This Inner Conflict Of A Guy Who Left To USA And How His Lifestyle Has Changed Will Make You Think Twice!

Updated on
This Inner Conflict Of A Guy Who Left To USA And How His Lifestyle Has Changed Will Make You Think Twice!

Contributed by Raviteja Ayyagari

అమెరికా! ఒకరు వ్యాపారం కోసం, ఒకరు విరామం కోసం, మరొకరు వృత్తి కోసం వస్తూ ఉంటారు. కారణం ఏదైనా ప్రతి మనిషి జీవితం లో ఒక్కసారైనా రావాలి అని కోరుకునే ఒక సుందరమైన ప్రపంచం. కాదు కాదు! పద్మవ్యూహం. పద్మవ్యూహం అని ఎందుకు అన్నాను అంటే, ఒకసారి వెళ్తే ఇక్కడే స్థిరపడిపోతారు కదా! అందుకు. అలాంటి ఈ దేశానికీ ఒక యువకుడు కొత్త గా కొన్న VIP suitcase నిండా బట్టలు, ఎప్పుడు వాడని మెదడు నిండా ఎన్నో ఆలోచనలను, మనసునిండా తాను వీడ్కోలు చెప్పిన మనుషులతో గడిపిన జ్ఞాపకాలు, ఫ్లైట్ ఎక్కాక అమెరికా వెళ్ళబోతున్నాను అని రెండు రోజులుగా మానుకున్న నిద్రను మోసుకుని వచ్చాడు. అతను చేరిన కొత్తలో చాల కొత్త విషయాలు, జీవితం నేర్పిన విలువైన పాఠాలు నేర్చుకున్నాడు.

ఇలా ఇన్ని విషయాలు నేర్చుకోవడంతో పాటు, బతుకు బండి ని నడిపించడానికి ఒక చోట ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మంచి జీతం, సుఖమైన జీవితం. కానీ ఎదో వెలితి. రోజు మొత్తం గడిచాక, రాత్రి నిద్రపోయే సమయం లో ఆ వెలితి బయటకి కనిపిస్తుంది. ఉహల్లో ఒక యుద్ధం చేస్తాడు. పాండవులు, కౌరవులు లేని, కృష్ణుడు నడిపించని కురుక్షేత్ర యుద్ధం. అతనే కౌరవడు, అతనే పాండవుడు. అతనే భగవద్గితను అర్జునుడికి బోధించిన కృష్ణుడు. అతనే ఆ గీతని అర్ధించిన అర్జునుడు. అతను ఇవాళ్టి తో ఈ దేశం లో 4 సంవత్సరాదులు, అదే ఉగాదులు చూసాడు. రోజులాగే ఆఫీస్ నుంచి వచ్చాడు. డోర్ తెరిచాడు. తన రూమ్ లోకి వెళ్ళాడు. స్నానం చేసాడు. ఇంటికి మోసుకుని వచ్చిన పని ని చేస్కుంటూ కూర్చున్నాడు. మళ్ళీ ఒక భగవద్గిత ఘట్టం మొదలవ్వబోతోంది. ఈ సారి అది ఎవరి రూపం లో రాబోతోందో చూద్దాం.

అంతరాత్మ: Who are you? Who are you? Tere Dil se Zara poocho sala who are you? నిఖిల్: నువ్వు!? అంతరాత్మ: నేను రా! నీ లోని ఒక కోణాన్ని. ఒక రకంగా చెప్పాలంటే నీ అంతరాత్మని. నిఖిల్: మరి ఇన్నాళ్లు కనిపించలేదు? అంతరాత్మ: నువ్వు అద్దం ముందు నీతో నువ్వు మాట్లాడుకుంటూ మహేష్ బాబు లాగా performance ఇచ్చినప్పుడల్లా నేను నిన్న గమనించేవాడిని. నాకు రోజు అదో టార్చర్. ఇంక ఇవాళ ఆ టార్చర్ తట్టుకోలేక తాడో పేడో తేల్చుకుందాం బయటకి వచ్చేసాను. ఇంక ఇవాళ నువ్వు అవుట్ రా నా చేతిలో! నిఖిల్: అది సరే, నువ్వు ఇలాంటి డ్రెస్ వేస్కున్నావేంటి? అంతరాత్మ: ఓరి బాబోయ్! నీలో ఒక rockstar ఉన్నాడు అన్న విషయం కూడా నీకు తెలీదా? అవును రా, అసలు ఈ కాలం లో నీ ఏజ్ వాళ్ళందరూ చాల హుషారు పాటలు వింటుంటే, నువ్వెంట్రా అన్నమయ్య గీతం, ఆవకాయ అన్నం అంటావ్? నిఖిల్: తప్పేంటి? ఆలా ఉంటె? నాకు అవి ఇష్టం. అలాగని మిగిలినవి నాకు ఇష్టం లేదు అని కాదు. అంతరాత్మ: సరే. అది పక్కన పెట్టు. రోడ్ మీద, నీలో నువ్వే మాట్లాడేసుకుంటావ్. నీ అదృష్టం కొద్దీ earphones పెట్టుకుంటావనుకో, లేకపోతే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నిఖిల్: ఏమనుకుంటారు? అంతరాత్మ: మెంటల్ అనుకుంటార్రా మెంటల్ గా. నిఖిల్: అసలు నువ్వెందుకొచ్చావ్? అంతరాత్మ: నీ గురించి నీకు చెప్పటానికి. నిఖిల్: నా గురించి నాకు బానే తెలుసు. అంతరాత్మ: రేయ్, నువ్వు ఆంజనేయుడి లాంటోడివి. నీ శక్తి నీకు తెలీదు. నిఖిల్: నీకు తెలుసా? నువ్వు నాలోని అంశమే అంటున్నవ్ కదా! అంతరాత్మ: అది చెప్పడానికే గా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు రోజు నువ్వు పడే వ్యధ ఏంటి? నాకు తెలుసు! కానీ నీ నోటి తో వినాలి అనుకుంటున్నాను. నిఖిల్: అలాంటిది ఏమి లేదు. అంతరాత్మ: ఉంది! నిఖిల్: లేదు! అంతరాత్మ: ఉంది! నిఖిల్: లేదు! అంతరాత్మ: లేదు! నిఖిల్: ఉంది! ఉంది! ఉంది! అంతరాత్మ: చూసావా! నువ్వు ఎదో విషయం గురించి సతమతమవుతున్నావ్. చెప్పు. నాతో చెప్పు. నిఖిల్: ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అంతరాత్మ: పప్పన్నం తో స్టార్ట్ చెయ్, నెయ్యి వేస్కుని! నిఖిల్ కోపం గా చూస్తాడు... అంతరాత్మ: సారీ! సారీ! చెప్పు. నిఖిల్: నా జీవితం మీద నాకంటూ ఒక క్లారిటీ లేదు. అంతరాత్మ: నువ్వు తీసే ఫొటోలలోనే క్లారిటీ ఎడిసి చావదు. ఇంక జీవితం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకో! నిఖిల్: చెప్పనిస్తావా? అంతరాత్మ: తథాస్తు! నిఖిల్: నేను చదువుకున్న చదువుకి, నేను చేస్తున్న ఉద్యోగానికి, నేను సాధించాలి అనుకున్న ఆశయాలకు ఎక్కడ పొంతన లేదు. నేను చదివిందేమో సివిల్ ఇంజనీరింగ్, నేను చేస్తుందేమో కొన్ని లక్షల మంది చేస్తున్న జాబ్: అదే సాఫ్ట్వేర్ లో. Ctrl+ c, ctrl+v కొడుతూ కూర్చోవడం. గంటలు గంటలు మేము మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అని క్లయింట్ ని బక్రా చెయ్యడం. “Hi Mark,This is the update for this week kindly let us know if you need anything else” అని ఒక మెయిల్. కానీ మా నిజాయితీ గురించి తెలిస్తే మాత్రం, వాడి కంప్యూటర్ కి ఉండే మౌస్ తో ఉరేసేస్కుంటాడు ఎదవ! ఇంక నా ఆశయం అంటావా, ఆ యేసు ప్రభువుకే తెలియాలి! అంతరాత్మ: నీ గ్రాంథిక తెలుగు లో నా తమలపాకు, కొంచం మనుషుల భాష లో చెప్పారా! నిఖిల్: Jack of All Trades, Master of None అని వైన్ ఉంటావ్ గా! ఇప్పుడు నా పరిస్థితి అదే. నేను డాన్స్ బాగా చేస్తాను, పెయింటింగ్స్ బాగా వేస్తాను, వంట కూడా బాగ్ చేస్తాను. కానీ, ఇవన్నీ చెయ్యకుండా, అసలు ఎక్కడ నుంచి వచ్చింది కూడా తెలియని IT జాబ్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న నాకు తెలిసిన ఒకతను డాన్స్ ఇండియా డాన్స్ లో విన్నర్ అయ్యాడు, తెలుగు సినిమా హీరోలకి డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్నాడు. అంతరాత్మ: ఎవడు? ఆ కుంటోదిలాగా స్టెప్స్ వేస్తూ ఉంటాడు, వాడేనా! అయినా వాడు డాన్సర్ ఏంటి? కాళ్ళ కింద చీమలు పెడితే ఎలా చేస్తారో ఆలా ఊగుతూ ఉంటాడు ముదనష్టపు సచ్చినోడు! నిఖిల్: సర్లే! నువ్వు నా ఇన్నర్ ఫీలింగ్ వి కాబట్టి నువ్వు అనేది తప్పు అనలేకపోతున్న. సరే విను. అంతెందుకు, నివేద థామస్, నాకంటే రెండు ఏళ్ళు చిన్నది. హీరోయిన్ అయిపొయింది. ఎక్కడ పడితే ఇంటర్వూస్ ఇచ్చేస్తోంది! అంటే of course నేను కూడా ఇస్తున్నాననుకో రోజు మా బాస్ కి! నేను చేసే కాపీ పేస్ట్ వర్క్ గురించి! ఒకడు రెహ్మాన్ దగ్గర అసిస్టెంట్ అంటాడు, ఇంకొకడు పవర్ స్టార్ తో షూట్ అంటాడు, ఇంకొకడు బాంబు బ్లాస్ట్ అంటాడు. అంతరాత్మ: బాంబు బ్లాస్ట్ ఆ! నిఖిల్: ఎదో ఫ్లో లో అన్నాను. నువ్వు గట్టిగ వచ్చి అరిస్తే ఎవడో ఒకడు వచ్చి మనల్ని ఏసేస్తాడు. అవును, నువ్వు నాకు తప్ప ఎవరికీ కనిపించవు కదా! మరి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? అంతరాత్మ: నువ్వు ఒక పూమ్పుహార్ గాడివి కాబట్టి! నిఖిల్: అంటే? అంతరాత్మ: అంటే పులిహార గాడివి అని అర్థం. పేరుకే పులి, లోపల అంత ఖాళీ. నిఖిల్: ఉద్ధరించావ్ లే కానీ, విను. నేను రోజు ఆఫీస్ కి వెళ్తాను, నాకైతే ఒకటే లైన్ గుర్తొస్తుంది SVSC సినిమా లోది. "ఏడొందల కోట్ల మంది లో ఎవరికీ తెలియని వాళ్ళ లిస్ట్ లో ఒకటిగా బతుకుతూ రోజు గడపకోయ్ కామన్ మాను" శాస్త్రి గారు రాసింది. ఎటు వైపు చూసినా జనం. అసలు ఎక్కడ నుంచి వస్తారో, ఎక్కడ నుంచి పోతారో అర్థం కాదు. నిజానికి ట్రైన్ డోర్ మూసేసి ఉంటుంది కానీ, లేకపోతే, స్టాప్ వచ్చే ముందే ఫ్యూట్బోర్డుయింగ్ లోనే దిగిపోతారు! కానీ డోర్ తెరుచుకున్నాక ఒకే సారి దూసుకుని వెళ్ళిపోతారు ఎదో గంటల గంటల సేపు ఆపుకుని ఒకే సారి పోస్తే ఎలా ఉంటుందో ఆలా! ఇంత మంది లో నాకంటూ ఒక గుర్తింపు లేదు. నాకు ఆలా బతకడం ఇష్టం లేదు. కానీ, నేను ఆలా అనుకున్న ప్రతి సారి, ఎవడో ఒకడు వచ్చి “Hey! How are you doing antadu?” అంటే, ఎలా చేస్తున్నావేంటో? ఎండిలకులు ఎత్తుకుంటావా అన్నట్టు. ఇదే ఇండియా లో చెయ్, ఢిల్లీ లో నా గల్లీ, రెండో నిమిషం లో పోలీస్ స్టేషన్ లోనే, లేకపోతే హాస్పిటల్ లోనో ఉంటాము. నా మనసు లోని ఎన్నో ఆలోచనల మధ్య లో యుద్ధం నడుస్తుంది. రక్తపాతం లేని, శత్రువులు లేని, విచిత్రమైన యుద్ధం. రాత్రి కళ్ళు మూసి, కలలోకి ప్రవేశించే వరకు కొన్ని క్షణాలు నరకం చూపిస్తుంది. ఆ కొన్ని క్షణాలు, కొన్ని యుగాలు లాగా గడుస్తాయి. అదే నేను పడుతున్న వ్యధ. నీకు తెలియనిది కాదు. నేను మర్చిపోయేది కాదు. సంతోషమా? అంతరాత్మ: నేను చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన ఒక కథ ఉంది. ఏం జరిగిన మన మంచికే అనే ఒక కథ! అనగనగ ఒక రాజు! నిఖిల్: రాజుకి ఏడు కొడుకులా!? అంతరాత్మ: ఇక్కడ కొడుకులు లేరు! ఒక మంత్రి ఉన్నాడు. ఒక రోజు రాజు మంత్రిని, సైన్యాన్ని వెంట తీస్కుని వేటకి వెళ్తాడు. ఒక జింక ని చూసి బాణం తీస్తాడు. బాణం చాల వీక్ అనుకుంట, బాణం అంచు విరిగి, రాజు గారి కాళీ బొటన వేలు కోసుకుపోతుంది. అంతే ఒక్కసారి గా రాజుగారు గట్టిగా అరిచారు! ఈ మంత్రిగారు ఊరుకొచ్చు గా, కెలికి మరి రాజు తో అంటాడు, బాధపడకని మహారాజ ఎం జరిగిన మన మంచికే అని. రాజుగారికి బాగా కాలి నా కాళీ వేలు కోసుకుని నేను ఏడుస్తుంటే, వెక్కిరిస్తావ్, అని చెప్పి, మంత్రి ని జైలు లో పెడతాడు.

కొన్ని రోజుల తర్వాత మహారాజు ఒక్కడే వేటకి వెళ్తాడు. అడవి కోయ జాతి వాళ్ళకి దొరికిపోతాడు. వాళ్ళు రాజు ని బలి ఇద్దాం అనుకుంటారు. కానీ రాజుగారికి వేలు లేదా గా. సో, వాడి కంప్లీట్ man కాదు, రేమాండ్స్ వేసుకోలేదు అని చెప్పి పంపించేస్తారు. సో రాజు కి మంత్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వెంటనే మంత్రి తో అంటాడు. “Bro, I am sorry bro. What you said was right about edi jarigina mana manchike” కానీ, నీకేం మంచి కరిగింది జైలు లో పెట్టడం వల్ల?

అప్పడు మన్తర్హి అంటాడు, నేను జైలు లో ఉండి ఉండకపోతే నీతో పాతు వేట కి వచ్చే వాడిని, నేను రేమాండ్స్ వేసుకున్న కంప్లీట్ మాన్ అని చెప్పి, నన్ను బలి ఇచ్చేస్తారు. సో, ఎం జరిగిన మన మంచికే.

ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడం వల్ల నీకు మంచే జరుగుతుంది. నువ్వు ఈ it జాబ్ చెయ్యడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు నువ్వు బెనిఫిట్ అవుతావు.

ఇంక నువ్వు సంతృప్తి అంటావా? నీ తల్లిదండ్రులకు మించి నీకు ఎవరు ముఖ్యం కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు ఎం చేసిన వాళ్ళ కోసమే అని కూడా తెలుసు. సో, వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించు. నీ ఆసయాలంటావా, వీకెండ్ అంత ఖాళీ ఏ గా అప్పుడు పెట్టుకో. ఒకటి చెప్తా, నీకు నిజమైన ఆనందం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నువ్వంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు. చదువంటావా, నువ్వు చిన్నప్పుడు స్కూల్ లో జియోగ్రఫీ నేర్చుకున్నావు? ఇప్పుడు అది ఎక్కడ ఉపయోగిస్తున్నావ్? ఆ? ఇంజనీరింగ్ కూడా అంతే, 4 సంవత్సరాలు జీవితం లోని కొత్త కొత్త మలుపులు తెలుసుకుని వాటినుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే ఒక గడువు. నువ్వు ఒక కుర్రాడినుంచి ఒక మనిషి గా ఎదగడానికి పట్టె సమయమే ఇంజనీరింగ్. ఇక్కడికి వచ్చాక జీవితం లోని ఇంక కొత్త విషయాలు నేర్చుకున్నావు. ఇవన్నీ జీవితం నీకు నేర్పిన పాఠాలు. నీలోని వాడిగా చెప్తున్నా. నీకు లేనిది క్లారిటీ కాదు, నీకు ఉన్నది చిన్న కన్ఫ్యూషన్. అందుకే అంత దిగులు గా ఉంటున్నావ్. ఇప్పుడు నీకు బాగా అర్థం అయ్యిందనుకుంట. నువ్వు సుఫిసియెంట్ గా సంపాదించాను అని అనుకున్న రోజు, ఇండియా వెళ్ళిపో. నీ ప్రాణం అంత అక్కడే వుంది అన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఒక ట్రెండ్ సృష్టించు. అర్థమవుతోందా? నేను నీకేమి నీతో బోధించట్లేదు. వాస్తవం ఏంటో చెప్తున్నా. చివరిగా ఒక మాట

"మనం అందంగా ఉన్నామా లేమా అనే విషయం అద్దం కూడా చెప్తుంది. కానీ, మనం ఆనందంగా ఉన్నామా లేమా అనే విషయం మన అంతరాత్మ మాత్రమే చెప్తుంది" అందుకే నేను వచ్చాను.

జీవితం నీది, నిర్ణయం నీది. బాయ్!

ఈ చిత్రం లో చూపించిన నిఖిల్ మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం అమెరికా వస్తున్న యువకులు ఎందుకు వస్తున్నారో తెలియకుండా వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు ఇండియా వెళ్ళిపోతామా అనే ఆలోచన లో పడిపోతారు. కళ్ళు మూసి తెరిచేలోపు, ఇంకెప్పుడు తిరిగివెళ్ళలేని పరిస్థితి లో పడిపోతారు. ఇది ఇక్కడ కథ అయితే, భారత దేశం లో ఉన్న వాళ్ళు అమెరికా లో ఉన్న వాళ్ళ జీవితం శైలి మీద ఈర్ష్య పడుతూ ఉంటారు. నిజానికి వీళ్లిద్దరి జీవిత శైలి ఒకేలా ఉంటుంది.

ఎందుకంటే ఎక్కువ మందికి జీవితం మీద క్లారిటీ ఉండదు. ఆనందం గా ఉండడం అంటే అంతస్థు, హోదా, అని అనుకుంటారు. దూరపు కొండలు నునుపు అనే సామెత ఇరు తీరాలా వారికి చెల్లుతుంది. కన్నవాళ్ళని, పుట్టి పెరిగిన దేశాన్ని, ప్రాణ స్నేహితులని వదిలేసి డబ్బు సంపాదించడానికి వీళ్ళు ఇటు వచ్చి ఇవన్నీ మిస్ అవుతున్నాం అని అనుకుంటారు. అక్కడ తీరం వారు ఇక్కడి వాళ్లు జీవితాన్ని తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు అని బాధ పడిపోతూ ఉంటారు.

కానీ ఎవరు ఎం చేద్దాం అనుకున్నారో, ఆ పని మాత్రం చెయ్యట్లేదు. చదువుకున్న చదువుకి, చేస్తున్న పనికి, ఆశలు ఆశయాలకు సంబంధం ఉండదు. కొన్ని కొన్ని సార్లు, వొంటి మీద ఉండే బట్ట కూడా మనది కాదు. అలాంటప్పుడు జీవితం లో అన్ని మనం సాధించేద్దాం అనుకంటె ఎలా? మన ఆశయాలని చిన్న చిన్న మొత్తాలలో నెరవేర్చుకుందాం. మనల్ని ప్రేమించే వారి ఆనందం కోసం మనం పోరాడదాం. నిఖిల్ తన అంతరాత్మ తో గీతోపదేసం చేయించుకున్న తర్వాత తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. జీవితం లో నిజమైన ఆనందం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకుందాం. నేటి యువతకి, రేపటి భారత మా ఈ చిత్రం అంకితం. జై హింద్!