The Second Episode Of 'Antharmadhanam' Is Here And It Will Remind You The Situations In Home!

Updated on
The Second Episode Of 'Antharmadhanam' Is Here And It Will Remind You The Situations In Home!

Click here to view Episode 1 Contributed by Bharadwaj Godavarthi

పేపర్ స్లయిడింగ్ (With narrator, His Imaginary Friend(ఒంటరితనం), narrator started writing)

Date: 08/05/1990 Time: 4:30 pm Channel: Doordarshan.

"జూమ్ తననం తననం...జూమ్ తననం తననం". (TV Serial Title Song Playing)

Narrator: అమ్మా, క్రికెట్ ఆడుకోడానికి వెళ్తానే?

"వాసంత సమీరంలా.. నును వెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా.. అరవిచ్చిన లాస్యంలా…" (TV Serial Title Song Playing)

Narrator: అమ్మా, వెళ్తానమ్మా?

"ఒక శ్రావణ మేఘంలా… ఒక శ్రావణ మేఘంలా… శిరశ్చంద్రికల కలలా…"(TV Serial Title Song Playing)

Narrator: చెప్పమ్మా?

"హేమంత తుషారంలా… నవశిశిర తరంగంలా…"(TV Serial Title Song Playing)

అమ్మ: అబ్బా, ఏంట్రా నీ గోల? చిన్నముల్లు '6' మీదికి వచ్చేసరికి హోంవర్క్ 'స్టార్ట్' చేయకపోతే కాలు విరకొట్టేస్తా, చెప్తున్నా. 'పో'!! నెమ్మదిగా వెళ్ళరా, జాగ్రత్త!

"కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో… కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…" (TV Serial Title Song Playing)

Present - 2018 (With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

ఏంటీ? లేదు, ఇప్పటికి నువ్వింకా నాలో పుట్టలేదు. నీ ఎంట్రీకి ఇంకా కొంచం టైం ఉంది. కాసేపు వెయిట్ చేయి!

పేపర్ స్లయిడింగ్(Started writing again)

"సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం… సాగే జీవనగానం.. అణువణువున ఋతురాగం…"(TV Serial Title Song Playing)

Catch.........Catch Half Run ---Half Run Cheating........ Cheating.. (Bunch of children playing outside, Chaos by children)

రేయ్, నేను కూడా మీతో ఆడుతా! నన్ను మీ టీంలో జాయిన్ చేసుకోండి.

Kid from Bunch: "పోరా, నీకు క్రికెట్ ఆడడమే రాదు, నువ్వుంటే మా టీం ఓడిపోతుంది, వెళ్లి అక్కడ నుంచో బాల్ వచ్చినప్పుడు మాకు అంది."

Present - 2018(With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

లేదు, ఇక్కడ కూడా నువ్వు పుట్టలేదు! నిజమే, ఇక్కడ పుట్టే స్కోప్ చాలా ఉంది. కానీ ఎందుకో, ఇక్కడ నువ్వు నాలో పుట్టలేదు!

"బాల్...బాల్ "ఓహ్ --ఫోర్"(Chaos by children)

Kid from Bunch: ఛ! ఏంట్రా నువ్వు. బాల్ పట్టుకోడం కూడా చేత కాదు, నీకెందుకురా క్రికెట్!! పో, పోయి ఆంటీతో పాటు 'ఋతురాగాలు' చూసుకో.

Present - 2018(With narrator, His Imaginary Friend(ఒంటరితనం)) హే, ఏంటి నీ ఎదవ నస? ఊరికే నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వొచ్చినప్పుడు నేనే పిలిచి చెప్తాను, అప్పటిదాకా ఎవరి దెగ్గరికైనా కాసేపు వెళ్ళిరా.

పేపర్ స్లయిడింగ్(Started writing again)

"Sundrop super refined sunflower oil the healthy oil for healthy people"(Ad Playing in between)

అమ్మ: ఏంట్రా, అప్పుడే వచ్చేసావు?

"సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…"(TV Serial Title Song Playing after Break)

అమ్మ: సరే, ఒక నిమిషం ఆగు. సీరియల్ అవ్వగానే నీకేమైనా చేసి పెడతాను.

Present - 2018(With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంకా నాలో పుట్టలేదు! నువ్వచినప్పుడు నేనే పిలుస్తా అని చెప్పాను కదా! కాసేపు నన్ను వదిలేయ్, ప్లీజ్. అర్ధం చేసుకో!

"వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా"(TV Serial End Titles)

------*తరువాయి భాగం, వచ్చేవారం*--------

(TV Switched Off )

అమ్మ; నాన్న, ఎక్కడ ఉన్నావు? నీ కిష్టమని టమాటా పచ్చడి కలిపి పెట్టానురా, తినేసి హోంవర్క్ చేసుకో.

Present - 2018(With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

ఓయ్, ఎక్కడ ఉన్నావు? ఇప్పటి దాకా పక్కనే ఉంది, కరెక్ట్ గా నీ ఎంట్రీ వచ్చే టైంకి ఎక్కడికో వెళ్ళిపోయావు? రా, చూడు ఇదిగో నీ ఎంట్రీ!

పేపర్ స్లయిడింగ్(Started writing again)

అమ్మ: ఇంకా తినలేదా? ఏమైంది అలా ఉన్నావు? ఏమైనా అన్నారా మీ స్నేహితులు? Narrator: "లేదమ్మా, ఏమి అనలేదు." అమ్మ: మరి, ఎందుకు ఆలా ఉన్నావు? చెప్పు, ఏమైందో? Narrator: నాకు ఆడడం రాదు అని ఆటలో చేర్చుకోలేదు, పోయి సీరియల్ చూసుకో అని వెక్కిరించారు! అమ్మ: అవునా! ఏ నాన్న, నువ్వు బాగానే ఆడుతావు కదా! ఇంట్లో ఒక్కడివే ఆడుకునేటప్పుడు, నాన్నతో ఆడేటప్పుడు బాగానే ఆడుతావు కదా. అక్కడ ఎందుకు సరిగ్గా ఆడలేదు. Narrator: ఏమో! నాకేంటో అదోలా ఉంటుంది, అంతమందిని చూస్తే! ఒక్కడినే ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు? అమ్మ: అందుకే, అందరితో కలవమని చెప్పేది నిన్ను. కలిస్తే ఇలా ఇంకొకరు నిన్ను ఎగతాళి చేయరు కదా.

Present - 2018(With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

ఇదిగో, సరిగ్గా ఇక్కడ నువ్వు పుట్టావు!! సరిగ్గా ఇక్కడే, ఈ సంధర్భంలోనే!! "ఆడపిల్ల పేగుకు అప్పుడే అంటుకున్న బంధంలా, నా పేగుకు ఆ క్షణం నువ్వు అంటుకున్నావు" ఆలా బిత్తర చూపులు చూస్తావేంటి, అర్ధంకాలేదా?

అప్పటిదాకా 'అమ్మ, నాన్న, వాళ్ళ ప్రేమ, ఆడుకోడం, సంతోషం' మాత్రమే తెలిసిన నాకు, ఎందుకో ఆ రోజు మొదటిసారి నలుగురితో కలిసినప్పుడు నాకు కలిగే ఇబ్బంది పట్ల నాకు అవగాహన ఏర్పడడం మొదలైంది. ఆలా ఏర్పడడం వల్లనేమో, తరువాత ఎవరినైనా కలవాలని ప్రయత్నించిన ప్రతిసారి, నా unconscious మెమోరీలో రిజిస్టర్ అయిపోయిన "ఇబ్బంది" బయటకు వచ్చి నన్ను బిగుసుకు పోయేలా చేసేది. నెమ్మదిగా నా చుట్టూ ఉన్న సమాజం కూడా నేనో 'సిగ్గరిని' అని, 'మూడి ఫెలో' అని నా మీద ముద్ర వేసేసింది!!

ఆ వలయం నుండి ఎన్నిసార్లు బయటపడాలని చూసినా, నా చుట్టూ ఉన్న సమాజం మాత్రం "నువ్వో సిగ్గరివి హవ్వ ఆలా ఎలా మారిపోతావు, అని తొడపాశం పెట్టిమరీ నన్ను కూర్చోపెట్టింది"

ఇలా నువ్వు పుట్టటం జరిగింది. తల్లి 'నవమాసాలు' మాత్రమే తన బిడ్డని మోస్తుంది, నిన్ను మాత్రం నేను గత 'ఇరవైఐదేళ్లగా' మోస్తూనే ఉన్నాను.

ఏంటీ?? అవును, ఇరవైఐదేళ్లగా నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు! మగతలో కూడా!

ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు. ఒక్కసారి మాత్రం నిన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది??

కానీ అది కూడా ఒక పెద్ద కథ, నా జీవితంలో అది కూడా ఒక సెపెరేట్ చాప్టర్.

పేపర్ స్లయిడింగ్(Started writing again)

Chapter 2 : "సిరికుందన రాగం" ----------To Be Continued----------