మట్టి లో మాణిక్యం అన్న వాక్యానికి బేబీ గారు సరైన ఉదాహరణ, ఎక్కడో పల్లెటూరి లో తను పాడిన పాట రఘుకుంచె గారికి చేరి, అక్కడనుండి కోటి గారి వద్దకు వెళ్లి, రెహమాన్ గారి మెప్పు పొందింది. ఆ గొంతు లోని సహజత్వం ఆమెకు దక్కిన వరం. అది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానీ అందరు గుర్తించే విధంగా వచ్చింది.
కల కి కళ కి వయసు పరిమితి లేదు అనే విషయాన్ని బేబీ గారి ప్రయాణం మరో సారి రుజువు చేసింది.
తన గాన మాధుర్యం తెలిసింది ఇలా....
ఆ ఒక్క పాట రెహమాన్ గారి మెప్పుని పొందేలా చేసి, చిరంజీవి గారి చేత సన్మానం పొందేలా చేశాయి. బీబీసీ తెలుగు వాళ్ళు లైవ్ కూడా చేశారు.
ఆమె పాట బయటకి రాగానే మొదట స్పందించింది రఘు కుంచె గారు. ఆయన అనుకున్నట్టు గానే ఆమె తో "మట్టి మనిషినండి నేను" అనే పాట పాడించారు, ఆ పాట ను లక్ష్మి భూపాల గారు రాశారు. సంగీతం లోను సాహిత్యం లోను పల్లె సువాసన కలిగినా ఈ పాట బేబీ గారి గొంతు తో ఇంకొంత సహజత్వాన్ని సంతరించుకుంది. ఆ పాట గురించి, బేబీ గారి గురించి, రఘు కుంచే గారు తన యూట్యూబ్ ఛానెల్ లో ఇలా రాసారు.
బేబీ గారు మధురంగా పాడిన ఈ పాటలో మాటలు ఇవి, ఈ పాటలో ప్రతి మాట ఆమె జీవితాన్ని ప్రస్ఫూటంగా వర్ణించింది.
సాహిత్యం:
పల్లవి :
మట్టిమనిషినండి నేను..
మాణిక్యమన్నారు నన్ను..
పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట..
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం..
ఏలేలో.. ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో...
చరణం :
చెమటచుక్క చదువులు నాయి..
కాయాకష్టం పాఠాలు..
పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు..
ఏతమేసి తోడానండీ నాలోఉన్న రాగాలు..
దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు..
పచ్చపచ్ఛాని పైరమ్మ పాట..
ఏరువాకల్లో నాఎంకిపాట..
ముళ్లదారే తీసి, పూలేఏసి మీముందు ఉoచాయీ పుట..
ఇది నాబతుకు పాట..
తీపిరాగాల తోటి, మావూరు దాటి మీకోసమొచ్చాను..
పల్లె దాటి ప్రతి ఒక్కరి మొబైల్స్ లో వచ్చిన ఆ పాట మాధుర్యం, ఇంకెన్నో గమ్యాలను చేరాలని, తన ప్రయాణం మరెంతో మంది మట్టి లోని మాణిక్యాలకు స్ఫూర్తి ని ఇవ్వాలని కోరుకుంటున్నాం.