Watched 'Ante Sundaraniki' Teaser & Wondering What The Pravara In It Means? Here's The Actual Meaning Behind It

Updated on
Watched 'Ante Sundaraniki' Teaser & Wondering What The Pravara In It Means? Here's The Actual Meaning Behind It

Aparichitudu cinemaa enni saarlu chusaaru. Aa movie lo Nandini vaalla parents ki Raman love letter icche scene gurthundhaa.. Aa time lo manodu sanskrit konni maatalu cheppi, letter isthaadu kadha.. vaatine PRAVARA antaaru.

https://youtu.be/myRkJDtcAD8?t=126

Pravara cheppadam ante manalni manam introduce cheskovadam (Yes, Exactly tell me about yourself ante english lo em chepthaamo, adhe sanskrit lo chepthe Pravara antaaru)

భద్రాచలం లో శ్రీరాముల కళ్యాణం, తిరుపతి లో శ్రీనివాస కళ్యాణం చెప్పేటప్పుడు కూడా ప్రవర చెప్తారు.

https://youtu.be/OuWqd1zVlK0

Poorvam, desam mottam paryatinche rushulu , gurukulam lo unde vidyani abhyasinche vidhyaarthulu, biksha yaatana chesetappudu pravara cheppevaaru. So, vaallu evaru, ey guruvu daggara abhyasisthunnaru, evari pillalu ee vivaraalu avathali vaariki telusthaay ani. Ala oka tradition ga vasthu undhi..

Odugu (Thread function) ayyi, roju sandhyavandanam cheskune vaallaki ki ee pravara cheppadam chaala mamulu vishayam.

Recent ga release ayina Ante Sundaraniki Zeroth look lo Nani Pravara chepthu introduce cheskuntaaru. Aa pravara meaning enti ani interest unna vaallaki kindha explain chesthunna annamataa..

https://youtu.be/Ot64eD0OST8

ప్రవర:
చతుస్సాగర పర్యంతం
గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
హరిత అంబరీష యవ్వనాస్య త్రయాఋషేయ ప్రవరాన్విత..
హరితస గోత్రః
ఆపస్తంభ సూత్రః శ్రీ కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ నామధేయ
అహంభో అభివాదయే..

అర్థం:
చతుస్సాగర పర్యంతం -
నాలుగు దిక్కులయందు విస్తరించి ఉన్న సముద్రాల వరకు

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు -
గోవులకు, వేదాలని పాటించే బ్రాహ్మణులకు తద్వారా సర్వ మనుషులకి శుభం కలగాలి అని ఆసిస్తూ..

హరిత అంబరీష యవ్వనాస్యత్రయాఋషేయ ప్రవరాన్విత -
హరిత, అంబరీష, యవ్వనాస్య అను ఈ మూడు ఋషులను మా పూర్వికులుగా కలవాడినై
(ఒక్కో గోత్రం కి ఋషులు మారుతూ ఉంటారు, కొన్ని గోత్రాలకి ఒకరే ఋషి ఉంటారు, కొన్ని గోత్రాలకి ఇద్దరు ఉంటారు)

హరితస గోత్రః
హరిత అనే ఋషి మూలపురుషుడైన స (మంచి) గోత్రం (గోత్రం లో గో అనే అక్షరం గురువు ని ప్రతిబింబిస్తుంది) లో పుట్టినవాడినై

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
ఆపస్తంభ సూత్రాన్ని అనుసరిస్తూ.. శ్రీకృష్ణ యజుర్వేదాన్ని (నాలుగు వేదాలు ఉంటాయి. అందులో యజుర్వేదం ఒకటి, ఆ వేదం లో కృష్ణ యజుర్వేదం అభ్యసిస్తూ.. (పూర్వికులు ఏ వేదం అభ్యసిస్తారో ఆ వేదం పేరు చెప్పాలి)

కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ నామధేయ
(అంటే సుందరానికి లో నాని పేరు, అక్కడ మన పేరు చెప్పాలి ) అనే నామం తో పిలవబడే నేను..

అహంభో అభివాదయే..
ఇప్పుడు మీకు అభివాదం (నమస్కరిస్తున్నాను) చేస్తున్నాను..

Idhi Bammalani, Thathalni adigi pravara gurinchi nenu telusukunna meaning.. Meeku interest mee grand parents adigi telusukondi.

Itlu..
చతుస్సాగర పర్యంతం
గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
హరిత అంబరీష యవ్వనాస్య త్రయాఋషేయ ప్రవరాన్విత..
హరితస గోత్రః
ఆపస్తంభ సూత్రః శ్రీ కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
కవులూరి శ్రీ వెంకట శివనాగ వర భాస్కర కృష్ణ మాధవ సాయి జస్వంత్
అహంభో అభివాదయే..