కొండా అనింధిత్ రెడ్డి.. వయసు 28 సంవత్సరాలు మన తెలంగాణ కుర్రాడే. రేసింగ్ అంటే మహా పిచ్చి. చాలామంది స్పోర్ట్స్ కార్లను వీడియో గేమ్ లో ఆడుకుంటే మనోడు మాత్రం ట్రాక్ మీద ఫార్ములా -3, ఫార్ములా-4 కార్లను నడుపుతూ వివిధ టోర్నీలలో ఛాంపియన్ గా నిలిచాడు. 2017 సంవత్సరానికి గాను federation of motar sports club of India నుండి "నేషనల్ మోటార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్" గా ఎంపికయ్యాడు కూడా. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే ప్రయోజికుడు అని అనే వారు కాని ఇప్పుడు పరిస్థితులు అలా లేవు, ప్రపంచం మారిపోయింది. మనకు నచ్చింది చేసేయోచ్చు అవకాశాలు కూడా బోలెడున్నాయి.
figure>ఇందాకనే చెప్పుకున్నాం కదా అనింధిత్ కు రేసింగ్ అంటే మహా పిచ్చి అని.. అది కేవలం హాబీ గా మాత్రమే అలా పక్కకి పెట్టలేదు. ఇష్టమైన దాన్నే కెరీర్ గా ఎంచుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా.. ఇందులోనే బెస్ట్ అనిపించుకోవాలని చెప్పి మనోడు ఆటో మొబైల్ ఇంజినీరింగ్ కూడా ఫినిష్ చేశాడు. మన హైదరాబాద్ లో ట్రాక్స్ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలలో ఉన్న రేసింగ్ ట్రాక్ ల మీద తనకు తానుగా ప్రాక్టీస్ చేసేవాడు..
ఇక అనింధిత్ కుటుంబం విషయానికి వస్తే కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నవారే. అనింధిత్ అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి గారికి మనవుడు అవుతాడు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో డైరెక్టర్ సునితరెడ్డి లకు కుమారుడు. ఐనా కాని అనింధిత్ తన గురించి తాను అంతగా ఎవ్వరికి చెప్పుకోడు. మంచి రేసర్ గానే తనని గుర్తించాలని తపించేవాడు.
నాలుగు సంవత్సరాల నుండి(2014) ప్రొఫేషనల్ గా మొదలుపెట్టిన అనింధిత్ ఐదు చాంపియన్ షిప్ లను గెలుచుకున్నాడు. 2017లో పాల్గొన్న 33 రేసుల్లో 20 సార్లు పోడియం ఫినిష్ చేసి అందరిని ఆశ్చర్యానికి లోను చేశాడు. ఒకే సీజన్ లో 2 టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడు అవడంతో నేషనల్ అవార్డ్ కూడా వరించింది. అనింధిత్ నడిపే ఫార్ములా-3, ఫార్ములా-4 కార్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇంత వేగంతో నడపాలంటే మనసును ఆధీనంలో ఉంచుకోవాలి, అనింధిత్ ఫిజికల్ గానే కాకుండా, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అనింధిత్ ప్రస్తుత దృష్టి అంతా వచ్చే ఆసియా గేమ్స్ మీదనే.. అందరికి డబ్బు సంపాదించడం మొదటి Priority తర్వాతే ఇష్టాలయినా, హాబిలైనా.. అనింధిత్ కు మాత్రం మొదటి Priority రేసింగ్ యే.. ఫార్ముల-3, 4 కార్ ప్రాక్టీస్, టోర్నీల తర్వాత మిగిలిన సమయమంతా సొంత బిజినెస్ పనులలో నిమగ్నమవుతాడు.