అసలైన Water Fall అందాలను చూడాలనుకుంటే మాత్రం వర్షకాలంలోనే చూడాలి. మిగిలిన టైంలో చూసినా గాని అందులో సోల్ కనిపించదు, ఒకవేళ వెళ్ళినా కాని మళ్ళి వర్షాకాలంలో రావాల్సిందే అని టూర్ ప్లాన్ చేసేసుకుంటాం. ఇప్పుడు వర్షకాలం వచ్చేసింది. బొగత జలపాతం కూడా అందంగా రెడీ ఐపోయింది.. ఇక మనం వెళ్ళడమే లేట్.
వాటర్ ఫాల్స్ కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి తరచి చూడాలే కాని మన తెలుగు స్టేట్స్ లో ఎన్నో అందమైన జలపాతాలున్నాయి. ఇంతకు ముందు మన గవర్నమెంట్స్ టూరిజమ్ మీద అంతగా ఫోకస్ పెట్టకపోవడంతో మనం వేరే స్టేట్స్ కి వెళ్ళాల్సి వచ్చేది కాని ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. మంచి టూరిస్ట్ ప్లేసెస్ ని గుర్తించి వాటికి అన్ని రకాలైన ఫెసిలిటీస్ పెంచుతున్నాయి. అలా తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొగత వాటర్ ఫాల్స్ కూడా మనం తప్పకుండా వెళ్ళాల్సిన వాటర్ ఫాల్స్ లో ఒకటి.
ఈ జలపాతం ఖమ్మం నుండి 243కిమీ, భద్రాచలం నుండి 120కిమీ, వాజేడు నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తెలంగాణ - చత్తీస్ ఘడ్ మధ్య ఉన్న అడవిలో ఈ బొగత పుట్టింది. అక్కడి నుండి ప్రవహిస్తు ఖమ్మం జిల్లా వాజేడు మండలానికి చేరి కొండల నుండి అందంగా జాలు వారుతుంది. ఒకవేళ బొగత జలపాతానికి వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈరోజు నుండి నవంబర్ లోపు వెళ్తే మాత్రం అక్కడి అందాలను పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు. పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఇక్కడి వాటర్ ఫాల్స్ కోసమే అని కాకుండా శ్రీ లక్ష్మీ నరసింహా, బీరమయ్య దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు.