మనుషులందరూ ఒకేలా ఉండరు... అలా ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.మన చుట్టూతా ఉండే వాల్లల్లో కొంతమంది అంతర్ముఖులు (introverts) గా ఉంటారు. అంటే తక్కువగా మాట్లాడుతారు,కేవలం తక్కువ మంది తోనే మాట్లాడుతారు.తమతో తాము ఎక్కువ సంభాషిస్తారు.ఏకాంతంగా,ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు.అయినా సంతోషంగా,సంతృప్తి గా ఉంటారు.అవసరమైన వాటికే స్పందిస్తారు.అయితే పుస్తకాలు, లేదంటే సంగీతం ఇలా ఏదో ఒక వ్యాపకంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు...!
ఇలా అంతర్ముఖులుగా ఉండటం వల్ల కలిగే లాభ నష్టాలు.
ముందుగా నష్టాలు 1. అంతర్ముఖులు తమ భావాలను ఎక్కువగా పంచుకోరు కాబట్టి అందరూ వాల్లని అహంకారులుగా, స్వార్ధపరులుగా,గర్విష్టులుగా అనుకునే ప్రమాదం ఉంది. 2. ఒక విషయం పై పూర్తి అవగాహన,పరిజ్ఞానం ఉన్నా దాన్ని వ్యక్తపరచరు కాబట్టి జనాలు తెలివితక్కువ వారిగా భావిస్తారు. 3. చాలా అవకాశాలను కోల్పోతూ ఉంటారు .ఎందుకంటే అంతర్ముఖులను చాలా తక్కువ మంది అర్థం చేసూకుంటారు. 4. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు.ఎవరితోను పంచుకోరు కాబట్టి కొన్ని విషయాలకు ఎక్కువగా బాధపడతారు. ఉపశమనం చాలా ఆలస్యంగా లభిస్తుంది. 5. చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు, ఎవరితోనూ అంత చనువుగా ఉండరు..! అందరితో కలిసి ఆటలు ఆడరు.
లాభాలు 1. ఏదైనా పూర్తిగా తెలిస్తేనే మాట్లాడుతారు. మాట్లాడే ప్రతీ మాటను ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడతారు. 2. తమకు నచ్చిన విషయాల గురించి ఆలోచించడానికి, నచ్చిన పనులు చేయడానికి ఎక్కువ స్వేచ్ఛ, సమయం ఉంటాయి(ఎవరూ డిస్టర్బ్ చేయరు కాబట్టి) 3. తమకంటూ తాము సృష్టించుకున్న ప్రపంచంలో సంతోషంగా ఉంటారు,తమ ఆలోచనలకూ,నిర్ణయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ను ఇస్తారు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించరు.ఆత్మాభిమానం కలిగి ఉంటారు. 4. ఉత్తమ లక్షణం ఏంటంటే ఎక్కువ వింటారు,తక్కువ మాట్లాడతారు. 5. తాము ఎవరికైనా సహాయం చేసినా దాన్ని పబ్లిసిటీ చేసుకోరు.తిరిగి ప్రతిఫలం కూడా ఆశించరు. 6. బందాలకు ఎక్కువ విలువిస్తారు.(Relationships ను చాలా serious గా తీస్కుంటారు). 7. పది మంది అల్లాటప్పా స్నేహితుల కంటే ఒక విలువైన స్నేహితుడు చాలు అనుకుంటారు.అందుకే చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నా వారికి జీవితాంతం సరిపడా స్నేహాన్ని అందిస్తారు. 8. ప్రేమ విషయం లోనూ అంతే, వీరు ఎవరికీ నచ్చరు,వీరికి ఎవరూ నచ్చరు,ఒకవేళ అలా జరిగితే ఆ ప్రేమను చివరి వరకూ నిలుపుకుంటారు.నిజాయితీ గా ప్రేమిస్తారు..!
So మీ చుట్టూ ఉన్న వాల్లలో అరుదుగా కనిపించే ఈ అంతర్ముఖులను అర్థం చేస్కోవడానికి ప్రయత్నించండి.!వారితో స్నేహం చేయడానికి ప్రయత్నించండి...!మీ అవసరం వారికి లేకున్నా వారి అవసరం మీకు ఉండే ఉంటుంది..!అటువంటి వారు దొరకడం ఎంత అదృష్టమో మీకే తెలుస్తుంది...!