భోజనంలో వాడే పదార్ధాలతో పాటు చుట్టూ ఉండే వాతావరణం కూడా రుచిని మరింత పెంచుతుందని భరత్, రజినీకాంత్, ఆదిత్యల అభిప్రాయం. ముగ్గురిది మూడు భిన్నమైన ఉద్యోగాలు.. మన రాజధాని హైదరాబాద్ లో పాక నిర్మించడం కోసం రజినీకాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని, భరత్ ఎం.ఏ ఎకానామిక్స్ క్వాలిఫికేషన్ తో కూడిన కెరీర్ ను, మాస్ కమ్యూనికేషన్ తో జాబ్ చేస్తున్న ఆదిత్య తమ దారులను మార్చుకున్నారు. "పాక" ప్రకృతిలో నుండి సహజ సిద్ధంగా మొలిచిన ఓ చెట్టులా నీడ నిస్తుంది. ఏ కల్తీలేని అసలైన ఆహారాన్ని తినిపిస్తూ స్ట్రెస్ ని, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగి పారేస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ కాసేపు గడిపినా..
ప్రతి 15 రోజులకు ఇక్కడ మెనూ మారిపోతుంది. పాకలో మాత్రమే కనిపించే స్పెషాలిటీ ఇది. సాధారణంగా ఒక్కసారి ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తే ఆ ఫుడ్ కోసమే ప్రతిసారి రావాలని కోరుకుంటుంటారు. ఇక్కడ మాత్రం ప్రతి 15 రోజులకు మారిపోయినా కాని కొత్త రుచి కోసం ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పాక కో ఫౌండర్స్ లో ఒకరైన భరత్ కు ఈ భూమి మీద ప్రతి ప్రాంతాన్ని చూడాలని ఆశ. భరత్ చాలా చోట్లకు ప్రయాణం చేస్తుంటాడు. నేపాల్, హిమాచల్ ప్రదేశ్, గోవా, రిషికేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి రెస్టారెంట్లను గమనిస్తుండేవాడు. ఆదిత్య, రజినీకాంత్ లు కూడా అంతే. ఈ ముగ్గురు వెళ్ళిన రెస్టారెంట్లను, ఇంకా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని గమనించడం, వాటిలో ఎటువంటి మార్పులు తీసుకువస్తే బాగుంటుందని ఆలోచించేవారు. ఈ ముగ్గురిలో ఉండే ఈ "లక్షణం" పాక ఇంత అందంగా రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడింది.
మన లోకల్ విలేజ్ "కాకా హోటల్"లో కనిపించే టేబుల్స్, పెళ్లిలో కనిపించే తాటాకు పందిళ్ళతో నిర్మించిన పాక సహజమైన ప్రపంచాన్ని చూపిస్తాయి. కేవలం టేస్టీ ఫుడ్ మాత్రమే కాదు ఆరోగ్యకరమైన 100% ఆర్గానిక్ ఫుడ్ పాకలో దొరుకుతుంది. లోకల్ హైదరాబాద్ బిర్యానీ దగ్గరి నుండి శ్రీలంకలో దొరికే మిక్సిడ్ వెజిటెబుల్ కర్రీ, లక్నో ఉత్తర్ ప్రదేశ్ లోని అవాదీ మటన్, బిహారీలు ఇష్టంగా తినే మటన్ కర్రీ మొదలైన రుచుల కోసం కిలోమీటర్లు జర్నీ చేసి మరీ ఇక్కడికి వస్తుంటారు. జనాలలో స్వార్ధం, ప్రతీ ఇంటికి టీవీలు రాకమునుపు రాత్రి భోజనాలు చేసిన తర్వాత పూర్వం పాటలు పడేవారు, ఒకరి మధ్య ఒకరికి ఆత్మీయ సంబందాలు ఇష్టాలు పంచుకోవడానికి ఒక వేదికలా ఉండేది ఈ సాంప్రదాయం. ఆ పాత జ్ఞాపకాలను, ఆకారాలను మళ్ళీ తీసుకొస్తున్న పాకలోను "సంగీతం" భోజన ప్రియుల మనసు ఆకలిని కూడా తీరుస్తుంది.