This Man Finds A Stranger Lying On Road With Suitcase. What Happens Next Is A Thrilling Mystery

Updated on
This Man Finds A Stranger Lying On Road With Suitcase. What Happens Next Is A Thrilling Mystery

Contributed By Bharath Dhulipalla

EPISODE 1 - IN SINGLE LINE ఒక సైకో ఒక అడవి లో తిరుగుతూ మనుషులను చంపుతున్నాడు

EPISODE 2 కొన్ని రోజుల తర్వాత .......... ఉరికొన అడవి స్వాగతం బోర్డు దగ్గర కొంత మంది కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. అది చాలా పెద్ద అడవి. చాలా అందంగా ఉంటుంది.ఉప్పుటూరు జిల్లా లో ఉన్న ఆ అందమైన అడవి గురించి చాలా మంది విన్నారు.అక్కడ ఉన్న జలపాతాలకి, కొండలకి, లోయలకి ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.అక్కడికి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు కానీ ఎవరు వెళ్ళటానికి సాహసం చెయ్యరు ఎందుకంటే ఆ అడవికి మీద ఒక అపోహ ఉంది, అక్కడ దెయ్యాలు ఉంటాయని ఎవరైనా వెళ్తే చనిపోవటమే కానీ తిరిగి రారు అని. ఇవన్నీ పట్టించుకోకుండా ఆ అడవి స్వాగతం బోర్డు దగ్గర గుడారం వేసుకొని , కొంత మంది కొన్ని తెల్లటి పేపర్లను లెక్కపెడుతున్నారు , కొంత మంది ఎవరికో ఫోను చేస్తూ ఎప్పుడు బయలుదేరతారో అని అడుగుతూ వాళ్ళు చెప్పిన టైంని బట్టి ఆ టైం ఒక పేపర్ లో ఆ వ్యక్తి పేరు ఎదురుగా రాసుకుంటున్నారు. గుడారం లోపల కూర్చొన్న కొంత మంది ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీలకి ఫోన్ చేస్తున్నారు, మిగిలినవాళ్ళకి ఎవరిదగ్గరినుందో ఫోన్లు వస్తుంటే వాటికీ "ఇంకొక అరగంట లో అక్కడ ఉంటాడు సర్ మీకు ఇప్పుడే అతని నెంబర్ మెసేజ్ చేస్తాను"అని , "మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచేస్తున్నారా మంచిది సర్, మీ పేరు " అని సమాధానం చెప్పి వాళ్ళ పేర్లు రాసుకుందామని స్వాగతం బోర్డు పక్కన ఉన్న దగ్గరకి వెళ్తున్నారు. అప్పుడే ఆ బోర్డు పక్క నుండి ఒక పాత పోలీస్ జీప్ వెళ్తుంది.అందులో వెళ్తున్నాడు ఎస్.ఐ ఆదిత్య. ఆదిత్య 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉండి ఒక మిలిటరీ మనిషి ల కనిపిస్తాడు చూడటానికి. అతను ఎదో ఆలోచిస్తూ గుర్తు చేసుకున్నాడు ఎందుకు ఆ ఊరికి వస్తున్నాడో....

*****************flashback ******************

ఒక ఆఫీస్ రూమ్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు ఫైల్ చూస్తున్నారు . సడన్ గా ఒక వ్యక్తి " MAY I COME IN SIR ? " అన్నాడు ఆ రూమ్ డోర్ దగ్గర నుల్చొని .ఆ సీనియర్ ఆఫీసర్ దానికి ఆఫీసర్ : come in ఆది ఆదిత్య డోర్ నుండి నడుచుకొని వచ్చి వూఫీసర్ కి సెల్యూట్ చేసాడు .ఆఫీసర్ ఆదిత్య ని కూర్చోమని చేతితో సైగ చేస్తూ చెప్పాడు.ఆదిత్య "థాంక్యూ సర్ " అని చెప్పి కూర్చొన్నాడు. ఆదిత్య: సర్ రమ్మని చెప్పారంట.... ఆఫీసర్: ఎస్ ఆది అని చెప్పి ఒక ఫైల్ ఆదిత్య కి ఇచ్చి ఆఫీసర్ : ఇది చూడు ఆదిత్య ఆ ఫైల్ వైపు చూసాడు దాని మీద " UNKNOWN PSYCHO " అని ఉంది . ఆదిత్య ఆ ఫైల్ కి కట్టిన ముడి తీసి లోపల ఒక్కొక్క పేపర్ చూస్తున్నాడు .అవి చూస్తున్నప్పుడు ఆ ఆఫీసర్ .... " ఈ కేసు నువ్వే take up చెయ్యాలి .నువ్వు ఎన్నో రోజుల నుండి ప్రమోషన్ అడుగుతున్నావు కదా నువ్వు ఈ కేసు solve చేస్తే నీ ప్రమోషన్ నీ టేబుల్ మీద ఉంటుంది " అన్నాడు .ఆదిత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది

*****************flashback ******************

డ్రైవ్ చేస్తున్న ఆదిత్య తన ఎడమ వైపు సీట్ మీద ఫోన్ ని తీసుకొని ఆదిత్య : హలో UNKNOWN : హలో సర్ ఆదిత్య : సాంబయ్య చెప్పు సాంబయ్య : సర్ మిమ్మల్ని కలవడానికి జోసెఫ్ అని ఎవరో వచ్చారు సర్ ఆదిత్య : సరే అతన్ని ఆ ఇంట్రాగేషన్ రూమ్ లో ఉండమని చెప్పండి . నేను ఒక 15 నిమిషాల్లో వస్తాను. సాంబయ్య : సరే సర్ ఆదిత్య : మ్.... అని ఫోన్ కట్ చేసి పక్కన సీట్ మీద ఫోన్ పడేస్తాడు. అలా పడినప్పుడు అతనికి ఆ ఫోన్ పక్కనే ఉన్న అతని సీనియర్ ఆఫీసర్ ఇచ్చిన " UNKNOWN PSYCHO " ఫైల్ కనిపించి దాన్ని చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక కార్ వచ్చి జీప్ చివరికి ని గుద్దింది.కార్ ముందు లైట్ మరియు జీప్ ముందు లైట్ రెండు పగిలిపోయాయి.ఆదిత్య తల జీప్ స్టీరింగ్ మీద ఉంచి "ఆ .. " అనుకుంటూ తల పైకి లేపి అద్దంలో తన తల చూసుకుంటున్నాడు . తన తల నుదిటిమీద కనుబొమ్మ పైన చిన్న దెబ్బ , కార్ వచ్చి జీపు ని గుద్దినప్పుడు ఆదిత్య ముందుకి రావటం వాళ్ళ ముందున్న చిన్న కర్ర ఒకటి తలకి తగిలింది. అద్దం లో చూసుకుంటున్న ఆదిత్య తనని గుద్దిన ఆ వైట్ అంబాసడర్ ని అద్దం లో చూసి జీప్ దిగి ఆ కార్ దగ్గరికి నడిచాడు.కార్ దగ్గరికి వెళ్లి ఆ కార్ డ్రైవర్ తో " రేయ్ ఎటు చూస్తూ డ్రైవ్ చేస్తున్నావ్ రా " అన్నాడు. ఆ కార్ డ్రైవర్ " సర్ అది ఏమైందంటే ... " అని చెప్పబోతుంటే , ఆ కార్ వెనక కూర్చొన్న భార్య భర్తలు లో భర్త " మా కార్ కి ఇంకో కార్ ఎదురు రావటం వల్ల దాని నుండి తప్పించుకునే ప్రయత్నం లో మీ జీప్ ఎదురు వచ్చింది . WE ARE EXTREMELY SORRY SIR " అని చెప్పాడు. ఆదిత్య : OK NO PROBLEM . భర్త : మీ జీప్ ఎంత బాగు చెయ్యడానికి ఎంత అవుతుందో చెప్తే మేము ఇస్తాము. ఆదిత్య : అవసరం లేదు చిన్నదే నేను చూసుకుంటాను . ఎక్కడికో వెళ్తునట్టున్నారు భర్త : అవును ఇక్కడి దగ్గర్లో TREASURE HUNT ఉంది అక్కడికి వెళ్తున్నాం సరదాగా ఆదిత్య : ఓ.. అల్ ది బెస్ట్ ఆ ప్రైజ్ మనీ మీకే రావాలని కోరుకుంటున్నాను భర్త : THANK YOU FOR YOUR WISH ఆదిత్య తల నిలువుగా ఊపి అక్కడినుండి తన జీప్ వైపు కి కదిలాడు ఆదిత్య వెళ్లాడని గమనించిన ఆ కార్ లో ఉన్న వ్యక్తి భార్య ఆ భర్త తో "ఎదో దాన కర్ణుడి లా మీరు పెట్టుకుంటానని అంటున్నారు మీకంత పెట్టాలని అనిపిస్తే నాకు బంగారం కొని పెట్టండి ఆ తరువాత ఊర్లో అందరికి ఇద్దురు గని " అని అంటుంది కార్ దగ్గర నుల్చొని ఇది అంత విన్న ఆదిత్య నవ్వుకుంటూ తన కార్ దగ్గరికి వెళ్తున్నాడు .

****************************************************************************************

ఒక వీధి చివర ఒక అమ్మాయి నుల్చొని తన ఫోన్ లో టైం చూసుకుంటూ వెయిట్ చేస్తుంది.అంతలో ఒక అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి తో " సారీ ఆషా కొంచెం లేట్ ఐంది ". ఆషా : కొంచెం లేట్ ఆ సత్య . last 15 minutes నుండి నేను బస్సు నీ కోసమే వెయిట్ చేస్తున్నాం సత్య: నీకు, బస్సు కి, బస్సు లో ఉన్న అందరికి సారీ ఒకే నా ఆషా: కొంచెం కూడా టెన్షన్ లేదు . గుర్తుపెట్టుకో ఈ ప్రైజ్ మనీ గెలవకపోతే మనకి పెళ్లి అవ్వదు ఆలా నడుస్తున్న సత్య ఒక్కసారి ఆగి "నాకు అంత గుర్తు ఉంది . ఖచ్చితంగా ప్రైజ్ మనీ తోనే వస్తాం . నన్ను నమ్ము " అని ఇద్దరు బస్సు ఎక్కుతారు . బస్సు అక్కడి నుండి బయలుదేరి ఇంకొక చోటికి వచ్చింది అక్కడ బస్సు స్టాప్ లో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉన్నారు . అబ్బాయి కాస్త టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు . అమ్మాయి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు వస్తుందా అని .అప్పుడే బస్సు రావటం గమనించిన ఇద్దరు ఇద్దరు మొహాలు చూసుకొని వెళ్దాం అన్నట్టు సైగ చేసుకొని వాళ్ళతో తెచ్చుకున్న బాగ్ తీసుకొని స్టార్ట్ అవుతారు .ఇద్దరు ఎక్కుతున్నప్పుడు ఒక వ్యక్తి " రాజీవ్ " అని అరుస్తున్నాడు . బస్సు ఎక్కుతున్న రాజీవ్ వెనక్కి తిరుగుతూ ఆ పిలిచిన వ్యక్తి తన ఫ్రెండ్ అని గమనించి ఆ అమ్మాయితో " ఐశ్వర్య నువ్వు వెళ్లి కూర్చో నేను 2 నిమిషాల్లో వస్తాను " అన్నాడు .ఐశ్వర్య అలాగే అన్నట్టు తల ఊపి లోపలకి వెళ్తుంది . రాజీవ్ కిందకి దిగి తన ఫ్రెండ్ తో " ఏంటిరా అరుణ్ " అన్నాడు .అరుణ్ దానికి "నేను నిన్న చెప్పింది గుర్తుంది కదా నువ్వు వచ్చేటప్పుడు మంచి న్యూస్ తో రావాలి.నా బదులు నిన్ను పంపిస్తుంది అందుకే . ఓకే ? " అంటాడు . రాజీవ్ దానికి తల ఊపి అర్ధం అయినట్టు చెప్తాడు. "సరే వెల్లు జాగ్రత్త" అని చెప్పి బస్సు ఎక్కమన్నట్టు సైగ చేసాడు అరుణ్ . రాజీవ్ బస్సు ఎక్కి ఐశ్వర్య పక్కన కూర్చొన్నాడు . బస్సు విండో లో నుండి ఐశ్వర్య అరుణ్ కి "bye " అంటుంది. అరుణ్ దానికి సమాధానం గా "హ్యాపీ జర్నీ " అంటాడు . బస్సు అక్కడి నుండి బయలుదేరింది . బస్సు లో ఉన్న డ్రైవర్ తన పక్కనే ఉన్న ఇంకో బస్సు ATTENDANCE తీసుకునే వ్యక్తి తో "అందరు వచ్చారా" అని అడుగుతాడు . దానికి సమాధానం గా ఆ వ్యక్తి "అందరు వచ్చినట్టే చలో ఉరికొన " అంటాడు గట్టిగా . బస్సు లో ఉన్న వాళ్ళు కూడా "చలో చలో " అంటూ ఆనందం గా అరుస్తున్నారు . (ఇంకా ఉంది )