All You Need To Know About Anantpur's Famous Siddeswara Swami Temple!

Updated on
All You Need To Know About Anantpur's Famous Siddeswara Swami Temple!

అది కాశి విశ్వనాధుని దేవాలయమైన, మన ఇంటి దగ్గరిలోని గుడి ఐనా పరమేశ్వరుడిని ఏ దేవాలయంలో చూసినా కాని లింగ రూపంలోనే దర్శనమిస్తున్నారు.. మానవ ఆకారంలో ప్రతిమరూపంలో దర్శనమివ్వడం అనేది చాలా తక్కువ దేవాలయాలలో మాత్రమే జరుగుతుంది. అలా విగ్రహరూపంలో దర్శనమిచ్చే అతి తక్కువ దేవాలయాలలో ఈ సిద్దేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. పరమేశ్వరుని ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. లింగరూపంలో దర్శనమివ్వడానికి ఏ కారణం ఐతే ఉంటుందో విగ్రహ రూపంలో దర్శనమివ్వడానికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది.

Siddheswara-Swamy-Hemavathi5-copy
Siddheswara-Swamy-Hemavathi6-copy

ఈ గుడి అనంతపురం జిల్లా నుండి 150కిలోమీటర్లకు దూరంగా ఉన్న అమరాపురం మండలంలోని హేమావతిలో వెలసిల్లుతుంది. ఈ ఆలయం ఎంత మహిమ గలదో అంతే పురాతనమైనది కూడా. పూర్వం నలంబరాజులు 7వ శతాబ్ధంలో హేమావతిని రాజధానిగా చేసి సుమారు 350 సంవత్సరాలు తమ రాజ్యాన్ని పాలించారని చెబుతారు. వారి కాలంలోనే ఈ ఆలయాన్ని స్థాపించారని ఆ తర్వాత వచ్చిన పల్లవ రాజులు మొదలైనవారు అభివృద్ధి చేశారని స్థానికుల కథనం.

Siddheswara-Swamy-Hemavathi11-copy
Siddheswara-Swamy-Hemavathi14-copy

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఆలయ గోడలు, గోపురం మీద చెక్కిన శిల్పాల గురించి.. దేవాలయం అతి పురాతనమైనది కావడంతో నాటి కళాకారుల శిల్పాబిరుచి వీటిలో మనకు తెలుస్తుంది. ఈ గుడి ఇరుకుగా కాకుండా చాలా విశాలంగా సుమారు 12 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ దేవాలయంలోనే కాలబైరేశ్వర, పంచలింగేశ్వర, మల్లేశ్వర స్వామి, విరుపాక్షేశ్వర స్వామి మొదలైన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరు అడుగుల శివ లింగం కూడా ప్రత్యేక శక్తివంతగా, ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అన్ని రకాల పూజలు జరుగుతాయి. దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రితో పాటు, పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి.

Siddheswara-Swamy-Hemavathi-copy
18157552_1048252395305107_3527224868998433823_n
Siddheswara-Swamy-Hemavathi2-copy