అన్నిరంగాలలో కొత్త టెక్నాలజీ వస్తున్నట్టు వ్యవసాయ రంగంలో కూడా కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఎంతోమేలు మన రైతులకు జరుగుతుందని అనుకుంటాం కాని ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా విత్తనం మట్టిలోనే నాటాలి ఆహారంగా నీటినే, సేంద్రీయ ఎరువులనే అందించాలి. త్వరగా పెరగాలని చెప్పి ప్రమాదకరమైన పెస్టిసైడ్స్ వాడుతున్నారు దీని వల్ల ఆహారంలో పోషకాల కన్నా పెస్టిసైడ్స్ కారకాలే ఎక్కువ ఉండడం వల్ల రైతుకు మంచి ధరే కాదు వినియోగదారునికి అనారోగ్యం కూడా వచ్చేస్తుంది. అందుకే టెక్నాలజీలో ఎన్ని చేంజెస్ వచ్చినా నాడు మన పూర్వీకులు అనుసరించిన పద్దతులే గొప్పవని గుర్తించి అటువైపుగా అడుగులు వేస్తున్నాం. సైంటిస్ట్స్ సేంద్రీయ వ్యవసాయమే గొప్పదని చెబుతున్నా గాని భయం, అవగాహన లేమితో ఇప్పటికి రైతులు పెస్టిసైడ్స్ విపరీతంగా వాడేస్తున్నారు ఇది రైతులకే కాదు ప్రపంచానికి ఎంతో ముప్పు ఉంటుంది. అరణ్య పర్మా అగ్రికల్చర్ సంస్థ (http://permacultureindia.org/) వారు ఇదే విషయం మీద దగ్గరుండి రైతులకు ఎంతో అవగాహన ఇస్తున్నారు.
నరసన్న కుప్పల, పద్మ కుప్పల గారు డెక్కన్ డెవలెప్మెంట్ సొసైటిలో 12 సంవత్సరాలు పనిచేశారు.. ఈ విలువైన సమయంలో రైతులతో కలిసి పనిచేయడం వల్ల సమస్యలను తెలుసుకుని పరిష్కారాలు కనుగొనే అవకాశం లభించింది. "నా ఉద్యోగం నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు తెలిసిన నిజాన్ని నాతోనే అంతమయ్య ప్రమాదం ఉంది". రైతులను సేంద్రీయ వ్యవసాయ (Organic Farming) పద్దతుల మీద మరింత ఛైతన్యం తీసుకురావాలని చెప్పి 1999లో అరణ్య పర్మా అగ్రికల్చర్ సంస్థను ప్రారంభించారు.
1978లో ఈ శాశ్విత వ్యవసాయం(పర్మా కల్చర్) ప్రారంభించారు. భూమి ఆరోగ్యాన్ని సరిదిద్దకుండా మనుషుల ఆరోగ్యాన్ని నువ్వు సరిదిద్దలేవు అనే ప్రధాన అంశం మీదనే ఈ వ్యవసాయం జరుగుతుంది. అది అడవిలో కానివ్వండి, రైతుల వ్యవసాయ భూమిలో కానివ్వండి, ఎవ్వరూ ఉపయోగించని బీడు భూమిలో కానివ్వండి ఎక్కడ చేసినా కాని జీవులకు ఏ హాని కలుగ కుండా చేయడమే ఈ వ్యవసాయ ప్రత్యేకత. పెస్టిసైడ్స్ వల్ల పంటను ఆశించే చీడ పురుగులు మాత్రమే కాదు పంటకు ఉపయోగపడే వానపాములు లాంటి ఉపయోగకర జీవులు మరణిస్తున్నాయి.
పైకి పంటకనిపిస్తుంది కాని అది సమాది మీద మొలిచే మొక్కలు లాంటివే. ఈ అరణ్య పర్మా అగ్రికల్చర్ వారు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో పర్యటించి రైతులకు దగ్గరునుండి వారితో విత్తనాలు వేయించి పూర్తి పంట చేతికొచ్చేంత వరకు వారికి అన్ని విధాల అండగా ఉంటారు. వీరు అవగాహన కల్పించిన ప్రముఖ ప్రాంతాలలో జహీరబాద్ ఫామ్ మాత్రం ప్రత్యేకమైనది. అక్కడ స్ధానిక రైతులతో మాట్లాడి చేసిన వ్యవసాయం మంచి ఫలితాలను రాబట్టింది.