(అది చకోర పక్షుల కోసం నిండుగా వెన్నెల కురుస్తున్న రాత్రి.) వేరువేరు గా ఉన్న వారు నిర్మానుష్యమైన రోడ్డు లో ఒంటరిగా ...ఇద్దరూ తన కాళ్ళ మీద తను నిలబడగల నమ్మకం ఉండే అతను ఎవ్వరినైనా నవ్వుతూ పలకరించే ఆమె ఉద్యోగ ప్రయత్నం లో అలసిపోయి ఇంటికి చేరుతున్న అతను భూమి మీద మరొక వెన్నెలా అని తలపించే ఆమె ఆపద నుంచి గట్టెక్కగల సత్తా ఉన్న అతను ఆపద లో తను చిక్కుకుబోతుంది అని తెలియని ఆమె అతని దారిన అతడు ఆమె దారిన ఆమె వారు వెళుతున్న దారంతా నిశ్శబ్దం ఒక్కసారిగా ఆమె జీవితం లో ఒక కల్లోలం ఎక్కడో ఉన్న ఆమె అరుపు వినిపించి వెనక్కి తిరిగిన అతను నిండుగా యాసిడ్ తో రక్తపు మడుగులో ఆమె యాసిడ్ పోసిన ఆ నీచుడిని పట్టుకోవాలని పరిగెత్తాడు అతను సహాయం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది ఆమె ఆమె ఆర్తనాదాలను గుండెచప్పుడు చేసుకున్నాడు అతను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది ఆమె ఉన్నపళం గా చికిత్స కోసం పరుగులెత్తాడు అతను అపస్మారక స్థితి లో ఆమె రెండ్రోజులు కునుకు లేకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు అతను ముఖం నిండా కుట్లు తో మాట్లాడలేని స్థితి లో ఆమె కన్నీళ్లతో చలించిపోయాడు అతను చిరునవ్వుతో ధన్యవాదాలు చెప్పింది ఆమె తన కళ్ళల్లోని భావం అర్థంచేసుకున్నాడు అతను అతని చేయి ని వదలదలచుకోలేదు ఆమె చికిత్స అయ్యేవరకు తన వెంటే ఉన్నాడు అతను అతనికి గుండెల్లో గుడి కట్టుకుంది ఆమె కొన్ని కారణాల చేత వాక్కు పోగొట్టుకుంది ఆమె అయితేనేం... ఆమె కళ్ళల్లోని భావాలని వాక్కులు గా మార్చాడు అతను ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు గా ఆ రోజు దారిలో వెళ్తున్న వారు నేడు వారి వారి కుటుంబాల సమక్షం లో ఒక్కటయ్యారు ఇద్దరూ ఆమె గుండెచప్పుడు అతను అతని ప్రాణం ఆమె విడదీయలేని విధం గా బంధాన్ని పంచుకున్నారు ఇద్దరూ మరొక వెన్నెల రాత్రి లో కూర్చుని కళ్ళతో భావాలని పలికించుకుంటున్నారు ఇద్దరూ