస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు.. నిజానికి వాళ్ళదేం తప్పులేదు... ప్రభుత్వ స్కూల్స్ లో సరైన విద్య లభించదని తల్లిదండ్రులందరూ ప్రైవేట్ స్కూల్ లోనే జాయిన్ చేర్పిస్తారు ఇదంతా మనం నిత్యం చూస్తున్నదే. ఎవరైనా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఏదో చేయకూడని పని అన్నట్టుగా, చూసి చూసి పిల్లల భవిషత్తును నాశనం చేస్తున్నారనుకునే ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మాత్రం గర్వంగా ప్రవేశం తీసుకుంటున్నారు. ఆ సర్కారు పాఠశాలే నిజామబాద్ జిల్లాలోని బోర్గాం ప్రభుత్వ పాఠశాల..

BS-1

నిజామాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలోని బోర్గాం గ్రామంలో ఈ ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. చుట్టు ప్రక్కల ప్రాంతాలలో 30 ప్రైవేట్ స్కూల్స్ లో 25 స్కూల్స్ బస్ సౌకర్యం, Digital Class Rooms కల్పిస్తున్నా పిల్లలందరు ఈ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదవడానికి ఇష్టపడుతున్నారు. విద్యార్ధుల సంఖ్య 200 గగనమయ్యే ఈ తరంలో గత సంవత్సరం 750 విద్యార్ధులుంటే ఈ సంవత్సరం ఈ పాఠశాలలో 1,100 విద్యార్ధులు ప్రవేశం పొందారు. ఈ స్కూల్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో విద్యనందిస్తారు.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ Digital Equipmentతో విధ్యనందిస్తుండటంతో అన్ని రంగాలలో ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువగా ఇక్కడ ఫలితాలు వస్తుండటంతో చుట్టు ప్రక్కల గ్రామాల పిల్లలు మాత్రమే కాదు ప్రతిరోజు 25 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేసి మరి ఇక్కడ జాయిన్ అవుతున్నారు..

BS-2

ప్రతి తరగతిలో 4 సెక్షన్లు ఉంటాయి ఇలా బడి మొత్తం 24 మంది ఉపాద్యాయులు భోదిస్తున్నారు. ఈ బడిలో అగస్ట్ నుండే Special Classes మొదలుపెట్టి ఒక Intelligent Student, ఒక Above Average Student, ఇద్దరు Average Studentsతో 4 Membersని ఒక Group గా Divide చేస్తు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. 2016 నాటి పదవతరగతి పరీక్ష ఫలితాలలో 93% ఉత్తీర్ణత సాధించింది.. ఈ పాఠశాల అందించిన పునాదితో ఎంతో మంది డాక్టర్లుగా, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా తమ లక్ష్యాలను చేరుకుంటున్నారు.. చాలా మంది విద్యార్దులు 9 కి పైగా GPA సాధించారు. ఈ విద్యా సంవత్సరంలొ నేహా అనే విద్యార్దిని పదవతరగతిలో 9.7/10 GPA తో బాసర IIITలో Admission పొందింది.. కేవలం చదువులలో మాత్రమే కాదు... ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా జాతీయ,రాష్ట్రస్థాయిలో మంచి ఫలితాలను గెలుచుకుంటుంది.

BS-3