Here's Why "Arjun Reddy" Is A Modern Age Love Story That Gives Us An Unforgettable Experience!

Updated on
Here's Why "Arjun Reddy" Is A Modern Age Love Story That Gives Us An Unforgettable Experience!

NOTE: SPOILERS AHEAD

"వీడికి బార్ లో బేరర్ తో , రోడ్డు మీద బజ్జీలు వేసేవాడితో ఏం ఇబ్బంది ఉండదు .. అన్నిటికి మనతోనే ప్రాబ్లం మనతోనే గొడవలు" సెకండ్ హాఫ్ లో అర్జున్ ఫ్రెండ్ శివ అర్జున్ క్యారెక్టర్ గురించి చెప్పే మాట ఇది .. నిజమే ప్రీతీ అర్జున్ జీవితం లోకి రాక ముందర వరకూ అర్ధం లేని కోపాన్ని చూపిస్తూ యరోగెంట్ గా రెచ్చిపోయిన అర్జున్ ప్రీతీ వచ్చిన తరవాత ఆమెకేమైనా అవుతుంది అనే భయం లో మాత్రమే కోపాన్ని చూపించాడు .. కానీ ఆమె వెళ్ళిపోయిన తరవాత? అతనిలో కోపం యారోగెన్స్ ఎక్కడా కనపడవు .. మరి ఆమె వేరేవాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కూడా అతనిలో అదే పొగరు కనపడింది కదా అంటారా? నిజమే, కానీ అది కోపం కాదు యారోగెన్స్ కాదు అది 'నిస్సహాయత'. తన ప్రేమ ముందర ఎందుకూ పనికి రాని కమల్ లాంటి వాడి ప్రేమ కూడా సక్సెస్ అవుతున్నా తన ప్రేమ ఎందుకు ఫెయిల్ అయ్యిందో సమాధానం లేని నిస్సహాయత, పెళ్లి అనే అర్ధం లేని (అతని దృష్టిలో) కట్టుబాటు ను పట్టుకుని ఇష్టం లేకపోయినా ప్రీతీ ఎందుకు ఇంకా వేలాడుతోంది తెలీని నిస్సహాయత, వేరే వ్యక్తి తో జీవితాన్ని గడపడం కోసం ముందుకు వెళ్ళలేక అసలు ఆమె వెనక్కి వస్తుందా లేదా ఏదీ పాలుపోని అగాథం లో కూరుకుపోయిన అతని నిస్సహాయత. బోల్డ్ సీన్ లు ఉండడమో, బూతుల అరుపులో, యూత్ ఏజ్ లో యాటిట్యూడ్ ఇవన్నీ అర్జున్ రెడ్డి చిత్రం మెయిన్ పాయింట్స్ కానే కాదు. అంతటి నిస్సహాయత లో కూడా అర్జున్అ ఇంకా బతికి ఉండడానికి కారణం ఆమె నాయనమ్మ చెప్పిన కథలో దొరుకుతుంది. హోప్ ఈజ్ గుడ్ అంటూ చిన్నతనం లోనే పుస్తకం లో అండర్ లైన్ చేసుకున్న అర్జున్ ఆ హాప్ తోనే ఆమెకోసం ఉండిపోయాడు కామోసు. అర్జున్ రెడ్డి సినిమా ప్రధానంగా రెండే రెండు అంశాల గురించి మాట్లాడుతుంది ఒకటి 'నిస్సహాయత' 'రెండోది' సెక్స్' .

నిజానికి సెక్స్ అందరికీ బూతు పదంగానే తెలుసు చిన్నపుడు మనకి ఆ పదం అలవాటు అయ్యింది కూడా అలాగే మరి. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ని అడ్డం పెట్టుకుని సందీప్ రెడ్డి చెప్పదలచుకున్న విషయం ఒకే ఒక్కటి ' ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి వారితో పక్క పంచుకుని అందులోని అసలైన మాధుర్యాన్ని అనుభవించిన ఏ వ్యక్తీ ఆ ప్రేమించిన వ్యక్తిని ఎలాంటి పరిస్థితి లో వదులుకొలేడు/వదులుకోలేదు' అని. ఈ విషయాన్ని ఆయన తెర ఎత్తిన వెంటనే చెప్పేసాడు .. " ఇది అనంత దూరాల సుదీర్ఘ మైదానం .. ఇక్కడ సముద్ర గర్భం లో అలికిడి అయితే.. ఆకాశ అంచులలో వినిపించేంత నిశబ్దం . ఈ స్వచ్చమైన నిశబ్దాన్ని తాకిన మనసుల్ని .. పరిస్థితులు, విపత్తులు, కాలం, దూరం ఇవేవీ వేరు చెయ్యలేవు . ఎందుకంటే ఇవి రెండు శరీరాలు గా కనిపించినా . ప్రాణం మాత్రం ఒక్కటే" అన్నాడు సందీప్. ప్రేమించిన మనిషి తో సెక్స్ ని ఒక అద్భుత అనుభూతి గా, జీవితాన్ని నిర్దేశించే ఒక క్రియ గా డైరెక్టర్ ఓపెనింగ్ సీన్ లోనే డిఫైన్ చేసి పడేసాడు. సెన్సార్ మ్యూట్ చేసింది కానీ ఐదు వందల నలభై తొమ్మిది, ఐదువందల యాభై అంటూ సెక్స్ ని కౌంట్ కూడా చేసుకుని మురిసిపోతుంది ఈ జంట.

సెక్స్, ప్రేమ రెండూ ఈ రోజుల్లో కృత్రిమ వస్తువులు గా మారిపోతున్న నేపధ్యం లో అర్జున్ రెడ్డి మనందరికీ చాలా పెద్ద కేస్ స్టడీ .. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ లేదు, సెక్స్ కోసమే ఎఫైర్ లు లాంటి సోది వాగుళ్ళ కి ఈ సినిమా పెద్ద చెక్.

ఈ సందర్భంగా క్లైమాక్స్ సీన్ మీద కూడా ఒక్కసారి విశ్లేషణ చూస్తే .. అందరూ ప్రీతీ ఇక అర్జున్ జీవితంలోకి రానేరాదు అనుకున్నారు .. అయితే డైరెక్టర్ ఐడియా వేరేలా ఉంది అబ్బాయి వెర్షన్ ని మాత్రం హై లైట్ చేస్తూ అమ్మాయిలు మోసం చేసో మరోలానో వాళ్ళ జీవితాల్లోంచి వెళ్ళిపోతారు అనే పాయింట్ ని అతను ఒప్పుకున్నట్టు లేడు . వాళ్ళలో కూడా అర్జున్ రెడ్డి లు ఉంటారు అని చూపిస్తూ తొమ్మిది నెలలు గా నెలల కడుపు తో ప్రీతీ అర్జున్ కోసం ఎదురు చూడడం చూపించాడు డైరెక్టర్. పంటికింద నొప్పి ని, కన్నీళ్ళనీ భరించిన ప్రీతి ఈ చర్య తో అతనిలోని కోపాన్ని శాశ్వతంగా దూరం చెయ్యాలి అనీ, అది పోకుండా అతను ఆమెదగ్గరకి వస్తే వృధా అనుకుంది .. భర్తని వదిలేసిన వెంటనే పరిగెత్తుకుని అర్జున్ దగ్గరకి వెళ్ళాల్సిన ఆమె అలా చెయ్యకపోవడానికి అతని కారణమే ప్రధాన కారణం . వారు విడిపోవడానికి కారణమైన కోపం మళ్ళీ తమ జీవితాలలోకి రాకూడదు అని ఆమె అలా బతకడం మొదలు పెట్టింది. సినిమా ఆఖరి ఘట్టం లో ' వాడిని నా లిటిల్ ఫింగర్ కూడా ముట్టుకోనివ్వలేదు .. నా used clothes కూడా వాడు టచ్ చెయ్యలేదు ' అన్ని ఆమె చెప్తుంటే ఇలాంటి అమ్మాయి కోసం అర్జున్ అలా అవ్వడం లో తప్పు లేనేలేదు అనిపిస్తుంది. బంగారం మా ప్రీతీ శెట్టి సారీ ప్రీతీ రెడ్డి ..

ఇలాంటి స్టోరీ ఇలా ప్రేమకోసం పరితపించే క్యారెక్టర్ లు తెరమీద మాత్రమే ఉంటాయి అనీ నిజ జీవితం లో ఎక్కడా కనపడవు అని మూర్ఖంగా మాట్లాడేవారిని ఎవ్వరూ కాపాడలేరు. ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తి కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మాయిలు , అబ్బాయిలు మన జేనేరేషన్ లోనే బోలెడంత మంది ఉన్నారు . మనకి తెలిసినవాళ్లలో ఎందఱో కనిపిస్తారు . నిన్నూ నన్నూ అంత ప్రాణం గా ప్రేమించే వ్యక్తి లేరు అన్నంత మాత్రాన అలా మాట్లాడడం అర్ధం లేని వ్యవహారం . నిన్ను నన్ను ఎవరో మోసం చేసారు అంటే అది మన చాయిస్ తప్పు మాత్రమే తప్ప ప్రేమ తప్పు కాదు .. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే నా దృష్టి లో అర్జున్ రెడ్డి సినిమా యాటిట్యూడ్ గురించో, కోపం గురించో , బ్రేక్ అప్ గురించో కాదు .. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసు పెట్టి చూస్తే ఇంకొక ఆసక్తికర లేయర్ ని డైరెక్టర్ సందీప్ రెడ్డి పొందుపరిచాడు . అందులో ఎవ్వరూ టచ్ చెయ్యని 'సెక్స' అనే పాయింట్ ని చాలా అందంగా చూపించాడు . ప్రేమించిన వ్యక్తి తో ఇష్టంగా సెక్స్ చెయ్యడం కంటే కనక్ట్ అయ్యే చర్య ఏదీ లేనేలేదు అని అతను తేల్చేసాడు.. మన చుట్టూరా ఉన్న ఎందరో సిన్సియర్ అర్జున్ రెడ్డి లకి ప్రీతీ రెడ్డి లకీ ఈ సినిమా అంకితం ఇచ్చాడు డైరెక్టర్ .. సినిమాలో అంకితం ఇచ్చినట్టు ఎక్కడా లేదు కదా అంటారా? .. సముద్ర గర్భం లో అలికిడి అయితే .. ఆకాశ అంచులలో వినిపించేంత నిశబ్దం అన్నాడు కదా ఈ సారి మీరు ఆ నిశ్శబ్దం లో ఉన్నప్పుడు ఈ సినిమా గుర్తు తెచ్చుకోండి మీకే అర్ధం అవుతుంది .