అన్నం శ్రీధర్(బాచి) గారు వృత్తిరీత్యా హైకోర్టు అడ్వకెట్ అలాగే నంది అవార్డులు అందుకున్న స్టేజ్ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్, కథా రచయిత కూడా.. ఇన్ని రంగాలలో విశిష్ట ప్రావీణ్యమున్నా "బాచి" గానే తెలుగువారందరి మదిలో నిలిచిపోయారు. ఒక్క తెలుగులోనే కాదు కన్నడం, హిందీ, తమిళం, మలయాళం భాషలలో కార్టూన్లు వేసేవారు. 35 సంవత్సరాలలో 15,000కు పైగా కార్టూన్లు వేసి చరిత్ర సృష్టించారు. పదేళ్ల వయసునుండే బొమ్మలు వేస్తుండడంతో ఆయన కార్టూన్లలోని పాత్రల భావావేశాలు స్పష్టంగా కనిపిస్తాయి..
"కార్టూన్లు చూడడం వల్ల మాత్రమే కాదు వేయడం వల్ల ఒత్తిడి, టెన్షన్స్ దూరంగా ఉంటాయి, ఇప్పటికీ వేస్తుండడం వల్లనే 55 వయసులోను ఉల్లాసంగా ఉండగలుగున్నాను" - బాచి గారు.

1. ఇలా ఐతే 10 సంవత్సరాల పిల్లలు ముగ్గురు వస్తారు.

2. బిల్లు కట్టాక చెప్పాడు.

3. వంటింటిలోకే ఆహ్వానం, ఎందుకంటే ఆయుధాలుండేవి అక్కడే కదా..

4. అదన్నమాట!!

5. ఈ ట్రిక్కు తెలియక ఇన్నాళ్లు ఎంత అవస్థ పడ్డానో .

6. నిద్ర రాదు.. గురకా రాదు.

7. కూతురి పేరు మధుప్రియ.

8. తీసుకోమ్మ రెండు రకాలుగా పనిచేస్తుంది!!

9. నాకు జోక్ అర్ధమయ్యింది.

10. "కూరగాయల బేరం" అని ప్రతి ఒక్కడికి లోకువే అయిపొయింది!!

11. అలా భరోసా ఇస్తేనే కదా జేబులలో పెట్టుకునేది..

12. ఒరేయ్ ఏంట్రా మీరు చేసేది.!!

13. (ఒకవేళ పగులగొట్టినా మాకేం సంబంధం లేదు)

14. "డై" డై ఐపొయింది!!

15. బేరాలు రెండు రకాలు.. 1. గుడి లోపల, 2. గుడి బయట.

16. అందుకేనా..

17. అవును సీక్రెట్ యే!!

18. అపాయంలో ఉపాయం.

19. వెంటనే చెప్పండి!!

20. అవునవును..

21. ఒకవేళ హెల్మెట్ తీయకున్నా, నో పార్కింగ్ లో బండి ఆపావని ఫైన్ వేస్తా!!

22. చదివిన వాడు ఎవడి పాపాన వాడు పోతాడు.

23. తిట్టాలో కొట్టాలో తెలియని పరిస్థితి!!

24. ఇంకెవరూ మన ఉద్దండం గారే అయ్యుంటారు.

25. అసలే శాలరీ అంతంత మాత్రమే!!

26. ముందు నా దగ్గరికి రండి!!

27. డాక్టర్ గారి పేరు బాగుంది.

28. పద పద..

29. భార్య బాధితుల సంఘం సభ్యుడు.
