Presenting 'Kaalam Cheppina Katha - Episode 2', A Tale Of How Leaders Manipulate People!

Updated on
Presenting 'Kaalam Cheppina Katha - Episode 2', A Tale Of How Leaders Manipulate People!

Written By Naga Chetan

సాయంత్రం ఏడు గంటలకి పద్మజ గారి ఇంట్లో.. అమ్మ: బబ్లూ ఇక ఆ కార్టూన్స్ చూసింది చాలు వచ్చి హోంవర్క్ చెయ్యీ.. బబ్లూ: అమ్మ కొద్ది సేపు ఆగి చేస్తా అమ్మ.

అమ్మ: కొద్ది సేపు తర్వాత ఇక ఆకలి అన్నం పెట్టు అంటావ్.. తర్వాత నిద్రొస్తుంది అంటావ్.. హోం వర్క్ ఎప్పుడు చేస్తావ్ బబ్లూ.? బబ్లూ: అమ్మ 5 మినిట్స్ అమ్మ ప్లీజ్.. తర్వాత ఖచ్చితంగా చేస్తా. అమ్మ: సరే 5 మినిట్స్ అంతే బబ్లూ: హాన (ఒక పది నిముషాలు తర్వాత) అమ్మ: బబ్లూ నువ్వు టీవీ కట్టేసి బుక్స్ తీస్తావా. లేకుంటే నీకు రెండు తగిలించన.! (బబ్లూ టీవీ కట్టేసి బాగ్ తెచ్చుకొని బుక్ ఓపెన్ చేస్తాడు..) బబ్లూ: అమ్మ కరెంటు పొయింది. అమ్మ: ఈ కరెంటు కూడా పోయింది, ఈ రోజు నీ హోం వర్క్ అయినట్లే.. అయిన ఏం కరెంటో ఏంటో ఈ టైం లో పోయింది. బబ్లూ: అమ్మ కరెంటు వచ్చే లోపు ఎదైన కథ చెప్పచ్చు గా ...బోర్ కొడుతుంది. అమ్మ: కథ?????? హాన సరే. నీకు కరెంటు పోతే ఎలా వుంటుంది.?

బబ్లూ: అంత చీకటిగా వుంటుంది.. చెమట పడుతుంది.. ఫ్యాన్ ఉండదు కదా. అమ్మ: రోజంతా కరెంటు లేకపోతే?? బబ్లూ: రోజంతాన??????? నేను అస్సలు ఉండలేను. అమ్మ: ఒక ఊరిలో రోజంతా కరెంటు లేకపోవడం వల్ల అక్కడున్న జనాలు కరెంటు ని దొంగతనం చేయడం మొదలు పెట్టారు తెలుసా. బబ్లూ: ఏంటి కరెంటు ని కూడా దొంగతనం చేయెచ్చా? అదెలా?? ఎక్కడమ్మా?? అమ్మ: అనగనగా కాన్పూర్ లో..............................

(2011 కాన్పూర్ KESCO(Kanpur electricity supply company)లో అప్పుడే MDగా బాధ్యతలు తీసుకున్న రితు మహేశ్వరి IAS. కాన్పూర్ లో విద్యుత్ పరిస్థితుల్ని పరివేక్షించిన తరువాత అధికారులతో సమావేశం లో..)

రితు: కాన్పూర్ లో 27 లక్షల ఇళ్ళు వున్నాయి, కాని కరెంటు కనెక్షన్ వుంది మాత్రం 5 లక్షల ఇళ్ళకు మాత్రమే. అధికారి: అవును మేడం. ఒక్కప్పుడు కాన్పూర్ ని మాంచెస్టర్ అఫ్ ఈస్ట్ అనేవారు. ఇక్కడ లేని ఇండస్ట్రీ లేదు, సిల్క్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీ ఎన్నో కాని ఒకప్పటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని ఇప్పుడు మూత పడ్డాయి, కేవలం కరెంటు లేకపోవడం వల్లే.. రితు: చరిత్ర నాకు అవసరం లేదండి, ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చెప్పండి చాలు. అధికారి: కాన్పూర్ లో చాలా ఇళ్ళకి ఒక్కప్పుడు కరెంటు కనెక్షన్ వుండేది. కాని ఇక్కడ చాల మంది కరెంటు బిల్లులు కట్టరు, అందుకే కనెక్షన్ కట్ చేశాం. రితు: చాల ఇళ్ళు, ఇండస్ట్రీస్ బిల్లు లు కట్టలేదని కరెంటు కట్ చేసారు. అలా అయితే మన సప్లై డిమాండ్ మీట్ అవ్వాలి కదా... కాని అలా జరగడం లేదు.. ప్రతి ఏరియా లో ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యి పేలి పోతున్నాయని మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది.. అధికారి: అవసరం మనిషితో ఏదైనా చేయిస్తుంది.. చదువులేని వాడు కూడా సాహసాలకు పూనుకుంటాడు. రితు: నా ప్రశ్నకి మీ జవాబు సరి తూగట్లేదు.. ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు?

అధికారి: మేడం మీకు తెలియంది కాదు, ఉత్తరప్రదేశ్ కరెంటు ఉత్పతి లో చాల వెనుకబడుంది. ఇందుకు రెండు కారణాలు.. మొదటిది మన దగ్గర వనరులు లేకపోవడం, రెండోది వనరులున్నా నిధులు లేకపోవడం.. ఒక కాన్పూర్ లోనే ప్రజలు బిల్లులు కట్టక పోవడం వళ్ళ వచ్చిన నష్టం 2000 కోట్లు.! రితు: చాల కనెక్షన్లు కట్ చేశాం అన్నారు. మరి ఇంత నష్టం ఎలా వచ్చింది? అధికారి: మనం కట్ చేసిన జనాలు కరెంటు ని వాడుకుంటున్నారు.. దొంగతనంగా.. కాన్పూర్ లో పగలంతా కరెంటు ఉండదు రాత్రి మాత్రమే వుంటుంది.. అప్పుడే వెలుగులోకి వస్తాయి అన్ని దొంగ కనెక్షన్ లు.. మెయిన్ సప్లై నుంచి వెళ్ళే వైర్ కి ఒక కాపర్ వైర్ ని తగిలించి ఆ కాపర్ వైర్ ని వాళ్ళ ఇంటి మెయిన్ కి సప్లై ఇచ్చుకుంటారు.. అంటే కరెంటుని దొంగాలిస్తునారు.. ఉదయానికి అన్ని కాపర్ వైర్లు తీసేస్తారు.. రితు: ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? అధికారి: మేడం ఏ ఇల్లు ఇలా కరెంటు లాగుతున్నారూ చెప్పడం చాల కష్టం. ఎందుకంటే ఆ దొంగ కనెక్షన్లు అన్ని రాత్రి మాత్రమే పగలు అంత మాములుగా వుంటుంది. రితి: మరి రాత్రి వెళ్లి ఇన్స్పెక్షన్ చేయ్యోచు కదా.!

అధికారి: రాత్రా?? మన వర్కింగ్ అవర్స్ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 6:00 వరకే కదా.. రితు: ప్రభుత్వం ఉన్నది ప్రజాసంరక్షణ కైనా అది జరగాలంటే నిధులు వుండాలి. నిధులు వుంటే విద్యుత్ సరఫరా పెంచొచ్చు. కేవలం బిల్లులు కట్టక పోవడం వల్ల వచ్చిన నష్టమే 2000 కోట్లు అంటున్నారు. అంటే ఆ డబ్బుతో ఎంత సరఫరా మెరుగు పరుచవచ్చు ఆలోచించారా?? పని గంటల్లోనే పని చేస్తాం అంటే పని జరగదు. మీరేం చేస్తారో నాకు తెలీదు, బిల్లు బకాయిలన్నీ పూర్తి అవ్వాలి. దొంగ కరెంటు తీసుకున్న వాళ్ళందరికి ఫైన్ వెయ్యండి.. ఫైన్ కట్టకపోతే వాళ్ళని అదుపులోకి తీసుకోండి.. ఈ చర్యలన్నీ వెంటనీ జరగాలి లేకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.!

(కాన్పూర్ లో లోహ సింగ్ ఇంట్లో) లోహ సింగ్: (కోపం తో) ఎప్పుడు ఈ అన్నం పచ్చడేనా.. మాంసం వండచ్చు కదా. కమల(లోహ సింగ్ తల్లి): డబ్బులు పెట్టి కొనుక్కుని రా.. అప్పుడు చేస్తా.. కూరగాయలకే డబ్బులు లేవు గాని మాంసం కావాలంట.. పొద్దునంతా ఊర్ల వెంట బలాదూర్ గా తిరగడం.. ఉన్న డబ్బులతో తాగి తందానాలాడడం.. మీ నాన్న కి నిన్నటి నుండి ఒంట్లో బాలేదు, కొంచమైన పట్టించుకుంటున్నావా, ఇల్లు గురించి?? లోహ సింగ్: ఒంట్లో బాలేద? చచ్చిపోమను..ఎందుకు ఇంట్లో అనవసరంగా ఇంటికి భారం. కమల: మీ నాన్న కాదు రా నువ్వు చచ్చిపో.. ఎదిగిన కొడుకు బాధ్యతలు తెలీకుండా తిరగడం కంటే చచ్చిపోవడం మేలు. నువ్వు బాగుపడట్లేదు అన్న బాధ, నీ భారం కూడా నేనే మోయాలనే కర్మ రెండు పోతాయి నాకు.. సిగ్గు లేని జన్మ.. పో చచ్చి పో లోహ సింగ్ తింటున్న ప్లేటుని చెత్తో పక్కకి తోసి .. లోహ సింగ్: అయ్యా తో పాటు నువ్వు కూడా చచ్చిపో నేనొక్కడనే ప్రశాంతంగా వుంటా.! కమల: (ఏడుస్తూ) లోహ.. నేను చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా.. ఎంత కాలం ఆ దొంగ కరెంటు కనెక్షన్లు ఇచ్చుకుంటూ బ్రతుకుతావు.. నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి మళ్ళి క్షేమంగా ఇంటికి వస్తావో రావో అని భయంతో బ్రతుకుతున్న.. అ పని మానేసి ఏదైనా వేరే పని చుస్కోవచ్చు కదా. నాకు వయస్సు ఐపోతుంది ఇంకా ఎంత కాలం అని అన్ని నేనే చేస్కోవాలి.. లోహ సింగ్: (బాధ పడుతూ)నాకు మిమల్ని కష్ట పెట్టకూడదనే వుంది.. కాని నాకు ఈ పని కాకుండా ఇంకా ఏ పని చేత కాదు. కాన్పూర్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి దొంగ కరెంటు అవసరము.. ఇందులో అయితేనే నేను ఎంతో కొంత సంపాధించగలుగుతున్నా.

కమల: ఆరిపోయే చీకటి బ్రతుకులు మనవి.. మనకి ఎమన్నా ఐతే ప్రభుత్వం కాని అధికారులు కాని ఎవరు పట్టించుకోరు.. నువ్వు చేసేదే దొంగ పని. నీకు ఎమన్నా ఐతే ఇక మనకి దిక్కు ఎవరు? లోహ సింగ్: అసలు పేదరికంలో పుట్టడమే ఒక శిక్ష, ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకొకటి ఉంటుందా. (లోహ.. లోహ.. హుస్సేన్ బాష షాప్ లో కరెంటు పోయింది త్వరగ రా) లోహ సింగ్: హాన భాయి వస్తున్నా ఆగు కమల: లోహ వెళ్ళకూ.......

(హుస్సేన్ బాష బెల్టు తయారీ షాప్ లో) హుస్సేన్ బాష: రా లోహ ర... కరెంటు పోయింది. ఇప్పుడే డెలివరీకి ఇవ్వాల్సిన పనులన్నీ ఆగిపోయాయి. త్వరగా ఆ కనెక్షన్ ఇస్తే పని ఐపోతుంది. లోహ సింగ్: కనెక్షన్ వచ్చే దార్లోనే ఇచ్చేశా, మీరు పని మొదలు పెట్టండి. హుస్సేన బాష: లోహ నువ్వే కాని లేకపోతే మాకు రెండు పూటల తిండికి కూడా దిక్కు వుండేది కాదు.. ఈ బెల్టు తయారి షాప్ లోనే కాదు ఇక్కడున్న చిన్న చితక తయారీ షాప్ లు అన్ని నీ పేరు చెప్పుకునే బ్రతుకుతున్నాయి.. మొన్న రంజాన్ మాసంలో కరెంటు లేక నీళ్ళు రాక ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చేది కాని నీ వల్ల ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోయింది.. లోహ సింగ్: కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు ఎదో నాకు వచ్చిన పని చేస్తున్నా. హుస్సేన్ బాష: కాని లోహ ఇక నుండి మన దొంగ కనెక్షన్లు తీస్కోవడం కష్టం ఏమో.! లోహ సింగ్: ఎందుకు?

హుస్సేన్ బాష: ఎవరో రితు మహేశ్వరి అంట కోత్తగా వచ్చిన అధికారి.. దొంగ కనెక్షన్ ల మీద నిగ పెట్టింది. మనం ఇప్పటి వరకు వాడిన దొంగ కరెంటు కి అంత బిల్లు లు కట్టాలని ఆదేశాలు ఇచ్చినదంటా. అంతే కాదు ఇంత దొంగ కరెంటు వాడినందుకు ఫైన్ కూడా కట్టాలంట. లోహ సింగ్: మనం కాదు దొంగలం.. ఈ అధికారులు దొంగలు.. ప్రజలు ఆనందంగా వుండటం వాళ్ళకు నచ్చదు ఎంత సేపు వున్నా వాళ్ళ సుఖాలు వాళ్ళ పనులే కాని ప్రజలు ఎలా వున్నారు వాళ్ళ కష్టలేంటి ఎందుకు దొంగ కరెంటు తీసుకుంటున్నారు అని ఏది పట్టించుకోరు.. మేము గొప్ప అని నిరూపించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు. మొన్న ఎవరో vvip వచ్చారని వాళ్ళు వున్నా ఇంటికి 24 గంటలు కరెంటు ఇచ్చారంట.. డబ్బులు ఉన్నా వాళ్ళేనా మనుషులు, మనం మనషులు కాదా.. బ్రతికినంత కాలం ఈ చీకట్లోనే ఉండలా.. అధికారులు వుండేది ప్రజా సంరక్షణకో లేక దుర్బిక్షానికో అర్థం అవ్వట్లేదు. ఐనా ఇలా దొంగ కరెంటు తీస్కోమని సలహా ఇచ్చింది కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగే.. కరెంటు బిల్లు కట్టలేము అయ్యో మొర్రో అంటుంటే 100 రూపాయలు ఇవ్వు మీ ఇంట్లో ఎప్పుడు కరెంటు వుండే ఉపాయం చెప్తా అని ఈ దొంగ కరెంటు ఎలా తీయాలో నేర్పించాడు.. అధికారులు చేస్తే ఒప్పు మనం చేస్తే తప్పు.! మనం మూగబోయి ఇలాగే ఉన్నంత కాలం మనల్ని దోచుకుంటూనే వుంటారు... దీనిని ప్రతిఘటిస్తూ మనమే ఒక ఉద్యమం చెయ్యాలి.

హుస్సన్ బాష: ఏంటి లోహ ఏదేదో మాట్లాడుతున్నావు.. అధికారులు మనకి అందనంత ఎత్తులో వున్నారు.. మనం ఏం చేయగలం? లోహ సింగ్: ఎత్తుని అందుకోలేక పొవచ్చు కాని ఎంత ఎతైన దానిని కూడా పడగొట్టొచ్చు కదా.. (కాన్పూర్ లో ఇలాంటి ఎంతో మంది లోహ సింగ్ ల స్ఫూర్తి తో KESCO కి వ్యతిరేకంగా ఉద్యమం మొదలు అయ్యింది.. ఈ సందర్భాన్ని అనువుగా తీసుకొని ఒక MLA ప్రజలకి మద్దతు పలికాడు ఉద్యమాన్ని ఇంకా బల పరిచాడు) ప్రజలకోసం అంటూ MLA KESCO MD రితు మహేశ్వరి IAS తో వాగ్వాదానికి దిగాడు. IAS అధికారితో సరిగ్గా ప్రవర్తించలేదని రితు మహేశ్వరి అతన్ని అరెస్ట్ చేయించింది.. ఆ అరెస్ట్ అతన్ని ఇంకా ప్రజలలో ఇంకో మెట్టు పైకి ఎక్కించడానికి తోడ్పడింది.

(ఇలాంటి పరిణామంలో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు.. కాన్పూర్ లో ఎన్నికల ప్రచారం లో MLA) MLA: అధికారులు ప్రజల కళ్ళకి గంతలు కట్టి ప్రజా సొమ్ము ని దుర్వినియోగం చేస్తున్నారు. నిధులు లేవని అందుకే పనులు జరగట్లేదని ప్రజలని మభ్య పెడుతున్నారు. ఇక వాళ్ళ దుశ్చర్యలకి కళ్ళెం వేద్దాం. మనమంతా ఏకం అయ్యి మన హక్కులన్నీ గొంతెత్తి చెబుదాం. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేశం లో వుండే ప్రతి ఒక్క వనరుల్ని ఉపయోగించే హక్కు వుంది.. అలా ఉపయోగించుకుంటే ఫైన్ లు వేస్తారా? ఇక అన్యాయాన్ని సహించేది లేదు.. నన్ను గెలిపించండి, మీ కోసం నా ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతా.. పై అధికారులతో మాట్లాడి కాన్పూర్ కి 20 గంటలు కరెంటు వచ్చేలా చూస్తా, నిత్యం తాగు నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటా.. కాన్పూర్ లోని ప్రతి ఇంట్లో వెలుగును నింపుతా.. మీకోసం ఎన్ని త్యాగాలైనా చెయ్యడానికి నేను సిద్ధం.. మరి నాతో ముందుకు నడవడానికి మీరూ సిద్ధమా??? జనం సిద్ధం సిద్ధం అని ఆ MLA వాగ్ధానాలకు మంత్రముగ్దులు అయ్యారు.. అన్ని ఓట్లు అతనికే గుద్దారు.. తనే MLA గా అతని పార్టీ యే ఉత్తర ప్రదేశ్ లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది..........

బబ్లూ: మొత్తానికి ఒక మంచి లీడర్ ని ఎన్నుకున్నారు జనాలు. అమ్మ: (నవ్వుతూ) రాజకీయ నాయకుల మాటలు ఎడారిలో ఎండమావులు లాంటివి, కనిపిస్తూ ఊరిస్తాయి, కాని దాహం తీర్చటానికి పనికి రావు. బబ్లూ: మరి ఆ తర్వాత ఏం అయ్యింది అమ్మ? అమ్మ: ఏమవుతుంది ప్రజల సానుభూతితో అతను MLA గా గెలిచాడు. తనని అరెస్ట్ చేయించిందనే కోపంతో రితు మహేశ్వరిని ఒక్క చిన్న టౌన్ కి transfer చేయించాడు.. ఇక ప్రజలంటవా...ఇంకా చీకటి బ్రతుకులే ఎప్పటిలాగానే 16 గంటలు పవర్ కట్ తో మళ్ళి దొంగ కనెక్షన్ లు మొదలు పెట్టారు.

బబ్లూ: పాపం పిచ్చి జనాలు

రితు మహేశ్వరి ఒక కటినమైన ప్రభుత్వ అధికారి ఐనప్పటికి నిధులు ఉంటేనే ఏ పని ఐనా చేయగలము, నిధులు ఉంటేనే ప్రజలకకు సేవలు అందించగలము అని నమ్మింది. తన దృష్టిలో తను చేసిన పని ముమ్మాటికి కరెక్ట్. కాన్పూర్ లో ప్రజల ముఖ్య సమస్య కరెంటు లేకపోవడమే తెలుసుకొని మెరుగైన సేవలు అందించడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.. కాని ప్రజల సహకారం లేనిది ఎన్ని చర్యలు తీసుకున్నా ఏం ప్రయోజనం!!!!

ఇక కాన్పూర్ ప్రజలు, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది అని తెలిసినప్పటికి వాళ్ళ సొంత ప్రయోజనాలకి దొంగ కరెంటు తీస్కోవడం మొదలు పెట్టారు. అది తప్పేం కాదు ఎందుకంటే అలా తీసుకోకపోతే వాళ్ళ జీవనం ముందుకు నడవదు కాబ్బట్టి. ప్రజల దృష్టిలో అధికారులు ప్రజా సమస్యలని పట్టించుకోరు వాళ్ళకు కావాల్సింది కేవలం డబ్బులు మాత్రమే అనేది కూడా నిజం. ఇక MLA, తను అధికారం చేపట్టడానికి దొరికిన ఏ అవకాశం వదలకుండా ఒక నిజమైన నేటి కాలం నాయకుడు అనిపించుకున్నాడు. తనకి అధికారం రాగానే ఒక ఐఏఎస్ అధికారిని transfer చేయించి అతని అసలురంగును బయటపెట్టాడు.. నమ్మి ఓట్లు వేసిన ప్రజలు చేతులు కాల్చుకున్నారు